సామెతలు 14 : 1 (TEV)
జ్ఞానవంతురాలు తన యిల్లు కట్టును మూఢురాలు తన చేతులతో తన యిల్లు ఊడ... బెరుకును.
సామెతలు 14 : 2 (TEV)
యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవాయందు భయభక్తులుగలవాడు కుటిలచిత్తుడు ఆయనను తిరస్కరించువాడు,
సామెతలు 14 : 3 (TEV)
మూఢుల నోట బెత్తమువంటి గర్వమున్నది. జ్ఞానుల పెదవులు వారిని కాపాడును.
సామెతలు 14 : 4 (TEV)
ఎద్దులు లేని చోట గాదెయందు ధాన్యముండదు ఎద్దుల బలముచేత విస్తారము వచ్చుబడి కలుగును
సామెతలు 14 : 5 (TEV)
నమ్మక మైన సాక్షి అబద్ధమాడడు కూటసాక్షికి అబద్ధములు ప్రియములు.
సామెతలు 14 : 6 (TEV)
అపహాసకుడు జ్ఞానము వెదకుట వ్యర్థము. తెలివిగలవానికి జ్ఞానము సులభము.
సామెతలు 14 : 7 (TEV)
బుద్ధిహీనుని యెదుటనుండి వెళ్లిపొమ్ము జ్ఞానవచనములు వానియందు కనబడవు గదా?
సామెతలు 14 : 8 (TEV)
తమ ప్రవర్తనను కనిపెట్టి యుండుట వివేకుల జ్ఞానము నకు లక్షణము మోసకృత్యములే బుద్ధిహీనులు కనుపరచు మూఢత.
సామెతలు 14 : 9 (TEV)
మూఢులు చేయు అపరాధపరిహారార్థబలి వారిని అపహాస్యము చేయును యథార్థవంతులు ఒకరియందు ఒకరు దయ చూపుదురు.
సామెతలు 14 : 10 (TEV)
ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియును ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానే రడు.
సామెతలు 14 : 11 (TEV)
భక్తిహీనుల యిల్లు నిర్మూలమగును యథార్థవంతుల గుడారము వర్థిల్లును.
సామెతలు 14 : 12 (TEV)
ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును.
సామెతలు 14 : 13 (TEV)
ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండ వచ్చును. సంతోషము తుదకు వ్యసనమగును.
సామెతలు 14 : 14 (TEV)
భక్తి విడిచినవాని మార్గములు వానికే వెక్కసమగును మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును.
సామెతలు 14 : 15 (TEV)
జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును.
సామెతలు 14 : 16 (TEV)
జ్ఞానముగలవాడు భయపడి కీడునుండి తొలగును బుద్ధిహీనుడు విఱ్ఱవీగి నిర్భయముగా తిరుగును.
సామెతలు 14 : 17 (TEV)
త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును. దుర్యోచనలుగలవాడు ద్వేషింపబడును.
సామెతలు 14 : 18 (TEV)
జ్ఞానము లేనివారికి మూఢత్వమే స్వాస్థ్యము వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురు.
సామెతలు 14 : 19 (TEV)
చెడ్డవారు మంచివారి యెదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు.
సామెతలు 14 : 20 (TEV)
దరిద్రుడు తన పొరుగువారికి అసహ్యుడు ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు.
సామెతలు 14 : 21 (TEV)
తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయు వాడు బీదలను కటాక్షించువాడు ధన్యుడు.
సామెతలు 14 : 22 (TEV)
కీడు కల్పించువారు తప్పిపోవుదురు మేలు కల్పించువారు కృపాసత్యముల నొందుదురు.
సామెతలు 14 : 23 (TEV)
ఏ కష్టము చేసినను లాభమే కలుగును వట్టి మాటలు లేమిడికి కారణములు.
సామెతలు 14 : 24 (TEV)
జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే.
సామెతలు 14 : 25 (TEV)
నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును అబద్ధములాడువాడు వట్టి మోసగాడు.
సామెతలు 14 : 26 (TEV)
యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట బహు ధైర్యము పుట్టించును
సామెతలు 14 : 27 (TEV)
అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవపు ఊట అది మరణపాశములలోనుండి విడిపించును
సామెతలు 14 : 28 (TEV)
జనసమృద్ధి కలుగుటచేత రాజులకు ఘనత వచ్చును జనక్షయము రాజులకు వినాశకరము.
సామెతలు 14 : 29 (TEV)
దీర్ఘశాంతముగలవాడు మహా వివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొం దును.
సామెతలు 14 : 30 (TEV)
సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్లు.
సామెతలు 14 : 31 (TEV)
దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించు వాడు బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు.
సామెతలు 14 : 32 (TEV)
అపాయము రాగా భక్తిహీనుడు నశించును మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు.
సామెతలు 14 : 33 (TEV)
తెలివిగలవాని హృదయమందు జ్ఞానము సుఖనివా సము చేయును బుద్ధిహీనుల అంతరంగములోనున్నది బయలుపడును
సామెతలు 14 : 34 (TEV)
నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును.
సామెతలు 14 : 35 (TEV)
బుద్ధిగల సేవకుడు రాజుల కిష్టుడు అవమానకరముగా నడచువానిమీద రాజు కోపించును

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35

BG:

Opacity:

Color:


Size:


Font: