కీర్తనల గ్రంథము 82 : 1 (TEV)
దేవుని సమాజములో దేవుడు నిలిచియున్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు.
కీర్తనల గ్రంథము 82 : 2 (TEV)
ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పుతీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనులయెడల పక్షపాతము చూపు దురు?(సెలా.)
కీర్తనల గ్రంథము 82 : 3 (TEV)
పేదలకును తలిదండ్రులులేనివారికిని న్యాయము తీర్చుడి శ్రమగలవారికిని దీనులకును న్యాయము తీర్చుడి.
కీర్తనల గ్రంథము 82 : 4 (TEV)
దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భక్తిహీనుల చేతిలోనుండి వారిని తప్పించుడి.
కీర్తనల గ్రంథము 82 : 5 (TEV)
జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు దేశమునకున్న ఆధారములన్నియు కదలుచున్నవి.
కీర్తనల గ్రంథము 82 : 6 (TEV)
మీరు దైవములనియు మీరందరు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెల విచ్చియున్నాను.
కీర్తనల గ్రంథము 82 : 7 (TEV)
అయినను ఇతర మనుష్యులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు.
కీర్తనల గ్రంథము 82 : 8 (TEV)
దేవా లెమ్కు, భూమికి తీర్పు తీర్చుము అన్యజనులందరు నీకే స్వాస్థ్యముగా ఉందురు.

1 2 3 4 5 6 7 8

BG:

Opacity:

Color:


Size:


Font: