కీర్తనల గ్రంథము 7 : 1 (TEV)
యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చియున్నానునన్ను తరుమువారిచేతిలోనుండి నన్ను తప్పించుము.నన్ను తప్పించువాడెవడును లేకపోగా
కీర్తనల గ్రంథము 7 : 2 (TEV)
వారు సింహమువలె ముక్కలుగా చీల్చివేయకుండనన్ను తప్పించుము.
కీర్తనల గ్రంథము 7 : 3 (TEV)
యెహోవా నా దేవా, నేను ఈ కార్యముచేసినయెడల
కీర్తనల గ్రంథము 7 : 4 (TEV)
నాచేత పాపము జరిగినయెడలనాతో సమాధానముగా నుండినవానికి నేను కీడుచేసినయెడల
కీర్తనల గ్రంథము 7 : 5 (TEV)
శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్మునా ప్రాణమును నేలకు అణగద్రొక్క నిమ్మునా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము.నిర్నిమిత్తముగా నన్ను బాధించినవారిని నేను సంరక్షించి ని గదా.(సెలా.)
కీర్తనల గ్రంథము 7 : 6 (TEV)
యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్మునా విరోధుల ఆగ్రహము నణచుటకై లెమ్మునన్ను ఆదుకొనుటకై మేల్కొనుమున్యాయవిధిని నీవు నియమించియున్నావు గదా.
కీర్తనల గ్రంథము 7 : 7 (TEV)
జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనునప్పుడువారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము.
కీర్తనల గ్రంథము 7 : 8 (TEV)
యెహోవా జనములకు తీర్పు తీర్చువాడుయెహోవా, నా నీతినిబట్టియు నా యథార్థతను బట్టియు నా విషయములోనాకు న్యాయము తీర్చుము.
కీర్తనల గ్రంథము 7 : 9 (TEV)
హృదయములను అంతరింద్రియములనుపరిశీలించు నీతిగల దేవా,
కీర్తనల గ్రంథము 7 : 10 (TEV)
దుష్టుల చెడుతనము మాన్పుమునీతిగలవారిని స్థిరపరచుముయథార్థ హృదయులను రక్షించు దేవుడేనా కేడెమును మోయువాడై యున్నాడు.
కీర్తనల గ్రంథము 7 : 11 (TEV)
న్యాయమునుబట్టి ఆయన తీర్పు తీర్చునుఆయన ప్రతిదినము కోపపడు దేవుడు.
కీర్తనల గ్రంథము 7 : 12 (TEV)
ఒకడును మళ్లనియెడల, ఆయన తన ఖడ్గమును పదును పెట్టునుతన విల్లు ఎక్కు పెట్టి దానిని సిద్ధపరచి యున్నాడు
కీర్తనల గ్రంథము 7 : 13 (TEV)
వానికొరకు మరణసాధనములను సిద్ధపరచియున్నాడుతన అంబులను అగ్ని బాణములుగా చేసియున్నాడు
కీర్తనల గ్రంథము 7 : 14 (TEV)
పాపమును కనుటకు వాడు ప్రసవవేదన పడుచున్నాడుచేటును గర్భమున ధరించినవాడై అబద్దమును కని యున్నాడు.
కీర్తనల గ్రంథము 7 : 15 (TEV)
వాడు గుంటత్రవ్వి దానిని లోతుచేసియున్నాడుతాను త్రవ్విన గుంటలో తానేపడిపోయెను.
కీర్తనల గ్రంథము 7 : 16 (TEV)
వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చునువాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తిమీదనే పడును.
కీర్తనల గ్రంథము 7 : 17 (TEV)
యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదనుసర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17

BG:

Opacity:

Color:


Size:


Font: