ఆదికాండము 10 : 1 (TEV)
ఇది నోవహు కుమారుడగు షేము హాము యాపె తను వారి వంశావళి. జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి.
ఆదికాండము 10 : 2 (TEV)
యాపెతు కుమారులు గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు.
ఆదికాండము 10 : 3 (TEV)
గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మా అనువారు.
ఆదికాండము 10 : 4 (TEV)
యావాను కుమారులు ఏలీషా తర్షీషు కిత్తీము దాదోనీము అనువారు.
ఆదికాండము 10 : 5 (TEV)
వీరినుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారివారి జాతుల ప్రకారము, వారివారి భాషలప్రకారము, వారివారి వంశముల ప్రకారము, ఆ యా దేశములలో వారు వేరైపోయిరి.
ఆదికాండము 10 : 6 (TEV)
హాము కుమారులు కూషు మిస్రాయిము పూతు కనాను అనువారు.
ఆదికాండము 10 : 7 (TEV)
కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా అనువారు. రాయమా కుమారులు షేబ దదాను అనువారు.
ఆదికాండము 10 : 8 (TEV)
కూషు నిమ్రోదును కనెను. అతడు భూమిమీద పరాక్రమశాలియై యుండుటకు ఆరంభించెను.
ఆదికాండము 10 : 9 (TEV)
అతడు యెహోవాయెదుట పరాక్రమముగల వేటగాడు. కాబట్టియెహోవా యెదుట పరా క్రమముగల వేటగాడైన నిమ్రోదువలె అను లోకోక్తికలదు.
ఆదికాండము 10 : 10 (TEV)
షీనారు దేశములోని బాబెలు ఎరెకు అక్కదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు.
ఆదికాండము 10 : 11 (TEV)
ఆ దేశములోనుండి అష్షూరుకు బయలుదేరి వెళ్లి నీనెవెను రహోబోతీరును కాలహును
ఆదికాండము 10 : 12 (TEV)
నీనెవెకును కాలహుకును మధ్యనున్న రెసెనును కట్టించెను; ఇదే ఆ మహా పట్ట ణము.
ఆదికాండము 10 : 13 (TEV)
మిస్రాయిము లూదీయులను అనామీయులను లెహాబీయులను నప్తుహీయులను
ఆదికాండము 10 : 14 (TEV)
పత్రుసీయులను కస్లూ హీయులను కఫ్తోరీయులను కనెను. ఫిలిష్తీయులు కస్లూ హీయులలోనుండి వచ్చిన వారు.
ఆదికాండము 10 : 15 (TEV)
కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును హేతును యెబూసీయులను అమోరీయులను గిర్గాషీయులను
ఆదికాండము 10 : 16 (TEV)
హివ్వీయులను అర్కీయులను సినీయులను
ఆదికాండము 10 : 17 (TEV)
అర్వాదీయు లను సెమారీయులను హమాతీయులను కనెను.
ఆదికాండము 10 : 18 (TEV)
తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను.
ఆదికాండము 10 : 19 (TEV)
కనానీయుల సరిహద్దు సీదోనునుండి గెరారుకు వెళ్లు మార్గములో గాజా వరకును, సొదొమ గొమొఱ్ఱా అద్మా సెబోయిము లకు వెళ్లు మార్గములో లాషావరకును ఉన్నది.
ఆదికాండము 10 : 20 (TEV)
వీరు తమతమ వంశముల ప్రకారము తమతమ భాషల ప్రకారము తమతమ దేశములనుబట్టియు జాతులను బట్టియు హాము కుమారులు.
ఆదికాండము 10 : 21 (TEV)
మరియు ఏబెరుయొక్క కుమారులందరికి పితరుడును, పెద్దవాడయిన యాపెతు సహోదరుడునగు షేముకు కూడ సంతానము పుట్టెను.
ఆదికాండము 10 : 22 (TEV)
షేము కుమారులు ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరామను వారు.
ఆదికాండము 10 : 23 (TEV)
అరాము కుమారులు ఊజు హూలు గెతెరు మాషనువారు.
ఆదికాండము 10 : 24 (TEV)
అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.
ఆదికాండము 10 : 25 (TEV)
ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి. వారిలో ఒకనిపేరు పెలెగు, ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను.
ఆదికాండము 10 : 26 (TEV)
యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మా వెతును యెరహును
ఆదికాండము 10 : 27 (TEV)
హదోరమును ఊజాలును దిక్లాను
ఆదికాండము 10 : 28 (TEV)
ఓబాలును అబీమాయెలును షేబను
ఆదికాండము 10 : 29 (TEV)
ఓఫీరును హవీలాను యోబాబును కనెను. వీరందరు యొక్తాను కుమారులు.
ఆదికాండము 10 : 30 (TEV)
మేషానుండి సపారాకు వెళ్లు మార్గములోని తూర్పు కొండలు వారి నివాసస్థలము.
ఆదికాండము 10 : 31 (TEV)
వీరు తమతమ వంశముల ప్రకారము తమతమ భాషలప్రకారము తమతమ దేశ ములనుబట్టియు తమతమ జాతులనుబట్టియు షేము కుమారులు.
ఆదికాండము 10 : 32 (TEV)
వారివారి జనములలో వారివారి సంతతుల ప్రకారము, నోవహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలోనుండి జనములు భూమిమీద వ్యాపించెను.
❮
❯