సామెతలు 5 : 1 (TEV)
నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము వివేకముగల నా బోధకు చెవి యొగ్గుము
సామెతలు 5 : 2 (TEV)
అప్పుడు నీవు బుద్ధికలిగి నడచుకొందువు తెలివినిబట్టి నీ పెదవులు మాటలాడును.
సామెతలు 5 : 3 (TEV)
జారస్త్రీ పెదవులనుండి తేనె కారును దాని నోటి మాటలు నూనెకంటెను నునుపైనవి
సామెతలు 5 : 4 (TEV)
దానివలన కలుగు ఫలము ముసిణిపండంత చేదు అది రెండంచులుగల కత్తియంత పదునుగలది,
సామెతలు 5 : 5 (TEV)
దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును
సామెతలు 5 : 6 (TEV)
అది జీవమార్గమును ఏమాత్రమును విచారింపదు దానికి తెలియకుండనే దాని పాదములు ఇటు అటు తిరుగును.
సామెతలు 5 : 7 (TEV)
కుమారులారా, నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశమునుండి తొలగకుడి.
సామెతలు 5 : 8 (TEV)
జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసికొనుము దాని యింటివాకిటి దగ్గరకు వెళ్లకుము.
సామెతలు 5 : 9 (TEV)
వెళ్లినయెడల పరులకు నీ ¸°వనబలమును క్రూరులకు నీ జీవితకాలమును ఇచ్చివేతువు
సామెతలు 5 : 10 (TEV)
నీ ఆస్తివలన పరులు తృప్తిపొందుదురు నీ కష్టార్జితము అన్యుల యిల్లు చేరును.
సామెతలు 5 : 11 (TEV)
తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు
సామెతలు 5 : 12 (TEV)
అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని? నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను?
సామెతలు 5 : 13 (TEV)
నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు
సామెతలు 5 : 14 (TEV)
నేను సమాజ సంఘముల మధ్యనుండినను ప్రతివిధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే యెడమాయెను అని నీవు చెప్పుకొనుచు మూలు గుచు నుందువు.
సామెతలు 5 : 15 (TEV)
నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము.
సామెతలు 5 : 16 (TEV)
నీ ఊటలు బయటికి చెదరిపోదగునా? వీధులలో అవి నీటి కాలువగా పారదగునా?
సామెతలు 5 : 17 (TEV)
అన్యులు నీతోకూడ వాటి ననుభవింపకుండ అవి నీకే యుండవలెను గదా.
సామెతలు 5 : 18 (TEV)
నీ ఊట దీవెన నొందును. నీ ¸°వనకాలపు భార్యయందు సంతోషింపుము.
సామెతలు 5 : 19 (TEV)
ఆమె అతిప్రియమైన లేడి, అందమైన దుప్పి ఆమె రొమ్ములవలన నీవు ఎల్లప్పుడు తృప్తినొందు చుండుము. ఆమె ప్రేమచేత నిత్యము బద్ధుడవై యుండుము.
సామెతలు 5 : 20 (TEV)
నా కుమారుడా, జార స్త్రీయందు నీవేల బద్ధుడవై యుందువు? పరస్త్రీ రొమ్ము నీవేల కౌగలించుకొందువు?
సామెతలు 5 : 21 (TEV)
నరుని మార్గములను యెహోవా యెరుగును వాని నడతలన్నిటిని ఆయన గుర్తించును.
సామెతలు 5 : 22 (TEV)
దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును వాడు తన పాపపాశములవలన బంధింపబడును.
సామెతలు 5 : 23 (TEV)
శిక్షలేకయే అట్టివాడు నాశనమగును అతిమూర్ఖుడై వాడు త్రోవతప్పి పోవును.
❮
❯