Telugu బైబిల్
యెషయా గ్రంథము మొత్తం 66 అధ్యాయాలు
యెషయా గ్రంథము
యెషయా గ్రంథము అధ్యాయము 8
యెషయా గ్రంథము అధ్యాయము 8
1 మరియు యెహోవా నీవు గొప్పపలక తీసికొని మహేరు షాలాల్, హాష్ బజ్1, అను మాటలు సామాన్య మైన అక్షరములతో దానిమీద వ్రాయుము.
2 నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడైన ఊరియాను యెబెరెక్యాయు కుమారుడైన జెకర్యాను సాక్షులనుగా పెట్టెదనని నాతో చెప్పగా
3 నేను ప్రవక్త్రి యొద్దకు పోతిని; ఆమె గర్భవతియై కుమారుని కనగా యెహోవా అతనికి మహేరు షాలాల్ హాష్ బజ్2 అను పేరు పెట్టుము.
యెషయా గ్రంథము అధ్యాయము 8
4 ఈ బాలుడునాయనా అమ్మా అని అననేరక మునుపు అష్షూరురాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును షోమ్రోను దోపుడు సొమ్మును ఎత్తికొని పోవుదురనెను.
5 మరియు యెహోవా ఇంకను నాతో ఈలాగు సెల విచ్చెను
6 ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి రెజీనునుబట్టియు రెమల్యా కుమారునిబట్టియు సంతోషించుచున్నారు.
7 కాగా ప్రభువు బలమైన యూఫ్రటీసునది విస్తార జలములను, అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారిమీదికి రప్పించును; అవి దాని కాలువలన్నిటిపైగా పొంగి ఒడ్డు లన్నిటిమీదను పొర్లి పారును.
యెషయా గ్రంథము అధ్యాయము 8
8 అవి యూదా దేశములోనికి వచ్చి పొర్లి ప్రవహించును; అవి కుతికల లోతగును. ఇమ్మానుయేలూ, పక్షి తన రెక్కలు విప్పునప్పటివలె దాని రెక్కల వ్యాప కము నీ దేశ వైశాల్య మంతటను వ్యాపించును.
9 జనులారా, రేగుడి మీరు ఓడిపోవుదురు; దూరదేశస్థులారా, మీరందరు ఆలకించుడి మీరు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు.
10 ఆలోచన చేసికొనినను అది వ్యర్థమగును మాట పలికినను అది నిలువదు. దేవుడు మాతోనున్నాడు.
యెషయా గ్రంథము అధ్యాయము 8
11 ఈ జనులమార్గమున నడువకూడదని యెహోవా బహు బలముగా నాతో చెప్పియున్నాడు; నన్ను గద్దించి యీ మాట సెలవిచ్చెను
12 ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పునదంతయు బందుకట్టు అనుకొనకుడి వారు భయపడుదానికి భయపడకుడి దానివలన దిగులు పడకుడి.
13 సైన్యములకధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడను కొనుడి మీరు భయపడవలసినవాడు ఆయనే, ఆయన కోసరమే దిగులుపడవలెను అప్పుడాయన మీకు పరిశుద్ధస్థలముగా నుండును.
యెషయా గ్రంథము అధ్యాయము 8
14 అయితే ఆయన ఇశ్రాయేలుయొక్క రెండు కుటుంబ ములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కువలగాను ఉండును
15 అనేకులు వాటికి తగిలి తొట్రిల్లుచు పడి కాళ్లు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు.
16 ఈ ప్రమాణవాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యుల కప్పగింపుము.
17 యాకోబు వంశమునకు తన ముఖమును మరుగుచేసి కొను యెహోవాను నమ్ముకొను నేను ఎదురుచూచు చున్నాను ఆయనకొరకు నేను కనిపెట్టుచున్నాను.
యెషయా గ్రంథము అధ్యాయము 8
18 ఇదిగో, నేనును, యెహోవా నా కిచ్చిన పిల్లలును, సీయోను కొండమీద నివసించు సైన్యముల కధిపతియగు యెహోవావలని సూచనలుగాను, మహత్కార్యములు గాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము.
19 వారు మిమ్మును చూచికర్ణపిశాచిగలవారియొద్దకును కిచకిచలాడి గొణుగు మంత్రజ్ఞులయొద్దకును వెళ్లి విచారించు డని చెప్పునప్పుడు జనులు తమ దేవునియొద్దనే విచారింప వద్దా? సజీవులపక్షముగా చచ్చిన వారియొద్దకు వెళ్ల దగునా?
యెషయా గ్రంథము అధ్యాయము 8
20 ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచా రించుడి; ఈ వాక్యప్రకారము వారు బోధించనియెడల వారికి అరుణోదయము కలుగదు.
21 అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలిగొని దేశసంచారము చేయుదురు. ఆకలి గొనుచు వారు కోపపడి తమ రాజు పేరను తమ దేవుని పేరను శాపములు పలుకుచు మీద చూతురు;
22 భూమి తట్టు తేరి చూడగా బాధలును అంధకారమును దుస్సహ మైన వేదనయు కలుగును; వారు గాఢాంధకారములోనికి తోలివేయబడెదరు.