ఆదికాండము 27 : 1 (TEV)
ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడా, అని అతని పిలువగా అతడుచిత్తము నాయనా అని అతనితో ననెను.
ఆదికాండము 27 : 2 (TEV)
అప్పుడు ఇస్సాకుఇదిగో నేను వృద్ధుడను, నా మరణదినము నాకు తెలి యదు.
ఆదికాండము 27 : 3 (TEV)
కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసికొని అడవికి పోయి నాకొరకు వేటాడి మాంసము తెమ్ము.
ఆదికాండము 27 : 4 (TEV)
నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించునట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచి నేను తినుటకై నాయొద్దకు తెమ్మని చెప్పెను.
ఆదికాండము 27 : 5 (TEV)
ఇస్సాకు తన కుమా రుడగు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్లెను.
ఆదికాండము 27 : 6 (TEV)
అప్పుడు రిబ్కా తన కుమారుడగు యాకోబును చూచిఇదిగో నీ తండ్రి నీ అన్నయైన ఏశావుతో
ఆదికాండము 27 : 7 (TEV)
మృతి బొందకమునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించునట్లు నాకొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధ పరచుమని చెప్పగా వింటిని.
ఆదికాండము 27 : 8 (TEV)
కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞా పించినట్టు చేయుము.
ఆదికాండము 27 : 9 (TEV)
నీవు మందకు వెళ్లి రెండు మంచి మేక పిల్లలను అక్కడనుండి నాయొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రి కిష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసె దను.
ఆదికాండము 27 : 10 (TEV)
నీ తండ్రి మృతిబొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించునట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసికొనిపోవలెననెను.
ఆదికాండము 27 : 11 (TEV)
అందుకు యాకోబునా సహో దరుడైన ఏశావు రోమము గలవాడు, నేను నున్ననివాడను గదా.
ఆదికాండము 27 : 12 (TEV)
ఒకవేళ నాతండ్రి నన్ను తడవిచూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడనుగా తోచినయెడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చు కొననని చెప్పెను.
ఆదికాండము 27 : 13 (TEV)
అయినను అతని తల్లినా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చునుగాక. నీవు నా మాటమాత్రము విని, పోయి వాటిని నాయొద్దకు తీసికొని రమ్మని చెప్పగా
ఆదికాండము 27 : 14 (TEV)
అతడు వెళ్లి వాటిని తన తల్లియొద్దకు తీసికొనివచ్చెను. అతని తల్లి అతని తండ్రి కిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపఱచెను.
ఆదికాండము 27 : 15 (TEV)
మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద నుండెను గనుక
ఆదికాండము 27 : 16 (TEV)
రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడమీద నునుపు భాగమును కప్పి
ఆదికాండము 27 : 17 (TEV)
తాను సిద్ధపరచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడగు యాకోబు చేతి కియ్యగా
ఆదికాండము 27 : 18 (TEV)
అతడు తన తండ్రియొద్దకు వచ్చినా తండ్రీ, అని పిలువగా అతడుఏమి నా కుమారుడా, నీ వెవరవని అడిగెను
ఆదికాండము 27 : 19 (TEV)
అందుకు యాకోబునేను ఏశావు అను నీ జ్యేష్ఠకుమారుడను, నీవు నాతో చెప్పినప్రకారము చేసియున్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచికూర్చుండి, నేను వేటాడి తెచ్చినదానిని తినువ
ఆదికాండము 27 : 20 (TEV)
అప్పుడు ఇస్సాకు నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీ కెట్లు దొరికెనని అడుగగా అతడునీ దేవుడైనయెహోవా నా యెదుటికి దాని రప్పించుటచేతనే అని చెప్పెను.
ఆదికాండము 27 : 21 (TEV)
అప్పుడు ఇస్సాకు నా కుమారుడా, నీవు ఏశా వను నా కుమారుడవో కావో నేను నిన్ను తడవి చూచె దను దగ్గరకు రమ్మని చెప్పెను.
ఆదికాండము 27 : 22 (TEV)
యాకోబు తనతండ్రియైన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడవిచూచిస్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏశావు చేతులే అనెను.
ఆదికాండము 27 : 23 (TEV)
యాకోబు చేతులు అతని అన్నయైన ఏశావు చేతులవలె రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గురుతు పట్టలేక అతనిని దీవించి
ఆదికాండము 27 : 24 (TEV)
ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబునేనే అనెను.
ఆదికాండము 27 : 25 (TEV)
అంతట అతడు అది నాయొద్దకు తెమ్ము; నేను నిన్ను దీవించునట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందు ననెను; అతడు తెచ్చినప్పుడు అతడు తినెను; ద్రాక్షారసము తేగా అతడు త్రాగెను.
ఆదికాండము 27 : 26 (TEV)
తరువాత అతని తండ్రియైన ఇస్సాకు నా కుమారుడా, దగ్గరకువచ్చి నన్ను ముద్దు పెట్టు కొమ్మని అతనితో చెప్పెను.
ఆదికాండము 27 : 27 (TEV)
అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దుపెట్టుకొనెను. అప్పుడతడు అతని వస్త్రములను వాసనచూచి అతని దీవించి యిట్లనెను. ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసనవలె నున
ఆదికాండము 27 : 28 (TEV)
ఆకాశపుమంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీ కనుగ్రహించుగాక
ఆదికాండము 27 : 29 (TEV)
జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిలపడుదురు నీ బంధుజనులకు నీవు ఏలికవై యుండుము నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు నిన్ను శపించువారు శపింపబడుదురు నిన్ను దీవించువారు దీవింపబడుదురుగాక
ఆదికాండము 27 : 30 (TEV)
ఇస్సాకు యాకోబును దీవించుటయైన తరువాత యాకోబు తన తండ్రియైన ఇస్సాకు ఎదుటనుండి బయలు దేరి వెళ్లిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చెను.
ఆదికాండము 27 : 31 (TEV)
అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరచి తన తండ్రియొద్దకు తెచ్చినా తండ్రీ నన్ను దీవించునట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చినదాని తినుమని తన తండ్రితోననెను.
ఆదికాండము 27 : 32 (TEV)
అతని తండ్రియైన ఇస్సాకునీ వెవర వని అతని నడిగి నప్పుడు అతడునేను నీ కుమారుడను ఏశావు అను నీ జ్యేష్ఠకుమారుడననగా
ఆదికాండము 27 : 33 (TEV)
ఇస్సాకు మిక్కు టముగా గడగడ వణకుచు అట్లయితే వేటాడిన భోజ్య మును నాయొద్దకు తెచ్చినవారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించితిని, అతడు దీవింపబడినవాడే యనెను.
ఆదికాండము 27 : 34 (TEV)
ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్దకేక వేసిఓ నా తండ్రీ, నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పెను.
ఆదికాండము 27 : 35 (TEV)
అతడునీ సహోదరుడు కపటోపాయ ముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసికొనిపోయెను.
ఆదికాండము 27 : 36 (TEV)
ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది; అతడు నన్ను ఈ రెండు మారులు మోస పుచ్చెను. నా జ్యేష్ఠత్వము తీసికొనెను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసికొనెనని చెప్పినాకొరకు మరి యే దీవెనయు మిగిల్చి యుంచలేదా అని అడిగెను.
ఆదికాండము 27 : 37 (TEV)
అందుకు ఇస్సాకు ఇదిగో అతని నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజను లందరిని అతనికి దాసులుగా ఇచ్చితిని; ధాన్యమును ద్రాక్షారస మును ఇచ్చి అతని పోషించితిని గనుక నా కుమారుడా, నీకేమి చే¸
ఆదికాండము 27 : 38 (TEV)
ఏశావు నా తండ్రీ, నీయొద్ద ఒక దీవెనయే ఉన్నదా? నా తండ్రీ, నన్ను, నన్ను కూడ దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి యేడ్వగా అతని తండ్రియైన ఇస్సాకు
ఆదికాండము 27 : 39 (TEV)
నీ నివాసము భూసారము లేకయు పైనుండిపడు ఆకాశపు మంచు లేకయు నుండును.
ఆదికాండము 27 : 40 (TEV)
నీవు నీకత్తిచేత బ్రదుకుదువు నీ సహోదరునికి దాసుడవగుదువు నీవు తిరుగులాడు చుండగా నీ మెడమీదనుండి అతనికాడి విరిచివేయుదువు అని అతని కుత్తరమిచ్చెను.
ఆదికాండము 27 : 41 (TEV)
తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతనిమీద పగపట్టెను. మరియు ఏశావునా తండ్రిని గూర్చిన దుఃఖదినములు సమీపముగా నున్నవి; అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను.
ఆదికాండము 27 : 42 (TEV)
రిబ్కా తన పెద్దకుమారుడైన ఏశావు మాటలనుగూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెనుఇదిగో నీ అన్నయైన ఏశావు నిన్ను చంపె దనని చెప్పి నిన్ను గూర్చి తన్నుతాను ఓదార్చుకొను చున్నాడు.
ఆదికాండము 27 : 43 (TEV)
కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడగు లాబాను నొద్దకు పారిపోయి నీ అన్నకోపము చల్లారువరకు
ఆదికాండము 27 : 44 (TEV)
నీ అన్న కోపము నీమీదనుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచువరకు లాబానునొద్ద కొన్నాళ్లు ఉండుము;
ఆదికాండము 27 : 45 (TEV)
అప్పుడు నేను అక్కడనుండి నిన్ను పిలిపించె దను. ఒక్కనాడే మీ యిద్దరిని నేను పోగొట్టుకొన నేల అనెను.
ఆదికాండము 27 : 46 (TEV)
మరియు రిబ్కా ఇస్సాకుతోహేతు కుమార్తెలవలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రయిన హేతు కుమార్తెలలో వీరివంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసి కొనినయెడల నా బ్రదుకువలన నాకేమి ప్రయోజనమనెను.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46

BG:

Opacity:

Color:


Size:


Font: