2. నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేసే యెహోవా ఇలా చెబుతున్నాడు,
“నా సేవకుడవైన యాకోబూ, నేను ఏర్పరచుకొన్న యెషూరూనూ * యెషూరూనూ ఇశ్రాయేలు , భయపడకు. |
3. నేను దాహం గొన్నవారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద జల ప్రవాహాలను కుమ్మరిస్తాను.
నీ సంతానం మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాను. |
5. ఒకడు, ‘నేను యెహోవా వాణ్ణి’ అంటాడు, ఇంకొకడు యాకోబు పేరు చెబుతాడు.
మరొకడు అయితే ‘యెహోవా వాణ్ణి’ అని తన చేతిపై రాసుకుని ఇశ్రాయేలు అనే మారు పేరు పెట్టుకుంటాడు.” |
6. {విగ్రహరాధన పై తీర్పు} PS ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా, వారి విమోచకుడు, సైన్యాల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు,
“నేను మొదటివాణ్ణి, చివరివాణ్ణి. నేను తప్ప ఏ దేవుడు లేడు. |
7. ఆదిలో నా ప్రజలను నియమించినప్పటి నుండి నాలాగా విషయాలను వెల్లడి చేస్తూ వచ్చిన వాడెవడు?
అలాంటివాడు ఉంటే నాకు చెప్పండి. వారు భవిష్యత్తులో జరిగే సంగతులను తెలియజెప్ప గలిగేవారై ఉండాలి. |
8. మీరు బెదరవద్దు, భయపడవద్దు. పూర్వకాలం నుండి నేను మీకు ఆ సంగతి వినిపిస్తూ ఉండలేదా?
మీరే నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవుడున్నాడా? నేను తప్ప వేరొక ఆశ్రయదుర్గం లేదు. ఉన్నట్టు నేనెరుగను. |
9. విగ్రహాన్ని చేసే వారంతా మిధ్య. వారిష్టపడే విగ్రహాలు వ్యర్ధం. వారి సాక్షులు గ్రహింపు లేనివారు. చూడలేరు. కాబట్టి వారు సిగ్గు పాలవుతారు.
|
11. ఇదిగో, దాన్ని పూజించే వారంతా సిగ్గుపడతారు. ఆ శిల్పకారులు మానవ మాత్రులే గదా?
వారందరినీ పోగు చేసి నిలబెడితే వారు తప్పకుండా భయపడతారు, సిగ్గుపడతారు. |
12. కమ్మరి ఇనుప గొడ్డలిని పదును చేస్తూ నిప్పుల మీద పని చేస్తాడు. తన బలమైన చేతితో దాన్ని తయారుచేస్తాడు.
అతనికి ఆకలి వేస్తుంది, అతని బలం తగ్గిపోతుంది. నీళ్లు తాగకపోవడం చేత సొమ్మసిల్లి పడిపోతాడు. |
13. వడ్లవాడు చెక్క మీద నూలు తాడు వేసి గీత గీస్తాడు. దాన్ని చిత్రిక పట్టి నునుపుగా చేస్తాడు.
ఎండ్రకాయ గుర్తు పెట్టి దాన్ని తయారు చేస్తాడు. మందిరంలో నిలబెట్టడం కోసం ఒక మానవ రూపాన్ని ఆకర్షణీయంగా ఉండేలా చేస్తాడు. |
14. ఒకడు దేవదారు చెట్లను నరకడానికి పూనుకుంటాడు. లేక సరళ వృక్షాన్నో సింధూర వృక్షాన్నో ఏదొక అడవి వృక్షాన్ని ఎన్నుకుంటాడు.
ఒకడు ఒక చెట్టును నాటినప్పుడు అది వర్షం సాయంతో పెరుగుతుంది. |
15. అప్పుడు ఒక మనిషి ఆ చెట్టుని కాల్చి వాటిలో కొంత తీసుకుని చలి కాచుకోడానికి, కొంత నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకోడానికి ఉపయోగిస్తాడు.
మిగిలినదాన్ని తీసుకుని దానితో ఒక దేవతను చేసుకుని దానికి నమస్కారం చేస్తాడు. దానితో ఒక విగ్రహం చేసి దానికి సాగిలపడతాడు. |
16. కొంత చెక్కను నిప్పుతో కాల్చి, దానిపై మాంసం వండుకుని తిని తృప్తి పొందుతాడు. ‘ఆహా, చలి కాచుకున్నాను, వెచ్చగా ఉంది’ అనుకున్నాడు.
|
17. మిగిలిన భాగాన్ని తాను దేవుడుగా భావించే విగ్రహాన్ని చేసుకుంటాడు.
