సామెతలు 24 : 1 (TEV)
దుర్జనులను చూచి మత్సరపడకుము వారి సహవాసము కోరకుము
సామెతలు 24 : 2 (TEV)
వారి హృదయము బలాత్కారము చేయ యోచించును వారి పెదవులు కీడునుగూర్చి మాటలాడును.
సామెతలు 24 : 3 (TEV)
జ్ఞానమువలన ఇల్లు కట్టబడును వివేచనవలన అది స్థిరపరచబడును.
సామెతలు 24 : 4 (TEV)
తెలివిచేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును.
సామెతలు 24 : 5 (TEV)
జ్ఞానముగలవాడు బలవంతుడుగా నుండును తెలివిగలవాడు శక్తిమంతుడుగా నుండును.
సామెతలు 24 : 6 (TEV)
వివేకముగల నాయకుడవై యుద్ధముచేయుము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము
సామెతలు 24 : 7 (TEV)
మూర్ఖునికి జ్ఞానము అందదు గుమ్మమునొద్ద అట్టివారు మౌనులై యుందురు.
సామెతలు 24 : 8 (TEV)
కీడుచేయ పన్నాగములు పన్నువానికి తంటాలమారి అని పేరు పెట్టబడును.
సామెతలు 24 : 9 (TEV)
మూర్ఖుని యోచన పాపము అపహాసకులు నరులకు హేయులు.
సామెతలు 24 : 10 (TEV)
శ్రమదినమున నీవు క్రుంగినయెడల నీవు చేతకాని వాడవగుదువు.
సామెతలు 24 : 11 (TEV)
చావునకై పట్టబడినవారిని నీవు తప్పించుము నాశమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా?
సామెతలు 24 : 12 (TEV)
ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొనినయెడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహిం చును గదా. నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును గదా నరులకు వారి వారి పనులనుబట్టి ఆయన ప్రతికారము చేయును గదా.
సామెతలు 24 : 13 (TEV)
నా కుమారుడా, తేనె త్రాగుము అది రుచిగలది గదా తేనెపట్టు తినుము అది నీ నాలుకకు తీపియే గదా.
సామెతలు 24 : 14 (TEV)
నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలిసికొనుము అది నీకు దొరికినయెడల ముందుకు నీకు మంచిగతి కలుగును నీ ఆశ భంగము కానేరదు.
సామెతలు 24 : 15 (TEV)
భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమునొద్ద పొంచి యుండకుము వాని విశ్రమస్థలమును పాడుచేయకుము.
సామెతలు 24 : 16 (TEV)
నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు.
సామెతలు 24 : 17 (TEV)
నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము వాడు తొట్రిల్లినప్పుడు నీవు మనస్సున నుల్లసింపకుము.
సామెతలు 24 : 18 (TEV)
యెహోవా అది చూచి అసహ్యించుకొని వానిమీదనుండి తన కోపము త్రిప్పుకొనునేమో.
సామెతలు 24 : 19 (TEV)
దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకుము భక్తిహీనులయెడల మత్సరపడకుము.
సామెతలు 24 : 20 (TEV)
దుర్జనునికి ముందు గతి లేదు భక్తిహీనుల దీపము ఆరి పోవును
సామెతలు 24 : 21 (TEV)
నా కుమారుడా, యెహోవాను ఘనపరచుము రాజును ఘనపరచుము ఆలాగు చేయనివారి జోలికి పోకుము.
సామెతలు 24 : 22 (TEV)
అట్టివారికి ఆపద హఠాత్తుగా తటస్థించును వారి కాలము ఎప్పుడు ముగియునో యెవరికి తెలియును?
సామెతలు 24 : 23 (TEV)
ఇవియు జ్ఞానులు చెప్పిన సామెతలే న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు
సామెతలు 24 : 24 (TEV)
నీయందు దోషములేదని దుష్టునితో చెప్పువానిని ప్రజలు శపించుదురు జనులు అట్టివానియందు అసహ్యపడుదురు.
సామెతలు 24 : 25 (TEV)
న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును క్షేమకరమైన దీవెన అట్టివారిమీదికి వచ్చును.
సామెతలు 24 : 26 (TEV)
సరియైన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దుపెట్టుకొనినట్లుండును.
సామెతలు 24 : 27 (TEV)
బయట నీ పని చక్క పెట్టుకొనుము ముందుగా పొల ములో దాని సిద్ధపరచుము తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును.
సామెతలు 24 : 28 (TEV)
నిర్నిమిత్తముగా నీ పొరుగువానిమీద సాక్ష్యము పలుక కుము నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా?
సామెతలు 24 : 29 (TEV)
వాడు నాకు చేసినట్లు వానికి చేసెదను వాని క్రియచొప్పున వానికి ప్రతిఫలమిచ్చెద నను కొనకుము.
సామెతలు 24 : 30 (TEV)
సోమరివాని చేను నేను దాటి రాగా తెలివిలేనివాని ద్రాక్షతోట నేను దాటి రాగా
సామెతలు 24 : 31 (TEV)
ఇదిగో దానియందంతట ముండ్ల తుప్పలు బలిసి యుండెను.దూలగొండ్లు దాని కప్పియుండెను దాని రాతి గోడ పడియుండెను.
సామెతలు 24 : 32 (TEV)
నేను దాని చూచి యోచన చేసికొంటిని దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని.
సామెతలు 24 : 33 (TEV)
ఇంక కొంచెము నిద్ర యింక కొంచెము కునుకుపాటు పరుండుటకై యింక కొంచెము చేతులు ముడుచు కొనుట
సామెతలు 24 : 34 (TEV)
వీటివలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును ఆయుధస్థుడు వచ్చినట్లు లేమి నీమీదికి వచ్చును.
❮
❯