ఆదికాండము 11 : 1 (TEV)
భూమియందంతట ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను.
ఆదికాండము 11 : 2 (TEV)
వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి
ఆదికాండము 11 : 3 (TEV)
మనము ఇటికలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటికలును, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను.
ఆదికాండము 11 : 4 (TEV)
మరియు వారుమనము భూమియందంతట చెదిరిపోకుండ ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని, పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకొనగా
ఆదికాండము 11 : 5 (TEV)
యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను.
ఆదికాండము 11 : 6 (TEV)
అప్పుడు యెహోవాఇదిగో జనము ఒక్కటే; వారికందరికి భాష ఒక్కటే; వారు ఈ పని ఆరంభించి యున్నారు. ఇకమీదట వారు చేయ దలచు ఏపని యైనను చేయకుండ వారికి ఆటంకమేమియు నుండద
ఆదికాండము 11 : 7 (TEV)
గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండ అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను.
ఆదికాండము 11 : 8 (TEV)
ఆలాగు యెహోవా అక్కడ నుండి భూమియందంతట వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి.
ఆదికాండము 11 : 9 (TEV)
దానికి బాబెలు అను పేరు పెట్టిరి; ఎందు కనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారుచేసెను. అక్కడ నుండి యెహోవా భూమియందంతట వారిని చెదరగొట్టెను.
ఆదికాండము 11 : 10 (TEV)
షేము వంశావళి ఇది. షేము నూరేండ్లుగలవాడై జలప్రవాహము గతించిన రెండేండ్లకు అర్పక్షదును కనెను.
ఆదికాండము 11 : 11 (TEV)
షేము అర్పక్షదును కనినతరువాత ఐదువందలయేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
ఆదికాండము 11 : 12 (TEV)
అర్పక్షదు ముప్పది యైదేండ్లు బ్రదికి షేలహును కనెను.
ఆదికాండము 11 : 13 (TEV)
అర్పక్షదు షేలహును కనినతరువాత నాలుగు వందలమూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
ఆదికాండము 11 : 14 (TEV)
షేలహు ముప్పది యేండ్లు బ్రదికి ఏబెరును కనెను.
ఆదికాండము 11 : 15 (TEV)
షేలహు ఏబెరును కనినతరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
ఆదికాండము 11 : 16 (TEV)
ఏబెరు ముప్పది నాలుగేండ్లు బ్రదికి పెలెగును కనెను.
ఆదికాండము 11 : 17 (TEV)
ఏబెరు పెలెగును కనినతరువాత నాలుగువందల ముప్పది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
ఆదికాండము 11 : 18 (TEV)
పెలెగు ముప్పది యేండ్లు బ్రదికి రయూను కనెను.
ఆదికాండము 11 : 19 (TEV)
పెలెగు రయూను కనినతరువాత రెండువందల తొమి్మది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
ఆదికాండము 11 : 20 (TEV)
రయూ ముప్పది రెండేండ్లు బ్రదికి సెరూగును కనెను.
ఆదికాండము 11 : 21 (TEV)
రయూ సెరూగును కనినతరువాత రెండు వందల ఏడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
ఆదికాండము 11 : 22 (TEV)
సెరూగు ముప్పది యేండ్లు బ్రదికి నాహోరును కనెను.
ఆదికాండము 11 : 23 (TEV)
సెరూగు నాహోరును కనినతరువాత రెండువందల యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
ఆదికాండము 11 : 24 (TEV)
నాహోరు ఇరువది తొమి్మది యేండ్లు బ్రదికి తెరహును కనెను.
ఆదికాండము 11 : 25 (TEV)
నాహోరు తెరహును కనినతరు వాత నూటపం దొమి్మది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
ఆదికాండము 11 : 26 (TEV)
తెరహు డెబ్బది యేండ్లు బ్రదికి అబ్రామును నాహో రును హారానును కనెను.
ఆదికాండము 11 : 27 (TEV)
తెరహు వంశావళి ఇది; తెరహు అబ్రామును నాహో రును హారానును కనెను. హారాను లోతును కనెను.
ఆదికాండము 11 : 28 (TEV)
హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణ ములో తన తండ్రియైన తెరహు కంటె ముందుగా మృతి బొందెను.
ఆదికాండము 11 : 29 (TEV)
అబ్రామును నాహోరును వివాహము చేసి కొనిరి. అబ్రాము భార్య పేరు శారయి; నాహోరు భార్య పేరు మిల్కా, ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రియైన హారాను కుమార్తె.
ఆదికాండము 11 : 30 (TEV)
శారయి గొడ్రాలై యుండెను. ఆమెకు సంతానములేదు.
ఆదికాండము 11 : 31 (TEV)
తెరహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు, అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్యయయిన శారయి అను తన కోడలిని తీసికొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితోకూడ బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి.
ఆదికాండము 11 : 32 (TEV)
తెరహు బ్రదికిన దినములు రెండువందల యైదేండ్లు. తెరహు హారానులో మృతి బొందెను.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32

BG:

Opacity:

Color:


Size:


Font: