న్యాయాధిపతులు అధ్యాయము 17
1 మీకా అను నొకడు ఎఫ్రాయిమీయుల మన్యదేశ ములో నుండెను.
2 అతడు తన తల్లిని చూచినీ యొద్ద నుండి తీసికొనినరూకలు, అనగా నీవు ప్రమాణముచేసి నా వినికిడిలో మాటలాడిన ఆ వెయ్యిన్ని నూరు వెండి రూకలు నా యొద్దనున్నవి. ఇదిగో నేను వాటిని తీసి కొంటినని ఆమెతో చెప్పగా అతని తల్లినా కుమారుడు యెహోవాచేత ఆశీర్వదింపబడును గాక అనెను.
3 అతడు ఆ వెయ్యిన్నినూరు రూకలను తన తల్లికి మరల నియ్యగా ఆమెపోతవిగ్రహము చేయించుటకై నా కుమారునిచేత తీసికొనిన యీ రూకలను నేను యెహోవాకు ప్రతిష్ఠించు చున్నాను, నీకు మరల అది యిచ్చెదననెను.
4