కీర్తనల గ్రంథము 48 : 1 (TEV)
మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై యున్నాడు.
కీర్తనల గ్రంథము 48 : 2 (TEV)
ఉత్తరదిక్కున మహారాజు పట్టణమైన సీయోను పర్వ తము రమ్యమైన యెత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా నున్నది
కీర్తనల గ్రంథము 48 : 3 (TEV)
దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్ష మగుచున్నాడు.
కీర్తనల గ్రంథము 48 : 4 (TEV)
రాజులు కూడిరి వారు ఏకముగా కూడి వచ్చిరి.
కీర్తనల గ్రంథము 48 : 5 (TEV)
వారు దాని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి భ్రమపడి త్వరగా వెళ్లిపోయిరి.
కీర్తనల గ్రంథము 48 : 6 (TEV)
వారచ్చటనుండగా వణకును ప్రసవించు స్త్రీ వేద నయు వారిని పట్టెను.
కీర్తనల గ్రంథము 48 : 7 (TEV)
తూర్పుగాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగులగొట్టు చున్నావు.
కీర్తనల గ్రంథము 48 : 8 (TEV)
సైన్యములకధిపతియగు యెహోవా పట్టణమునందు మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి యున్నాము దేవుడు నిత్యముగా దానిని స్థిరపరచియున్నాడు. (సెలా.)
కీర్తనల గ్రంథము 48 : 9 (TEV)
దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితివిు.
కీర్తనల గ్రంథము 48 : 10 (TEV)
దేవా, నీ నామము ఎంత గొప్పదో నీ కీర్తియు భూదిగంతములవరకు అంత గొప్పది నీ కుడిచెయ్యి నీతితో నిండియున్నది.
కీర్తనల గ్రంథము 48 : 11 (TEV)
నీ న్యాయవిధులనుబట్టి సీయోను పర్వతము సంతోషించును గాక యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక.
కీర్తనల గ్రంథము 48 : 12 (TEV)
ముందు రాబోవు తరములకు దాని వివరము మీరు చెప్పునట్లు సీయోనుచుట్టు తిరుగుచు దానిచుట్టు సంచరించుడి
కీర్తనల గ్రంథము 48 : 13 (TEV)
దాని బురుజులను లెక్కించుడి దాని ప్రాకారములను నిదానించి చూడుడి దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి.
కీర్తనల గ్రంథము 48 : 14 (TEV)
ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై యున్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించును.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14

BG:

Opacity:

Color:


Size:


Font: