కీర్తనల గ్రంథము 55 : 1 (TEV)
దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపమునకు విముఖుడవై యుండకుము.
కీర్తనల గ్రంథము 55 : 2 (TEV)
నా మనవి ఆలకించి నాకుత్తరమిమ్ము.
కీర్తనల గ్రంథము 55 : 3 (TEV)
శత్రువుల శబ్దమునుబట్టియు దుష్టులబలాత్కారమునుబట్టియు నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగు చున్నాను.వారు నామీద దోషము మోపుచున్నారుఆగ్రహముగలవారై నన్ను హింసించుచున్నారు.
కీర్తనల గ్రంథము 55 : 4 (TEV)
నా గుండె నాలో వేదనపడుచున్నది మరణభయము నాలో పుట్టుచున్నది
కీర్తనల గ్రంథము 55 : 5 (TEV)
దిగులును వణకును నాకు కలుగుచున్నవి మహా భయము నన్ను ముంచివేసెను.
కీర్తనల గ్రంథము 55 : 6 (TEV)
ఆహా గువ్వవలె నాకు రెక్కలున్నయెడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే
కీర్తనల గ్రంథము 55 : 7 (TEV)
త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని
కీర్తనల గ్రంథము 55 : 8 (TEV)
అరణ్యములో నివసించియుందునే అను కొంటిని.
కీర్తనల గ్రంథము 55 : 9 (TEV)
పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టిపనులు చేయువారిని నిర్మూలము చేయుము వారి నాలుకలు ఛేదించుము.
కీర్తనల గ్రంథము 55 : 10 (TEV)
రాత్రింబగళ్లు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి.
కీర్తనల గ్రంథము 55 : 11 (TEV)
దాని మధ్యను నాశనక్రియలు జరుగుచున్నవి వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి.
కీర్తనల గ్రంథము 55 : 12 (TEV)
నన్ను దూషించువాడు శత్రువు కాడు శత్రువైనయెడల నేను దాని సహింపవచ్చును నామీద మిట్టిపడువాడు నాయందు పగపట్టిన వాడు కాడు అట్టివాడైతే నేను దాగియుండవచ్చును.
కీర్తనల గ్రంథము 55 : 13 (TEV)
ఈ పనిచేసిన నీవు నా సహకారివి నా చెలికాడవు నా పరిచయుడవు.
కీర్తనల గ్రంథము 55 : 14 (TEV)
మనము కూడి మధురమైన గోష్ఠిచేసి యున్నవారము ఉత్సవమునకు వెళ్లు సమూహముతో దేవుని మందిర మునకు పోయి యున్నవారము.
కీర్తనల గ్రంథము 55 : 15 (TEV)
వారికి మరణము అకస్మాత్తుగా వచ్చును గాక సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురు గాక చెడుతనము వారి నివాసములలోను వారి అంతరంగము నందును ఉన్నది
కీర్తనల గ్రంథము 55 : 16 (TEV)
అయితే నేను దేవునికి మొఱ్ఱపెట్టుకొందును యెహోవా నన్ను రక్షించును.
కీర్తనల గ్రంథము 55 : 17 (TEV)
సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొందును ఆయన నా ప్రార్థన నాలకించును
కీర్తనల గ్రంథము 55 : 18 (TEV)
నా శత్రువులు అనేకులై యున్నారు అయినను వారు నామీదికి రాకుండునట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి యున్నాడు.
కీర్తనల గ్రంథము 55 : 19 (TEV)
పురాతనకాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు, మారుమనస్సు లేనివారై తనకు భయపడనివారికి ఉత్తర మిచ్చును.
కీర్తనల గ్రంథము 55 : 20 (TEV)
తమతో సమాధానముగా నున్నవారికి వారు బలా త్కారము చేయుదురు తాము చేసిన నిబంధన నతిక్రమింతురు.
కీర్తనల గ్రంథము 55 : 21 (TEV)
వారి నోటి మాటలు వెన్నవలె మృదువుగా నున్నవి అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురుకంటె నునుపైనవి అయితే అవి వరదీసిన కత్తులే.
కీర్తనల గ్రంథము 55 : 22 (TEV)
నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.
కీర్తనల గ్రంథము 55 : 23 (TEV)
దేవా, నాశనకూపములో నీవు వారిని పడవేయుదువు రక్తాపరాధులును వంచకులును సగముకాలమైన బ్రదుకరు. నేనైతే నీయందు నమి్మకయుంచి యున్నాను.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23

BG:

Opacity:

Color:


Size:


Font: