Telugu బైబిల్
యెషయా గ్రంథము మొత్తం 66 అధ్యాయాలు
యెషయా గ్రంథము
యెషయా గ్రంథము అధ్యాయము 4
యెషయా గ్రంథము అధ్యాయము 4
1 ఆ దినమున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టు కొని మేము మా అన్నమే తిందుము మా వస్త్రములే కట్టుకొందుము, నీ పేరుమాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయు మని చెప్పుదురు.
2 ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూష ణమునగును. ఇశ్రాయేలులో తప్పించుకొనినవారికి భూమిపంట అతిశయాస్పదముగాను శుభలక్షణము గాను ఉండును.
3 సీయోనులో శేషించినవారికి యెరూషలేములో నిలువబడినవానికి అనగా జీవముపొందుటకై యెరూషలేములో దాఖ లైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు.
యెషయా గ్రంథము అధ్యాయము 4
4 తీర్పుతీర్చు ఆత్మవలనను దహించు ఆత్మవలనను ప్రభువు సీయోను కూమార్తెలకున్న కల్మషమును కడిగివేయు నప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్యనుండి తీసివేసి దాని శుద్ధిచేయునప్పుడు
5 సీయోనుకొండలోని ప్రతి నివాసస్థలముమీదను దాని ఉత్సవ సంఘములమీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్నిజ్వాలా ప్రకాశమును యెహోవా కలుగజేయును.
6 మహిమ అంతటిమీద వితానముండును పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల యొకటి యుండును.