2. యెహోవా, నాకు కష్టాలు వచ్చినప్పుడు నా నుండి తిరిగి పోకుము. నా మాట వినుము. సహాయం కోసం నేను మొర పెట్టినప్పుడు వెంటనే నాకు జవాబు ఇమ్ము.
|
4. నా బలం పోయింది. నేను ఎండిపోయి చస్తున్న గడ్డిలా ఉన్నాను. నా కష్టాల మూలంగా నేను నా ఆహారాన్ని తినటం కూడా మరచిపోయాను.
|
6. అరణ్యంలో నివసిస్తున్న గుడ్లగూబలా నేను ఒంటరిగా ఉన్నాను. శిథిలమైన పాత కట్టడాలలో బతుకుతున్న గుడ్లగూబలా నేను ఒంటరిగా ఉన్నాను.
|
8. నా శత్రువులు నన్ను ఎల్లప్పుడూ అవమానిస్తారు. నన్ను హేళన చేసే మనుష్యులు నన్ను శపించేటప్పుడు నా పేరు ప్రయోగిస్తారు.
|
11. సాయంకాలమయ్యేసరికి దీర్గమైన నీడలు అంతం అయిపోయినట్లు, నా జీవితం దాదాపుగా అంతం అయి పోయింది. నేను ఎండిపోయి చస్తున్న గడ్డిలా ఉన్నాను.
|
18. రాబోయే తరం వారు చదువుకొనేందుకు ఈ సంగతులు రాసి పెట్టు. అప్పుడు. భవిష్యత్తులో ఆ ప్రజలు యెహోవాను స్తుతిస్తారు.
|
19. యెహోవా పైవున్న తన పవిత్ర స్థానం నుండి కిందకు చూస్తాడు. యెహోవా పరలోకం నుండి కింద భూమిని చూస్తాడు.
|
24. కనుక నేను ఇలా చెప్పాను, “నేను ఇంకా యువకునిగా ఉండగానే నన్ను చావనివ్వకు. దేవా, నీవు శాశ్వతంగా జీవిస్తావు.
|
26. ప్రపంచం, ఆకాశం అంతం ఆవుతాయి. కానీ నీవు శాశ్వతంగా జీవిస్తావు. అవి బట్టల్లా పాడైపోతాయి. మరియు వస్త్రాలు మార్చినట్టుగా నీవు వాటిని మార్చి వేస్తావు. అవన్నీ మార్చివేయబడతాయి.
|
28. ఈ వేళ మేము నీ సేవకులము. భవిష్యత్తులో మా సంతతి వారిక్కడ నివసిస్తారు. మరియు వారి సంతతి వారిక్కడ నిన్ను ఆరాధిస్తారు.
|