1. తూరునుగూర్చిన దేవోక్తి తర్షీషు ఓడలారా, అంగలార్చుడి తూరు పాడైపోయెను ఇల్లయినను లేదు ప్రవేశమార్గమైనను లేదు కిత్తీయుల దేశమునుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడెను.
|
4. సీదోనూ, సిగ్గుపడుము, సముద్రము సముద్రదుర్గము మాటలాడుచున్నది నేను ప్రసవవేదనపడనిదానను పిల్లలు కననిదానను ¸°వనస్థులను పోషింపనిదానను కన్యకలను పెంచనిదానను.
|
7. నీకు సంతోషము కలుగజేసిన పట్టణమిదేనా? ప్రాచీన కాలముననుండిన పట్టణమిదేనా? పరదేశనివాసముచేయుటకు దూరప్రయాణముచేసిన దిదేనా?
|
8. దాని వర్తకులు రాజసమానులు దాని వ్యాపారులు భూనివాసులలో ఘనులు కిరీటముల నిచ్చుచుండు తూరుకు ఈలాగు చేయ నెవడు ఉద్దేశించెను?
|
9. సర్వసౌందర్య గర్వాతిశయమును అపవిత్రపరచుట కును భూమిమీదనున్న సర్వఘనులను అవమానపరచుటకును సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు చేయ నుద్దేశించెను.
|
11. ఆయన సముద్రముమీద తన చెయ్యి చాపెను రాజ్యములను కంపింపజేసెను కనానుకోటలను నశింపజేయుటకు యెహోవా దాని గూర్చి ఆజ్ఞాపించెను.
|
12. మరియు ఆయన సీదోను కన్యకా, చెరపబడినదానా, నీకికను సంతోషముండదు నీవు లేచి కిత్తీముకు దాటి పొమ్ము అక్కడనైనను నీకు నెమ్మది కలుగదు
|
13. ఇదిగో కల్దీయుల దేశమును చూడుము వారికను జన ముగా ఉండరు అష్షూరీయులు దానిని అడవిమృగములకు నివాసముగా చేసియున్నారు. వారు కోటలు కట్టించి దాని నగరులను పడగొట్టి యున్నారు.
|
15. ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు తూరు ఆ దినమున డెబ్బది సంవత్సరములు మరవబడును డెబ్బది సంవత్సరములైన తరువాత వేశ్యల కీర్తనలో ఉన్నట్లు జరుగును, ఏమనగా
|
16. మరవబడిన వేశ్యా, సితారాతీసికొని పట్టణములో తిరుగులాడుము నీవు జ్ఞాపకమునకు వచ్చునట్లు ఇంపుగా వాయిం చుము అనేక కీర్తనలు పాడుము.
|
17. డెబ్బది సంవత్సరముల అంతమున యెహోవా తూరును దర్శించును అది వేశ్యజీతమునకు మరల భూమిమీదనున్న సమస్త లోక రాజ్యములతో వ్యభిచారము చేయును.
|
18. వేశ్యజీతముగా ఉన్నదాని వర్తకలాభము యెహోవాకు ప్రతిష్ఠితమగును అది కూర్చబడదు ధననిధిలో వేయబడదు యెహోవా సన్నిధిని నివసించువారికి సంతుష్టి ఇచ్చు భోజనమునకును ప్రశస్త వస్త్రములకును ఆ పట్టణపు లాభము ఆధారముగా నుండును.
|