Telugu బైబిల్
కీర్తనల గ్రంథము మొత్తం 150 అధ్యాయాలు
కీర్తనల గ్రంథము
కీర్తనల గ్రంథము అధ్యాయము 3
కీర్తనల గ్రంథము అధ్యాయము 3
1 తన కొడుకు అబ్షాలోము నుంచి తాను పారిపోయినప్పుడు రచించినది. దావీదు కీర్తన. యెహోవా, నాకు శత్రువులు ఎంతోమంది! చాలా మంది నా మీద దాడి చేశారు.
2 దేవుని నుంచి అతనికి ఏ సహాయమూ లేదు అని ఎందరో నా గురించి అంటున్నారు. QSS సెలా. SE
3 కాని యెహోవా, నువ్వే నాకు డాలు, నువ్వే నాకు మహిమ, నా తల ఎత్తేవాడివి.
కీర్తనల గ్రంథము అధ్యాయము 3
4 నేను యెహోవాకు నా స్వరమెత్తినప్పుడు, ఆయన తన పవిత్ర పర్వతం నుండి నాకు జవాబిస్తాడు. QSS సెలా. SE
5 నేను పడుకుని నిద్రపోయాను. యెహోవా నాకు క్షేమం ఇచ్చాడు గనక మేల్కొన్నాను.
6 అన్ని వైపులనుంచి వచ్చి నాకు విరోధంగా మొహరించిన గుంపులకు నేను భయపడను.
కీర్తనల గ్రంథము అధ్యాయము 3
7 యెహోవా, లేచి రా. నా దేవా, నన్ను రక్షించు. నువ్వు నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొడతావు. దుర్మార్గుల పళ్లు విరగ్గొడతావు.
8 రక్షణ* రక్షణ విజయం యెహోవా నుంచి వస్తుంది. నీ ప్రజల మీద నీ ఆశీర్వాదం ఉండు గాక. QSS సెలా. SE