దాని ఎదుట సాగిలపడి నమస్కారం చేస్తూ ‘నా దేవుడివి నువ్వే, నన్ను రక్షించు’ అని ప్రార్థిస్తాడు. |
18. వారికి తెలియదు, అర్థం చేసుకోరు. వారు చూడకుండేలా వారి కళ్ళు, అర్థం చేసుకోకుండేలా వారి హృదయాలు మూసుకుపోయాయి.
|
19. ఎవరూ ఆలోచించడం లేదు. ‘నేను సగం చెక్కను అగ్నిలో కాల్చాను, ఆ నిప్పుల మీద రొట్టె కాల్చుకుని, మాంసం వండుకుని భోజనం చేశాను.
మిగిలిన చెక్కను తీసుకుని దానితో అసహ్యమైన దాన్ని చేయాలా? ఒక చెట్టు మొద్దుకు సాగిలపడి నమస్కరించాలా?’ అని ఆలోచించడానికి ఎవరికీ తెలివి, వివేచన లేదు. |
20. వాడు బూడిద తిన్నట్టుగా ఉంది. వాడి మోసపోయిన మనస్సు వాణ్ణి దారి తప్పేలా చేసింది. వాడు తన ఆత్మను రక్షించుకోలేడు.
‘నా కుడి చేతిలో ఉన్న బొమ్మ నకిలీ దేవుడు కదా’ అనుకోడానికి వాడికి బుద్ధి సరిపోదు. |
21. యాకోబూ, ఇశ్రాయేలూ, వీటిని గురించి ఆలోచించు. నువ్వు నా సేవకుడివి. నేనే నిన్ను నిర్మించాను.
ఇశ్రాయేలూ, నువ్వు నాకు సేవకుడివి. నేను నిన్ను మరచిపోను. |
22. మంచు విడిపోయేలా నేను నీ అతిక్రమాలను, మేఘాలు తొలగిపోయేలా నీ పాపాలను తుడిచివేశాను. నేను నిన్ను విమోచించాను. నా దగ్గరికి తిరిగి రా.
|
23. యెహోవా ఆ పని పూర్తి చేశాడు. ఆకాశాల్లారా, గీతాలు పాడండి. భూమీ, దాని కింది అగాధ స్థలాలు గొప్ప ధ్వని చేయండి.
పర్వతాలూ, అరణ్యం, అందులోని ప్రతి వృక్షం, సంగీతనాదం చేయండి. యెహోవా యాకోబును విమోచిస్తాడు. ఆయన ఇశ్రాయేలులో తన మహిమను కనపరుస్తాడు.” |
24. {యెరూషలేము తిరిగి కట్టబడాలి} PS గర్భంలో నిన్ను నిర్మించినవాడు, నీ విమోచకుడు అయిన యెహోవా ఈ విధంగా చెబుతున్నాడు,
“యెహోవా అనే నేనే సమస్తాన్నీ జరిగించేవాణ్ణి. నేనొక్కడినే ఆకాశాలను విశాలపరచాను. నేనే భూమిని చక్కబరచిన వాణ్ణి. |
25. నేనే ప్రగల్భాలు పలికేవారి ప్రవచనాలను వ్యర్ధం చేసేవాణ్ణి.
సోదె చెప్పేవాళ్ళను వెర్రివాళ్ళుగా, జ్ఞానులను వెనక్కి మళ్ళించి వారి తెలివిని బుద్ధిహీనతగా చేసేవాణ్ణి నేనే. |
26. నా సేవకుని మాటలను స్థిరపరిచే వాణ్ణీ, నా సందేశకుల ఆలోచనలు నెరవేర్చే వాణ్ణీ నేనే.
యెరూషలేములో ప్రజలు నివసిస్తారనీ యూదా పట్టణాలను తిరిగి కడతారనీ నేను ఆజ్ఞాపించాను. దాని పాడైన స్థలాలను బాగు చేసేవాణ్ణి నేనే. |
28. కోరెషుతో, ‘నా మందకాపరీ, నా ఇష్టాన్ని నెరవేర్చేవాడా’ అని చెప్పేవాణ్ణి నేనే. అతడు ‘యెరూషలేమును తిరిగి కట్టండి’ అనీ ‘దేవాలయం పునాది వేయండి’ అనీ ఆజ్ఞాపిస్తాడని నేను చెబుతున్నాను.” PE
|