కీర్తనల గ్రంథము 25 : 1 (TEV)
యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తి కొనుచున్నాను.
కీర్తనల గ్రంథము 25 : 2 (TEV)
నా దేవా, నీయందు నమి్మక యుంచియున్నాను నన్ను సిగ్గుపడనియ్యకుము నా శత్రువులను నన్నుగూర్చి ఉత్సహింప నియ్యకుము
కీర్తనల గ్రంథము 25 : 3 (TEV)
నీకొరకు కనిపెట్టువారిలో ఎవడును సిగ్గునొందడు. హేతువులేకుండనే ద్రోహము చేయువారు సిగ్గు నొందుదురు.
కీర్తనల గ్రంథము 25 : 4 (TEV)
యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము నీత్రోవలను నాకు తేటపరచుము.
కీర్తనల గ్రంథము 25 : 5 (TEV)
నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్ల నీకొరకు కనిపెట్టుచున్నాను.
కీర్తనల గ్రంథము 25 : 6 (TEV)
యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసి కొనుము నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసికొనుము అవి పూర్వమునుండి యున్నవే గదా.
కీర్తనల గ్రంథము 25 : 7 (TEV)
నా బాల్యపాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసికొనకుము. యెహోవా నీ కృపనుబట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచు కొనుము.
కీర్తనల గ్రంథము 25 : 8 (TEV)
యెహోవా ఉత్తముడును యథార్థ వంతుడునై యున్నాడు కావున తన మార్గమునుగూర్చి ఆయన పాపులకు ఉపదేశించును.
కీర్తనల గ్రంథము 25 : 9 (TEV)
న్యాయవిధులనుబట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును.
కీర్తనల గ్రంథము 25 : 10 (TEV)
ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసన ములను గైకొనువారి విషయములో యెహోవాత్రోవలన్నియు కృపాసత్యమయములై యున్నవి
కీర్తనల గ్రంథము 25 : 11 (TEV)
యెహోవా, నా పాపము బహు ఘోరమైనది నీ నామమునుబట్టి దానిని క్షమింపుము.
కీర్తనల గ్రంథము 25 : 12 (TEV)
యెహోవాయందు భయభక్తులుగలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును.
కీర్తనల గ్రంథము 25 : 13 (TEV)
అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును.
కీర్తనల గ్రంథము 25 : 14 (TEV)
యెహోవా మర్మము ఆయనయందు భయభక్తులు గల వారికి తెలిసియున్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును.
కీర్తనల గ్రంథము 25 : 15 (TEV)
నా కనుదృష్టి యెల్లప్పుడు యెహోవావైపునకే తిరిగి యున్నది ఆయన నా పాదములను వలలోనుండి విడిపించును.
కీర్తనల గ్రంథము 25 : 16 (TEV)
నేను ఏకాకిని, బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపుము.
కీర్తనల గ్రంథము 25 : 17 (TEV)
నా హృదయవేదనలు అతివిస్తారములు ఇక్కట్టులోనుండి నన్ను విడిపింపుము.
కీర్తనల గ్రంథము 25 : 18 (TEV)
నా బాధను నా వేదనను కనుగొనుము నా పాపములన్నిటిని క్షమింపుము.
కీర్తనల గ్రంథము 25 : 19 (TEV)
నా శత్రువులను చూడుము, వారు అనేకులు క్రూరద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు.
కీర్తనల గ్రంథము 25 : 20 (TEV)
నేను నీ శరణుజొచ్చి యున్నాను, నన్ను సిగ్గుపడ నియ్యకుము నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము.
కీర్తనల గ్రంథము 25 : 21 (TEV)
నీకొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును గాక.
కీర్తనల గ్రంథము 25 : 22 (TEV)
దేవా, వారి బాధలన్నిటిలోనుండి ఇశ్రాయేలీయులను విమోచింపుము.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22

BG:

Opacity:

Color:


Size:


Font: