కీర్తనల గ్రంథము 8 : 1 (TEV)
యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా,భూమియందంతట నీ నామము ఎంత ప్రభావముగలది.
కీర్తనల గ్రంథము 8 : 2 (TEV)
శత్రువులను పగతీర్చుకొనువారిని మాన్పివేయుటకై నీ విరోధులనుబట్టి బాలురయొక్కయు చంటి పిల్లలయొక్కయు స్తుతుల మూలముననీవు ఒక దుర్గమును స్థాపించి యున్నావు.
కీర్తనల గ్రంథము 8 : 3 (TEV)
నీ చేతిపనియైన నీ ఆకాశములనునీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా
కీర్తనల గ్రంథము 8 : 4 (TEV)
నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటి వాడు?నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు?
కీర్తనల గ్రంథము 8 : 5 (TEV)
దేవునికంటె వానిని కొంచెము తక్కువవానిగా చేసియున్నావు.మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి యున్నావు.
కీర్తనల గ్రంథము 8 : 6 (TEV)
నీ చేతిపనులమీద వానికి అధికారమిచ్చి యున్నావు.
కీర్తనల గ్రంథము 8 : 7 (TEV)
గొఱ్ఱలన్నిటిని, ఎడ్లనన్నిటిని అడవి మృగములను ఆకాశపక్షులను సముద్ర మత్స్య ములను
కీర్తనల గ్రంథము 8 : 8 (TEV)
సముద్రమార్గములలో సంచరించువాటి నన్నిటినివాని పాదములక్రింద నీవు ఉంచి యున్నావు.
కీర్తనల గ్రంథము 8 : 9 (TEV)
యెహోవా మా ప్రభువాభూమియందంతట నీ నామము ఎంత ప్రభావముగలది!

1 2 3 4 5 6 7 8 9

BG:

Opacity:

Color:


Size:


Font: