కీర్తనల గ్రంథము 139 : 1 (TEV)
యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొని యున్నావు
కీర్తనల గ్రంథము 139 : 2 (TEV)
నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు.
కీర్తనల గ్రంథము 139 : 3 (TEV)
నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలిసికొనియున్నావు.
కీర్తనల గ్రంథము 139 : 4 (TEV)
యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది.
కీర్తనల గ్రంథము 139 : 5 (TEV)
వెనుకను ముందును నీవు నన్ను ఆవరించియున్నావు నీ చేయి నామీద ఉంచియున్నావు.
కీర్తనల గ్రంథము 139 : 6 (TEV)
ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకందదు.
కీర్తనల గ్రంథము 139 : 7 (TEV)
నీ ఆత్మయొద్దనుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధినుండి నేనెక్కడికి పారిపోవుదును?
కీర్తనల గ్రంథము 139 : 8 (TEV)
నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు
కీర్తనల గ్రంథము 139 : 9 (TEV)
నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను
కీర్తనల గ్రంథము 139 : 10 (TEV)
అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడిచేయి నన్ను పట్టుకొనును
కీర్తనల గ్రంథము 139 : 11 (TEV)
అంధకారము నన్ను మరుగుచేయును నాకు కలుగు వెలుగు రాత్రివలె ఉండును అని నేనను కొనిన యెడల
కీర్తనల గ్రంథము 139 : 12 (TEV)
చీకటియైనను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటివలె నీకు వెలుగుగా ఉండును చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి
కీర్తనల గ్రంథము 139 : 13 (TEV)
నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే.
కీర్తనల గ్రంథము 139 : 14 (TEV)
నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.
కీర్తనల గ్రంథము 139 : 15 (TEV)
నేను రహస్యమందు పుట్టిననాడు భూమియొక్క అగాధస్థలములలో విచిత్రముగా నిర్మింపబడిననాడు నాకు కలిగినయెముకలును నీకు మరుగై యుండలేదు
కీర్తనల గ్రంథము 139 : 16 (TEV)
నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను.
కీర్తనల గ్రంథము 139 : 17 (TEV)
దేవా, నీ తలంపులు నా కెంత ప్రియమైనవి వాటి మొత్తమెంత గొప్పది.
కీర్తనల గ్రంథము 139 : 18 (TEV)
వాటిని లెక్కించెద ననుకొంటినా అవి యిసుక కంటెను లెక్కకు ఎక్కువై యున్నవి నేను మేల్కొంటినా యింకను నీయొద్దనే యుందును.
కీర్తనల గ్రంథము 139 : 19 (TEV)
దేవా,నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు నరహంతకులారా, నాయొద్దనుండి తొలగిపోవుడి.
కీర్తనల గ్రంథము 139 : 20 (TEV)
వారు దురాలోచనతో నిన్నుగూర్చి పలుకుదురు మోసపుచ్చుటకై నీ నామమునుబట్టి ప్రమాణము చేయుదురు.
కీర్తనల గ్రంథము 139 : 21 (TEV)
యెహోవా, నిన్ను ద్వేషించువారిని నేనును ద్వేషించు చున్నాను గదా? నీ మీద లేచువారిని నేను అసహ్యించుకొనుచున్నాను గదా?
కీర్తనల గ్రంథము 139 : 22 (TEV)
వారియందు నాకు పూర్ణద్వేషము కలదు వారిని నాకు శత్రువులనుగా భావించుకొనుచున్నాను
కీర్తనల గ్రంథము 139 : 23 (TEV)
దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసి కొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము
కీర్తనల గ్రంథము 139 : 24 (TEV)
నీకాయాసకరమైన మార్గము నాయందున్న దేమో చూడుము నిత్యమార్గమున నన్ను నడిపింపుము.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24

BG:

Opacity:

Color:


Size:


Font: