కీర్తనల గ్రంథము 90 : 1 (TEV)
ప్రభువా, తరతరములనుండి మాకు నివాసస్థలము నీవే.
కీర్తనల గ్రంథము 90 : 2 (TEV)
పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు
కీర్తనల గ్రంథము 90 : 3 (TEV)
నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు నరులారా, తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు.
కీర్తనల గ్రంథము 90 : 4 (TEV)
నీ దృష్టికి వేయి సంవత్సరములు గతించిన నిన్నటివలె నున్నవి రాత్రియందలి యొక జామువలెనున్నవి.
కీర్తనల గ్రంథము 90 : 5 (TEV)
వరదచేత నైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చ గడ్డివలె చిగిరింతురు
కీర్తనల గ్రంథము 90 : 6 (TEV)
ప్రొద్దున అది మొలిచి చిగిరించును సాయంకాలమున అది కోయబడి వాడబారును.
కీర్తనల గ్రంథము 90 : 7 (TEV)
నీ కోపమువలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతనుబట్టి దిగులుపడుచున్నాము.
కీర్తనల గ్రంథము 90 : 8 (TEV)
మా దోషములను నీవు నీ యెదుట నుంచుకొని యున్నావు నీ ముఖకాంతిలో మా రహస్యపాపములు కనబడు చున్నవి.
కీర్తనల గ్రంథము 90 : 9 (TEV)
నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నియు గడిపితివిు. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపు కొందుము.
కీర్తనల గ్రంథము 90 : 10 (TEV)
మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధికబలమున్న యెడల ఎనుబది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము.
కీర్తనల గ్రంథము 90 : 11 (TEV)
నీ ఆగ్రహబలము ఎంతో ఎవరికి తెలియును? నీకు చెందవలసిన భయముకొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియును?
కీర్తనల గ్రంథము 90 : 12 (TEV)
మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము.
కీర్తనల గ్రంథము 90 : 13 (TEV)
యెహోవా, తిరుగుము ఎంతవరకు తిరుగకయుందువు? నీ సేవకులను చూచి సంతాపపడుము.
కీర్తనల గ్రంథము 90 : 14 (TEV)
ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నియు ఉత్సహించి సంతోషించెదము.
కీర్తనల గ్రంథము 90 : 15 (TEV)
నీవు మమ్మును శ్రమపరచిన దినముల కొలది మేము కీడనుభవించిన యేండ్లకొలది మమ్మును సంతోష పరచుము.
కీర్తనల గ్రంథము 90 : 16 (TEV)
నీ సేవకులకు నీ కార్యము కనుపరచుము వారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము.
కీర్తనల గ్రంథము 90 : 17 (TEV)
మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక మా చేతిపనిని మాకు స్థిరపరచుము మా చేతిపనిని స్థిరపరచుము.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17

BG:

Opacity:

Color:


Size:


Font: