ఆదికాండము 5 : 1 (TEV)
ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను;
ఆదికాండము 5 : 2 (TEV)
మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను.
ఆదికాండము 5 : 3 (TEV)
ఆదాము నూట ముప్పది యేండ్లు బ్రదికి తన పోలికెగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను.
ఆదికాండము 5 : 4 (TEV)
షేతును కనిన తరువాత ఆదాము బ్రదికిన దినములు ఎనిమిదివందల ఏండ్లు; అతడు కుమారులను కుమార్తెలను కనెను.
ఆదికాండము 5 : 5 (TEV)
ఆదాము బ్రదికిన దిన ములన్నియు తొమి్మదివందల ముప్పది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
ఆదికాండము 5 : 6 (TEV)
షేతు నూట అయిదేండ్లు బ్రదికి ఎనోషును కనెను.
ఆదికాండము 5 : 7 (TEV)
ఎనోషును కనిన తరువాత షేతు ఎనిమిదివందల ఏడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
ఆదికాండము 5 : 8 (TEV)
షేతు బ్రదికిన దిన ములన్నియు తొమి్మదివందల పండ్రెండేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
ఆదికాండము 5 : 9 (TEV)
ఎనోషు తొంబది సంవత్సరములు బ్రదికి, కేయినానును కనెను.
ఆదికాండము 5 : 10 (TEV)
కేయినానును కనిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదునైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
ఆదికాండము 5 : 11 (TEV)
ఎనోషు దినములన్నియు తొమి్మదివందల అయి దేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
ఆదికాండము 5 : 12 (TEV)
కేయినాను డెబ్బది యేండ్లు బ్రదికి మహలలేలును కనెను.
ఆదికాండము 5 : 13 (TEV)
మహలలేలును కనినతరువాత కేయినాను ఎనిమిది వందల నలువది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
ఆదికాండము 5 : 14 (TEV)
కేయినాను దినములన్నియు తొమి్మదివందల పది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
ఆదికాండము 5 : 15 (TEV)
మహలలేలు అరువది యైదేండ్లు బ్రదికి యెరెదును కనెను.
ఆదికాండము 5 : 16 (TEV)
యెరెదును కనినతరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్పదియేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
ఆదికాండము 5 : 17 (TEV)
మహలలేలు దినములన్నియు ఎనిమిదివందల తొంబదియైదేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
ఆదికాండము 5 : 18 (TEV)
యెరెదు నూట అరువది రెండేండ్లు బ్రదికి హనోకును కనెను.
ఆదికాండము 5 : 19 (TEV)
హనోకును కనిన తరువాత యెరెదు ఎనిమిది వందలయేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
ఆదికాండము 5 : 20 (TEV)
యెరెదు దినములన్నియు తొమి్మదివందల అరువదిరెండేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
ఆదికాండము 5 : 21 (TEV)
హనోకు అరువది యైదేండ్లు బ్రదికి మెతూషెలను కనెను.
ఆదికాండము 5 : 22 (TEV)
హనోకు మెతూషెలను కనిన తరువాత మూడు వందలయేండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తె లను కనెను.
ఆదికాండము 5 : 23 (TEV)
హనోకు దినములన్నియు మూడువందల అరువదియైదేండ్లు.
ఆదికాండము 5 : 24 (TEV)
హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను.
ఆదికాండము 5 : 25 (TEV)
మెతూషెల నూట ఎనుబదియేడేండ్లు బ్రదికి లెమెకును కనెను.
ఆదికాండము 5 : 26 (TEV)
మెతూషెల లెమెకును కనిన తరువాత ఏడు వందల ఎనుబది రెండేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
ఆదికాండము 5 : 27 (TEV)
మెతూషెల దినములన్నియు తొమి్మదివందల అరువది తొమి్మదియేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
ఆదికాండము 5 : 28 (TEV)
లెమెకు నూట ఎనుబది రెండేండ్లు బ్రదికి ఒక కుమా రుని కని
ఆదికాండము 5 : 29 (TEV)
భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయము లోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవహు అని పేరు
ఆదికాండము 5 : 30 (TEV)
లెమెకు నోవహును కనిన తరువాత ఏనూట తొంబదియైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
ఆదికాండము 5 : 31 (TEV)
లెమెకు దినములన్నియు ఏడువందల డెబ్బది యేడేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
ఆదికాండము 5 : 32 (TEV)
నోవహు ఐదువందల యేండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32

BG:

Opacity:

Color:


Size:


Font: