సామెతలు 8 : 1 (TEV)
జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది
సామెతలు 8 : 2 (TEV)
త్రోవప్రక్కను రాజవీధుల మొగలలోను నడిమార్గములలోను అది నిలుచుచున్నది
సామెతలు 8 : 3 (TEV)
గుమ్మములయొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గవునులయొద్దను నిలువబడి అది ఈలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది
సామెతలు 8 : 4 (TEV)
మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను నరులగు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను.
సామెతలు 8 : 5 (TEV)
జ్ఞానములేనివారలారా, జ్ఞానము ఎట్టిదైనది తెలిసి కొనుడి బుద్ధిహీనులారా,బుద్ధియెట్టిదైనది యోచించి చూడుడి.
సామెతలు 8 : 6 (TEV)
నేను శ్రేష్ఠమైన సంగతులను చెప్పెదను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును
సామెతలు 8 : 7 (TEV)
నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము నా పెదవులకు అసహ్యము
సామెతలు 8 : 8 (TEV)
నా నోటి మాటలన్నియు నీతిగలవి వాటిలో మూర్ఖతయైనను కుటిలతయైనను లేదు
సామెతలు 8 : 9 (TEV)
అవియన్నియు వివేకికి తేటగాను తెలివినొందినవారికి యథార్థముగాను ఉన్నవి.
సామెతలు 8 : 10 (TEV)
వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి మేలిమి బంగారు నాశింపక తెలివినొందుడి.
సామెతలు 8 : 11 (TEV)
జ్ఞానము ముత్యములకన్న శ్రేష్ఠమైనది విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు.
సామెతలు 8 : 12 (TEV)
జ్ఞానమను నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసికొనియున్నాను సదుపాయములు తెలిసికొనుట నాచేతనగును.
సామెతలు 8 : 13 (TEV)
యెహోవాయందు భయభక్తులు గలిగియుండుట చెడుతనము నసహ్యించుకొనుటయే. గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు.
సామెతలు 8 : 14 (TEV)
ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నిచ్చుటయు నా వశము జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే.
సామెతలు 8 : 15 (TEV)
నావలన రాజులు ఏలుదురు అధికారులు న్యాయమునుబట్టి పాలనచేయుదురు.
సామెతలు 8 : 16 (TEV)
నావలన అధిపతులును లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరును ప్రభుత్వము చేయుదురు.
సామెతలు 8 : 17 (TEV)
నన్ను ప్రేమించువారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు
సామెతలు 8 : 18 (TEV)
ఐశ్వర్య ఘనతలును స్థిరమైన కలిమియు నీతియు నాయొద్ద నున్నవి.
సామెతలు 8 : 19 (TEV)
మేలిమి బంగారముకంటెను అపరంజికంటెను నావలన కలుగు ఫలము మంచిది ప్రశస్తమైన వెండికంటె నావలన కలుగు వచ్చుబడి దొడ్డది.
సామెతలు 8 : 20 (TEV)
నీతిమార్గమునందును న్యాయమార్గములయందును నేను నడచుచున్నాను.
సామెతలు 8 : 21 (TEV)
నన్ను ప్రేమించువారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును.
సామెతలు 8 : 22 (TEV)
పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్య ములలో ప్రథమమైనదానిగా యెహోవా నన్ను కలుగజేసెను.
సామెతలు 8 : 23 (TEV)
అనాదికాలము మొదలుకొని మొదటినుండి భూమి ఉత్పత్తియైన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని.
సామెతలు 8 : 24 (TEV)
ప్రవాహజలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని.
సామెతలు 8 : 25 (TEV)
పర్వతములు స్థాపింపబడకమునుపు కొండలు పుట్టకమునుపు
సామెతలు 8 : 26 (TEV)
భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు నేల మట్టిని రవంతయు సృష్టింపకమునుపు నేను పుట్టితిని.
సామెతలు 8 : 27 (TEV)
ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచినప్పుడు మహాజలములమీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని.
సామెతలు 8 : 28 (TEV)
ఆయన పైన ఆకాశమును స్థిరపరచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు
సామెతలు 8 : 29 (TEV)
జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరచినప్పుడు భూమియొక్క పునాదులను నిర్ణయించినప్పుడు
సామెతలు 8 : 30 (TEV)
నేను ఆయనయొద్ద ప్రధానశిల్పినై అనుదినము సంతో షించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని.
సామెతలు 8 : 31 (TEV)
ఆయన కలుగజేసిన పరలోకమునుబట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచునుంటిని.
సామెతలు 8 : 32 (TEV)
కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి నా మార్గముల ననుసరించువారు ధన్యులు
సామెతలు 8 : 33 (TEV)
ఉపదేశమును నిరాకరింపక దాని నవలంబించి జ్ఞానులై యుండుడి.
సామెతలు 8 : 34 (TEV)
అనుదినము నా గడపయొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధములయొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు.
సామెతలు 8 : 35 (TEV)
నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యెహోవా కటాక్షము వానికి కలుగును.
సామెతలు 8 : 36 (TEV)
నన్ను కనుగొననివాడు తనకే హాని చేసికొనును నాయందు అసహ్యపడువారందరు మరణమును స్నేహించుదురు.
❮
❯