1. {#1చెర తప్పనిసరి } [PS]సీయోనులో హాయిగా సుఖపడే వారికి బాధ తప్పదు. [PE][QS2]సమరయ కొండల మీద దర్జాగా బతికే వారికి బాధ తప్పదు. [QE][QS2]ఇశ్రాయేలు వారికి సలహాదారులుగా ఉన్న గొప్ప రాజ్యాల్లోని ముఖ్య పెద్దలకు బాధ తప్పదు. [QE]
2. [QS2]మీ నాయకులు ఇలా చెబుతున్నారు, కల్నేకు వెళ్లి చూడండి. [QE][QS2]అక్కడ నుంచి హమాతు అనే గొప్ప పట్టణానికి వెళ్ళండి. [QE][QS2]ఆ తరువాత ఫిలిష్తీయుల పట్టణం గాతు వెళ్ళండి. [QE][QS2]అవి మీ రెండు రాజ్యాలకంటే గొప్పవి కావా? [QE][QS2]వాటి సరిహద్దులు మీ సరిహద్దులకంటే విశాలమైనవి కావా? [QE]
3. [PS]విపత్తు రోజు దూరంగా ఉందనుకుని [PE][QS2]దౌర్జన్య పాలన త్వరగా రప్పించిన వారవుతున్నారు. [QE]
2. [QS2]వాళ్ళు దంతపు మంచాల మీద పడుకుని, [QE][QS2]పరుపుల మీద ఆనుకుని కూర్చుంటారు. [QE][QS2]మందలోని గొర్రె పిల్లలను, సాలలో కొవ్విన దూడలను కోసుకుని తింటారు. [QE]
5. [PS]తీగ వాయిద్యాల సంగీతంతో పిచ్చిపాటలు పాడుతూ [PE][QS2]దావీదులాగా వాయిద్యాలను మరింత మెరుగ్గా వాయిస్తారు. [QE]
2. [QS2]ద్రాక్షారసంతో పాత్రలు నింపి తాగుతారు. [QE][QS2]పరిమళ తైలాలు పూసుకుంటారు కానీ [QE][QS2]యోసేపు వంశం వారికి వచ్చే నాశనానికి విచారించరు. [QE]
2. [QS2]కాబట్టి బందీలుగా వెళ్లే వారిలో వీళ్ళే మొదట వెళతారు. [QE][QS2]సుఖభోగాలతో జరుపుకునే విందు వినోదాలు ఇక ఉండవు. [QE]
2. {#1ఇశ్రాయేలు గర్వం అణచివేత } [QS2]“యాకోబు వంశీకుల గర్వం నాకు అసహ్యం. [QE][QS2]వారి రాజ భవనాలంటే నాకు ద్వేషం. [QE][QS2]కాబట్టి వారి పట్టణాన్ని దానిలో ఉన్నదంతా ఇతరుల వశం చేస్తాను. [QE][QS2]నేను, ప్రభువైన యెహోవాను. [QE][QS2]నా తోడని ప్రమాణం చేశాను.” [QE][QS2]సేనల దేవుడు, యెహోవా ప్రభువు వెల్లడించేది ఇదే. [QE]
9. [PS]ఒక్క కుటుంబంలో పదిమంది మిగిలి ఉన్నా వాళ్ళంతా చస్తారు.
10. వాళ్ళ శవాలను ఇంట్లో నుంచి తీసుకు పోడానికి ఒక బంధువు వాటిని దహనం చేసే వాడితోపాటు వచ్చి, ఇంట్లో ఉన్న వాడితో “నీతోపాటు ఇంకా ఎవరైనా ఉన్నారా?” అని అడిగితే ఆ వ్యక్తి “లేడు” అంటాడు. “మాట్లాడకు. మనం యెహోవా పేరు ఎత్తకూడదు” అంటాడు. [PE]
11. [PS]ఎందుకంటే గొప్ప కుటుంబాలు, [PE][QS2]చిన్న కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయి, అని [QE][QS2]మీకు యెహోవా ఆజ్ఞ ఇస్తాడు. [QE]
12. [PS]గుర్రాలు బండల మీద పరుగెత్తుతాయా? [PE][QS2]అలాంటి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుతారా? [QE][QS2]అయితే మీరు న్యాయాన్ని విషతుల్యం చేశారు. [QE]
2. [QS2]లొదెబారు[* లొదెబారు ఏమిలేదు ] పట్ల ఆనందించే మీరు, [QE][QS2]“మా సొంత బలంతో కర్నాయిం [† కర్నాయిం కొమ్ములు; కొమ్ము బలం సూచిస్తుంది ]ను వశం చేసుకోలేదా?” అంటారు. [QE]
14. [PS]అయితే సేనల దేవుడు, యెహోవా ప్రభువు చెప్పేది ఇదే, [PE][QS2]“ఇశ్రాయేలీయులారా, నేను మీ మీదికి ఒక రాజ్యాన్ని రప్పిస్తాను. [QE][QS2]వాళ్ళు లెబో హమాతు ప్రదేశం మొదలు అరాబా వాగు వరకూ [QE][QS2]మిమ్మల్ని బాధిస్తారు.” [QE]