సామెతలు 26 : 1 (TEV)
ఎండకాలమునకు మంచు గిట్టదు కోతకాలమునకు వర్షము గిట్టదు అటువలె బుద్ధిహీనునికి ఘనత గిట్టదు.
సామెతలు 26 : 2 (TEV)
రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోవెలయు దిగకుండునట్లు హేతువులేని శాపము తగులకపోవును.
సామెతలు 26 : 3 (TEV)
గుఱ్ఱమునకు చబుకు గాడిదకు కళ్లెము మూర్ఖుల వీపునకు బెత్తము.
సామెతలు 26 : 4 (TEV)
వాని మూఢతచొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తర మియ్య కుము ఇచ్చినయెడల నీవును వాని పోలియుందువు.
సామెతలు 26 : 5 (TEV)
వాని మూఢతచొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తర మిమ్ము ఆలాగు చేయనియెడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకొనును.
సామెతలు 26 : 6 (TEV)
మూర్ఖునిచేత వర్తమానము పంపువాడు కాళ్లు తెగగొట్టుకొని విషము త్రాగినవానితో సమా నుడు.
సామెతలు 26 : 7 (TEV)
కుంటివాని కాళ్లు పట్టులేక యున్నట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండును
సామెతలు 26 : 8 (TEV)
బుద్ధిహీనుని ఘనపరచువాడు వడిసెలలోని రాయి కదలకుండ కట్టువానితో సమానుడు.
సామెతలు 26 : 9 (TEV)
మూర్ఖుల నోట సామెత మత్తునుగొనువాని చేతిలో ముల్లు గుచ్చుకొన్న ట్లుండును.
సామెతలు 26 : 10 (TEV)
అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును మూర్ఖునివలన కలుగు లాభము నిలువదు కూలికి వానిని పిలిచినవాడును చెడిపోవును.
సామెతలు 26 : 11 (TEV)
తన మూఢతను మరల కనుపరచు మూర్ఖుడు కక్కినదానికి తిరుగు కుక్కతో సమానుడు.
సామెతలు 26 : 12 (TEV)
తన దృష్టికి జ్ఞానిననుకొనువానిని చూచితివా? వానిని గుణపరచుటకంటె మూర్ఖుని గుణపరచుట సుళువు.
సామెతలు 26 : 13 (TEV)
సోమరిదారిలో సింహమున్నదనును వీధిలో సింహ మున్నదనును.
సామెతలు 26 : 14 (TEV)
ఉతకమీద తలుపు తిరుగును తన పడకమీద సోమరి తిరుగును.
సామెతలు 26 : 15 (TEV)
సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును నోటియొద్దకు దాని తిరిగి యెత్తుట కష్టమనుకొనును.
సామెతలు 26 : 16 (TEV)
హేతువులు చూపగల యేడుగురికంటె సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొనును
సామెతలు 26 : 17 (TEV)
తనకు పట్టని జగడమునుబట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకొనువానితో సమానుడు.
సామెతలు 26 : 18 (TEV)
తెగులు అమ్ములు కొరవులు విసరు వెఱ్ఱివాడు
సామెతలు 26 : 19 (TEV)
తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసితినని పలుకువానితో సమానుడు.
సామెతలు 26 : 20 (TEV)
కట్టెలు లేనియెడల అగ్ని ఆరిపోవును కొండెగాడు లేనియెడల జగడము చల్లారును.
సామెతలు 26 : 21 (TEV)
వేడిబూడిదెకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు కలహప్రియుడు.
సామెతలు 26 : 22 (TEV)
కొండెగాని మాటలు రుచిగల పదార్థములవంటివి అవి లోకడుపులోనికి దిగిపోవును.
సామెతలు 26 : 23 (TEV)
చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెద వులును కలిగియుండుట మంటి పెంకుమీది వెండి పూతతో సమానము.
సామెతలు 26 : 24 (TEV)
పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును.
సామెతలు 26 : 25 (TEV)
వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మ కుము వాని హృదయములో ఏడు హేయవిషయములు కలవు.
సామెతలు 26 : 26 (TEV)
వాడు తనద్వేషమును కపటవేషముచేత దాచుకొనును సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును.
సామెతలు 26 : 27 (TEV)
గుంటను త్రవ్వువాడే దానిలో పడును రాతిని పొర్లించువానిమీదికి అది తిరిగి వచ్చును.
సామెతలు 26 : 28 (TEV)
అబద్ధములాడువాడు తాను నలుగగొట్టినవారిని ద్వేషిం చును ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగజేయును.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28

BG:

Opacity:

Color:


Size:


Font: