కీర్తనల గ్రంథము 24 : 1 (TEV)
భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులును యెహోవావే.
కీర్తనల గ్రంథము 24 : 2 (TEV)
ఆయన సముద్రములమీద దానికి పునాది వేసెను ప్రవాహజలములమీద దాని స్థిరపరచెను.
కీర్తనల గ్రంథము 24 : 3 (TEV)
యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడెవడు?
కీర్తనల గ్రంథము 24 : 4 (TEV)
వ్యర్థమైనదానియందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులును శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే.
కీర్తనల గ్రంథము 24 : 5 (TEV)
వాడు యెహోవావలన ఆశీర్వాదము నొందును తన రక్షకుడైన దేవునివలన నీతిమత్వము నొందును.
కీర్తనల గ్రంథము 24 : 6 (TEV)
ఆయన నాశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. (సెలా.)
కీర్తనల గ్రంథము 24 : 7 (TEV)
గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి మహిమగల రాజు ప్రవేశించునట్లు పురాతనమైన తలుపులారా, మిమ్మును లేవనెత్తికొనుడి.
కీర్తనల గ్రంథము 24 : 8 (TEV)
మహిమగల యీ రాజు ఎవడు? బలశౌర్యములుగల యెహోవా యుద్ధశూరుడైన యెహోవా.
కీర్తనల గ్రంథము 24 : 9 (TEV)
గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి, పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తికొనుడి.
కీర్తనల గ్రంథము 24 : 10 (TEV)
మహిమగల యీ రాజు ఎవడు? సైన్యములకధిపతియగు యెహోవాయే.ఆయనే యీ మహిమగల రాజు.

1 2 3 4 5 6 7 8 9 10

BG:

Opacity:

Color:


Size:


Font: