ఆదికాండము 30 : 1 (TEV)
రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనక పోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతోనాకు గర్భఫలము నిమ్ము; లేనియెడల నేను చచ్చెదననెను.
ఆదికాండము 30 : 2 (TEV)
యాకోబు కోపము రాహేలుమీద రగులుకొనగా అతడునేను నీకు గర్భఫలమును ఇయ్యక పోయిన దేవునికి ప్రతిగా నున్నానా అనెను.
ఆదికాండము 30 : 3 (TEV)
అందు కామెనా దాసియైన బిల్హా ఉన్నది గదా; ఆమెతో పొమ్ము; ఆమె నా కొరకు పిల్లలను కనును; ఆలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి
ఆదికాండము 30 : 4 (TEV)
తన దాసియైన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా
ఆదికాండము 30 : 5 (TEV)
బిల్హా గర్భవతియై యాకోబునకు కుమారుని కనెను.
ఆదికాండము 30 : 6 (TEV)
అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పుతీర్చెను; ఆయన నా మొరను విని నాకు కుమారుని దయ చేసెననుకొని అతనికి దాను అని పేరు పెట్టెను.
ఆదికాండము 30 : 7 (TEV)
రాహేలు దాసియైన బిల్హా తిరిగి గర్భవతియై యాకోబుకు రెండవ కుమారుని కనెను.
ఆదికాండము 30 : 8 (TEV)
అప్పుడు రాహేలుదేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను.
ఆదికాండము 30 : 9 (TEV)
లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసియైన జిల్పాను తీసికొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను.
ఆదికాండము 30 : 10 (TEV)
లేయా దాసియైన జిల్పా యాకోబునకు కుమారుని కనగా
ఆదికాండము 30 : 11 (TEV)
లేయాఇది అదృష్టమేగదా అనుకొని అతనికి గాదు అను పేరుపెట్టెను.
ఆదికాండము 30 : 12 (TEV)
లేయా దాసియైన జిల్పా యాకోబునకు రెండవ కుమారుని కనగా
ఆదికాండము 30 : 13 (TEV)
లేయా నేను భాగ్యవంతురా లనుస్త్రీలు నన్ను భాగ్యవతి అందురు గదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టెను.
ఆదికాండము 30 : 14 (TEV)
గోధుమల కోతకాలములో రూబేను వెళ్లి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లియైన లేయాకు తెచ్చి యిచ్చెను. అప్పుడు రాహేలునీ కుమారుని పుత్ర దాతవృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయుమని లేయాతో అనగా
ఆదికాండము 30 : 15 (TEV)
ఆమెనా భర్తను తీసికొంటివే అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసికొందువా అని చెప్పెను. అందుకు రాహేలుకాబట్టి నీ కుమారుని పుత్రదాతవృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పెను.
ఆదికాండము 30 : 16 (TEV)
సాయంకాలమందు యాకోబు పొలము నుండి వచ్చునప్పుడు లేయా అతనిని ఎదుర్కొన బోయినీవు నా యొద్దకు రావలెను, నా కుమారుని పుత్రదాతవృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పెను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను.
ఆదికాండము 30 : 17 (TEV)
దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భ వతియై యాకోబునకు అయిదవ కుమారుని కనెను.
ఆదికాండము 30 : 18 (TEV)
లేయా నేను నా పెనిమిటికి నా దాసి నిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసెననుకొని అతనికి ఇశ్శా ఖారు అను పేరు పెట్టెను.
ఆదికాండము 30 : 19 (TEV)
లేయా మరల గర్భవతియై యాకోబునకు ఆరవ కుమారుని కనెను.
ఆదికాండము 30 : 20 (TEV)
అప్పుడు లేయాదేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను; నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయుననుకొని అతనికి జెబూలూను అను పేం
ఆదికాండము 30 : 21 (TEV)
ఆ తరువాత ఆమె కొమార్తెను కని ఆమెకు దీనా అను పేరు పెట్టెను.
ఆదికాండము 30 : 22 (TEV)
దేవుడు రాహేలును జ్ఞాపకము చేసికొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను.
ఆదికాండము 30 : 23 (TEV)
అప్పుడామె గర్భవతియై కుమా రుని కనిదేవుడు నా నింద తొలగించెననుకొనెను.
ఆదికాండము 30 : 24 (TEV)
మరియు ఆమె--యెహోవా మరియొక కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను.
ఆదికాండము 30 : 25 (TEV)
రాహేలు యోసేపును కనిన తరువాత యాకోబు లాబానుతోనన్ను పంపివేయుము; నా చోటికిని నా దేశమునకును వెళ్లెదను.
ఆదికాండము 30 : 26 (TEV)
నా భార్యలను నా పిల్లలను నా కప్పగించుము; అప్పుడు నేను వెళ్లెదను; వారి కోసము నీకు కొలువుచేసితిని; నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదువుగదా అని చెప్పెను.
ఆదికాండము 30 : 27 (TEV)
అందుకు లాబాను అతనితోనీ కటాక్షము నా మీదనున్న యెడల నా మాట వినుము; నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూచి తెలిసికొంటినని చెప్పెను.
ఆదికాండము 30 : 28 (TEV)
మరియు అతడునీ జీత మింతయని నాతో స్పష్టముగా చెప్పుము అది యిచ్చెదననెను.
ఆదికాండము 30 : 29 (TEV)
అందుకు యాకోబు అతని చూచినేను నీకెట్లు కొలువు చేసితినో నీ మందలు నాయొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియును;
ఆదికాండము 30 : 30 (TEV)
నేను రాకమునుపు నీకుండినది కొంచెమే; అయితే అది బహుగా అభి వృద్ధి పొందెను; నేను పాదముపెట్టిన చోటెల్ల యెహోవా నిన్ను ఆశీర్వదించెను; నేను నా యింటి వారికొరకు ఎప్పుడు సంపాద్యము చేసికొందు ననెను.
ఆదికాండము 30 : 31 (TEV)
అప్పుడ తడునేను నీకేమి ఇయ్యవలెనని యడిగి నందుకు యాకోబునీవు నాకేమియు ఇయ్యవద్దు; నీవు నాకొరకు ఈ విధముగా చేసినయెడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదను.
ఆదికాండము 30 : 32 (TEV)
నేడు నేను నీ మంద అంత టిలో నడచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొఱ్ఱను, గొఱ్ఱపిల్లలలో నల్లని ప్రతిదానిని, మేకలలో మచ్చలైనను పొడలైనను గలవాటిని వేరుపరచెదను; అట్టివి నాకు జీతమగును.
ఆదికాండము 30 : 33 (TEV)
ఇకమీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడవచ్చి నప్పుడు నా న్యాయప్రవర్తనయే నాకు సాక్ష్యమగును; మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నియు, గొఱ్ఱపిల్లలలో నలుపు లేనివన్నియు నా యొద్దనున్నయెడల నేను దొంగిలితినని చెప్పవచ్చుననెను.
ఆదికాండము 30 : 34 (TEV)
అందుకు లాబాను మంచిది, నీ మాటచొప్పుననే కాని మ్మనెను.
ఆదికాండము 30 : 35 (TEV)
ఆ దినమున లాబాను చారయైనను మచ్చ యైనను గల మేకపోతులను, పొడలైనను మచ్చలైనను గల పెంటిమేకలన్నిటిని కొంచెము తెలుపుగల ప్రతిదానిని గొఱ్ఱపిల్లలలో నల్లవాటి నన్నిటిని వేరుచేసి తన కుమారుల చేతి కప్పగించి
ఆదికాండము 30 : 36 (TEV)
తనకును యాకోబునకును మధ్య మూడు దినముల ప్రయాణమంత దూరము పెట్టెను; లాబానుయొక్క మిగిలిన మందను యాకోబు మేపు చుండెను.
ఆదికాండము 30 : 37 (TEV)
యాకోబు చినారు జంగి సాలు అను చెట్ల చువ్వలను తీసికొని ఆ చువ్వలలో తెల్లచారలు కనబడునట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి
ఆదికాండము 30 : 38 (TEV)
మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోను నీళ్లగాళ్లలోను వాటియెదుట పెట్టగా
ఆదికాండము 30 : 39 (TEV)
మందలు ఆ చువ్వల యెదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను.
ఆదికాండము 30 : 40 (TEV)
యాకోబు ఆ గొఱ్ఱపిల్లలను వేరుచేసి, చారలుగల వాటి తట్టును లాబాను మందలలో నల్లని వాటి తట్టును మందల ముఖములు త్రిప్పి తన మందలను లాబాను మందలతో నుంచక వాటిని వేరుగా ఉంచెను.
ఆదికాండము 30 : 41 (TEV)
మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లను అవి ఆ చువ్వల యెదుట చూలు కట్టునట్లు యాకోబు మంద కన్నుల యెదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెను.
ఆదికాండము 30 : 42 (TEV)
మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. అట్లు బలహీనమైనవి లాబానుకును బల మైనవి యాకోబు నకును వచ్చెను.
ఆదికాండము 30 : 43 (TEV)
ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధి కముగా అభివృద్ధిపొంది విస్తార మైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయెను.
❮
❯