నిర్గమకాండము 9 : 1 (TEV)
తరువాత యెహోవా మోషేతో ఇట్లనెనునీవు ఫరోయొద్దకు వెళ్లినన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము.
నిర్గమకాండము 9 : 2 (TEV)
నీవు వారిని పోనియ్యనొల్లక ఇంకను వారిని నిర్బంధించినయెడల
నిర్గమకాండము 9 : 3 (TEV)
ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువులమీదికిని నీ గుఱ్ఱములమీదికిని గాడిదలమీదికిని ఒంటెలమీదికిని ఎద్దుల మీదికిని గొఱ్ఱల మీదికిని వచ్చును, మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును.
నిర్గమకాండము 9 : 4 (TEV)
అయితే యెహోవా ఇశ్రాయేలీ యుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును; ఇశ్రాయేలీయులకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడని
నిర్గమకాండము 9 : 5 (TEV)
మరియు యెహోవా కాలము నిర్ణయించిరేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించుననెను.
నిర్గమకాండము 9 : 6 (TEV)
మరునాడు యెహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తీయుల పశువులన్నియు చచ్చెను గాని ఇశ్రాయేలీయుల పశువులలో ఒకటియు చావలేదు.
నిర్గమకాండము 9 : 7 (TEV)
ఫరో ఆ సంగతి తెలిసికొన పంపినప్పుడు ఇశ్రాయేలు పశువులలో ఒకటియు చావలేదు; అయినను అప్పటికిని ఫరో హృదయము కఠినమై నందున జనులను పంపక పోయెను.
నిర్గమకాండము 9 : 8 (TEV)
కాగా యెహోవామీరు మీ పిడికిళ్లనిండ ఆవపు బుగ్గి తీసికొనుడి, మోషే ఫరో కన్నులయెదుట ఆకాశమువైపు దాని చల్లవలెను.
నిర్గమకాండము 9 : 9 (TEV)
అప్పుడు అది ఐగుప్తు దేశ మంతట సన్నపు ధూళియై ఐగుప్తు దేశమంతట మనుష్యుల మీదను జంతువులమీదను పొక్కులు పొక్కు దద్దురు లగునని మోషే అహరోనులతో చెప్పెను.
నిర్గమకాండము 9 : 10 (TEV)
కాబట్టి వారు ఆవపుబుగ్గి తీసికొనివచ్చి ఫరో యెదుట నిలిచిరి. మోషే ఆకాశమువైపు దాని చల్లగానే అది మనుష్యులకును జంతువులకును పొక్కులు పొక్కు దద్దురులాయెను.
నిర్గమకాండము 9 : 11 (TEV)
ఆ దద్దురులవలన శకునగాండ్రు మోషేయెదుట నిలువ లేకపోయిరి ఆ దద్దురులు శకునగాండ్రకును ఐగుప్తీయు లందరికిని పుట్టెను.
నిర్గమకాండము 9 : 12 (TEV)
అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను, అతడు వారి మాట వినకపోయెను.
నిర్గమకాండము 9 : 13 (TEV)
తరువాత యెహోవా మోషేతో ఇట్లనెనుహెబ్రీ యుల దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు; నీవు తెల్లవారగానే లేచిపోయి ఫరోయెదుట నిలిచినన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము.
నిర్గమకాండము 9 : 14 (TEV)
సమస్త భూమిలో నావంటివారెవరును లేరని నీవు తెలిసికొనవలెనని ఈ సారి నేను నా తెగుళ్ళన్నియు నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకులమీదికిని నీ ప్రజలమీదికిని పంపెదను;
నిర్గమకాండము 9 : 15 (TEV)
భూమిమీద నుండకుండ నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపియుంటినేని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసియుందును.
నిర్గమకాండము 9 : 16 (TEV)
నా బలమును నీకు చూపునట్లును, భూలోక మందంతట నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియ మించితిని.
నిర్గమకాండము 9 : 17 (TEV)
నీవు ఇంక నా ప్రజలను పోనియ్యనొల్లక వారిమీద ఆతిశయపడుచున్నావు.
నిర్గమకాండము 9 : 18 (TEV)
ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధ కరమైన వడగండ్లను కురిపించె దను; ఐగుపు ్తరాజ్యము స్థాపించిన దినము మొదలుకొని యిదివరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు.
నిర్గమకాండము 9 : 19 (TEV)
కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రముచేయుము. ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుష్యునిమీదను జంతువు మీదను వడగండ్లు కురియును, అప్పుడు అవి చచ్చునని చెప్పుమనెను.
నిర్గమకాండము 9 : 20 (TEV)
ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను.
నిర్గమకాండము 9 : 21 (TEV)
అయితే యెహోవా మాట లక్ష్యపెట్టనివాడు తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చెను.
నిర్గమకాండము 9 : 22 (TEV)
యెహోవానీ చెయ్యి ఆకాశమువైపు చూపుము; ఐగుప్తుదేశమందలి మనుష్యులమీదను జంతువులమీదను పొలముల కూరలన్నిటిమీదను వడగండ్లు ఐగుప్తు దేశమంతట పడునని మోషేతో చెప్పెను.
నిర్గమకాండము 9 : 23 (TEV)
మోషే తనకఱ్ఱను ఆకాశమువైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమిమీద పడుచుండెను. యెహోవా ఐగుప్తుదేశముమీద వడగండ్లు కురిపించెను.
నిర్గమకాండము 9 : 24 (TEV)
ఆలాగు వడగండ్లును వడగండ్లతో కలిసిన పిడుగులును బహు బలమైన వాయెను. ఐగుప్తు దేశమం దంతటను అది రాజ్యమైనది మొదలుకొని యెన్నడును అట్టివి కలుగలేదు.
నిర్గమకాండము 9 : 25 (TEV)
ఆ వడగండ్లు ఐగుప్తుదేశమందంతట మనుష్యుల నేమి జంతువుల నేమి బయటనున్నది యావత్తును నశింపచేసెను. వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను, పొలములోని ప్రతి చెట్టును విరుగ గొట్టెను.
నిర్గమకాండము 9 : 26 (TEV)
అయితే ఇశ్రాయేలీయులున్న గోషెను దేశములో మాత్రము వడగండ్లు పడలేదు.
నిర్గమకాండము 9 : 27 (TEV)
ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపినేను ఈసారి పాపముచేసియున్నాను; యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులును దుర్మార్గులము;
నిర్గమకాండము 9 : 28 (TEV)
ఇంతమట్టుకు చాలును; ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండునట్లు యెహోవాను వేడుకొనుడి, మిమ్మును పోనిచ్చెదను, మిమ్మును ఇకను నిలుపనని వారితో చెప్పగా
నిర్గమకాండము 9 : 29 (TEV)
మోషే అతని చూచినేను ఈ పట్టణమునుండి బయలు వెళ్లగానే నా చేతులు యెహోవావైపు ఎత్తెదను. ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లును ఇకమీదట పడవు. అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును.
నిర్గమకాండము 9 : 30 (TEV)
అయినను నీవును నీ సేవకులును ఇకను దేవుడైన యెహో వాకు భయపడరని నాకు తెలిసియున్నదనెను.
నిర్గమకాండము 9 : 31 (TEV)
అప్పుడు జనుపచెట్లు పువ్వులు పూసెను, యవలచేలు వెన్నులు వేసినవి గనుక జనుప యవలచేలును చెడగొట్టబడెను గాని
నిర్గమకాండము 9 : 32 (TEV)
గోధుమలు మెరపమొలకలు ఎదగనందున అవి చెడగొట్ట బడలేదు.
నిర్గమకాండము 9 : 33 (TEV)
మోషే ఫరోను విడిచి ఆ పట్టణమునుండి బయలు వెళ్లి యెహోవావైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ యురుములును వడగండ్లును నిలిచిపోయెను, వర్షము భూమి మీద కురియుట మానెను.
నిర్గమకాండము 9 : 34 (TEV)
అయితే ఫరో వర్షమును వడ గండ్లును ఉరుములును నిలిచిపోవుట చూచి, అతడును అతని సేవకులును ఇంక పాపము చేయుచు తమ హృదయ ములను కఠినపరచుకొనిరి.
నిర్గమకాండము 9 : 35 (TEV)
యెహోవా మోషేద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమాయెను; అతడు ఇశ్రాయేలీయులను పోనియ్యక పోయెను.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35

BG:

Opacity:

Color:


Size:


Font: