కీర్తనల గ్రంథము 92 : 1 (TEV)
యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా,
కీర్తనల గ్రంథము 92 : 2 (TEV)
నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను
కీర్తనల గ్రంథము 92 : 3 (TEV)
పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారాతోను ప్రచురించుట మంచిది.
కీర్తనల గ్రంథము 92 : 4 (TEV)
ఎందుకనగా యెహోవా, నీ కార్యముచేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు నీ చేతిపనులబట్టి నేను ఉత్సహించుచున్నాను.
కీర్తనల గ్రంథము 92 : 5 (TEV)
యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి! నీ ఆలోచనలు అతిగంభీరములు,
కీర్తనల గ్రంథము 92 : 6 (TEV)
పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వివేచింపరు.
కీర్తనల గ్రంథము 92 : 7 (TEV)
నిత్యనాశనము నొందుటకే గదా భక్తిహీనులు గడ్డివలె చిగుర్చుదురు. చెడుపనులు చేయువారందరు పుష్పించుదురు.
కీర్తనల గ్రంథము 92 : 8 (TEV)
యెహోవా, నీవే నిత్యము మహోన్నతుడవుగా నుందువు
కీర్తనల గ్రంథము 92 : 9 (TEV)
నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించెదరు చెడుపనులు చేయువారందరు చెదరిపోవుదురు.
కీర్తనల గ్రంథము 92 : 10 (TEV)
గురుపోతు కొమ్మువలె నీవు నా కొమ్ము పైకెత్తితివి క్రొత్త తైలముతో నేను అంటబడితిని.
కీర్తనల గ్రంథము 92 : 11 (TEV)
నాకొరకు పొంచినవారి గతి నాకన్నులు ఆశతీర చూచెను నాకువిరోధముగా లేచినదుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను
కీర్తనల గ్రంథము 92 : 12 (TEV)
నీతిమంతులు ఖర్జూరవృక్షమువలె మొవ్వువేయు దురు లెబానోనుమీది దేవదారు వృక్షమువలె వారు ఎదుగు దురు
కీర్తనల గ్రంథము 92 : 13 (TEV)
యెహోవా మందిరములో నాటబడినవారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు.
కీర్తనల గ్రంథము 92 : 14 (TEV)
నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతు డనియు ఆయనయందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై
కీర్తనల గ్రంథము 92 : 15 (TEV)
వారు ముసలితనమందు ఇంక చిగురు పెట్టుచుందురు సారము కలిగి పచ్చగా నుందురు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15

BG:

Opacity:

Color:


Size:


Font: