Telugu బైబిల్

యోబు గ్రంథము మొత్తం 42 అధ్యాయాలు

యోబు గ్రంథము

యోబు గ్రంథము అధ్యాయము 24
యోబు గ్రంథము అధ్యాయము 24

1 సర్వశక్తుడగువాడు నియామకకాలములను ఎందుకు... ఏర్పాటుచేయడు?ఆయన నెరిగియున్నవారు ఆయన దినములను ఎందు చేత చూడకున్నారు?

2 సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు వారు అక్రమముచేసి మందలను ఆక్రమించుకొనివాటిని మేపుదురు.

3 తండ్రిలేనివారి గాడిదను తోలివేయుదురు విధవరాలి యెద్దును తాకట్టుగా తీసికొందురు

4 వారు మార్గములోనుండి దరిద్రులను తొలగించివేయుదురుదేశములోని బీదలు ఎవరికిని తెలియకుండ దాగవలసి వచ్చెను.

యోబు గ్రంథము అధ్యాయము 24

5 అరణ్యములోని అడవిగాడిదలు తిరుగునట్లుబీదవారు తమ పనిమీద బయలుదేరి వేటను వెదకుదురుఎడారిలో వారి పిల్లలకు ఆహారము దొరకును

6 పొలములో వారు తమకొరకు గడ్డి కోసికొందురుదుష్టుల ద్రాక్షతోటలలో పరిగ ఏరుదురు.

7 బట్టలులేక రాత్రి అంతయు పండుకొనియుందురుచలిలో వస్త్రహీనులై పడియుందురు.

8 పర్వతములమీది జల్లులకు తడిసియుందురుచాటులేనందున బండను కౌగలించుకొందురు.

యోబు గ్రంథము అధ్యాయము 24

9 తండ్రిలేని పిల్లను రొమ్మునుండి లాగువారు కలరువారు దరిద్రులయొద్ద తాకట్టు పుచ్చుకొందురు

10 దరిద్రులు వస్త్రహీనులై బట్టలులేక తిరుగులాడుదురుఆకలిగొని పనలను మోయుదురు.

11 వారు తమ యజమానుల గోడలలోపల నూనె గానుగ లను ఆడించుదురుద్రాక్ష గానుగలను త్రొక్కుచు దప్పిగలవారైయుందురు.

12 జనముగల పట్టణములో మూలుగుదురుగాయపరచబడినవారు మొఱ్ఱపెట్టుదురు అయినను జరుగునది అక్రమమని దేవుడు ఎంచడు.

యోబు గ్రంథము అధ్యాయము 24

13 వెలుగుమీద తిరుగబడువారు కలరువీరు దాని మార్గములను గురుతుపట్టరుదాని త్రోవలలో నిలువరు.

14 తెల్లవారునప్పుడు నరహంతకుడు లేచునువాడు దరిద్రులను లేమిగలవారిని చంపునురాత్రియందు వాడు దొంగతనము చేయును.

15 వ్యభిచారిఏ కన్నైనను నన్ను చూడదనుకొని తన ముఖమునకు ముసుకు వేసికొని సందె చీకటికొరకు కనిపెట్టును.

16 చీకటిలో వారు కన్నము వేయుదురుపగలు దాగుకొందురువారు వెలుగు చూడనొల్లరు

యోబు గ్రంథము అధ్యాయము 24

17 వారందరు ఉదయమును మరణాంధకారముగాఎంచుదురు.గాఢాంధకార భయము ఎట్టిదైనది వారికి తెలిసియున్నది.

18 జలములమీద వారు తేలికగా కొట్టుకొని పోవుదురువారి స్వాస్థ్యము భూమిమీద శాపగ్రస్తముద్రాక్షతోటల మార్గమున వారు ఇకను నడువరు.

19 అనావృష్టిచేతను ఉష్ణముచేతను మంచు నీళ్లు ఎగసి పోవునట్లుపాతాళము పాపముచేసినవారిని పట్టుకొనును.

20 కన్నగర్భము వారిని మరచును, పురుగు వారిని కమ్మగా తినివేయునువారు మరి ఎప్పుడును జ్ఞాపకములోనికి రారువృక్షము విరిగి పడిపోవునట్లు దుర్మార్గులు పడిపోవుదురు

యోబు గ్రంథము అధ్యాయము 24

21 వారు పిల్లలు కనని గొడ్రాండ్రను బాధపెట్టుదురువిధవరాండ్రకు మేలుచేయరు.

22 ఆయన తన బలముచేతను బలవంతులను కాపాడుచున్నాడుకొందరు ప్రాణమునుగూర్చి ఆశ విడిచినను వారు మరల బాగుపడుదురు.

23 ఆయన వారికి అభయమును దయచేయును గనుక వారు ఆధారము నొందుదురుఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచును

24 వారు హెచ్చింపబడిననుకొంతసేపటికి లేకపోవుదురువారు హీనస్థితిలో చొచ్చి ఇతరులందరివలె త్రోయబడుదురు, పండిన వెన్నులవలె కోయబడుదురు.

యోబు గ్రంథము అధ్యాయము 24

25 ఇప్పుడు ఈలాగు జరుగని యెడల నేను అబద్ధికుడనని రుజువుపరచువాడెవడు? నా మాటలు వట్టివని దృష్టాంతపరచువాడెవడు?