యిర్మీయా 27 : 1 (TEV)
యూదారాజైన యోషీయా కుమారుడగు యెహోయాకీము ఏల నారంభించినప్పుడు యెహోవా యొద్దనుండి వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.
యిర్మీయా 27 : 2 (TEV)
యెహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చు చున్నాడు నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకొనుము.
యిర్మీయా 27 : 3 (TEV)
వాటిని యెరూషలేమునకు యూదారాజైన సిద్కియాయొద్దకు వచ్చిన దూతలచేత ఎదోము రాజునొద్దకును మోయాబు రాజునొద్దకును అమ్మోనీయుల రాజునొద్దకును తూరు రాజునొద్దకును సీదోను రాజునొద్దకును పంపుము.
యిర్మీయా 27 : 4 (TEV)
మరియు ఆ దూతలు తమ యజమానులకు తెలియజేయవలెనని యీ ఆజ్ఞ వారితో చెప్పుముమీరు మీ యజమానులకు తెలియ జేయవలెనని సైన్యములకధిపతియైన ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చునదేమనగా
యిర్మీయా 27 : 5 (TEV)
అధిక బలముచేతను చాచిన బాహువుచేతను భూమిని భూమిమీదనున్న నరులను జంతువులను నేనే సృజించి, ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే యిచ్చుచున్నాను.
యిర్మీయా 27 : 6 (TEV)
ఇప్పుడైతే దేశములన్నిటిని నా దాసుడగు బబులోను రాజైన నెబు కద్రెజరు వశము చేయుచున్నాను; అతని సేవించుటకై భూజంతువులనుకూడ అతని వశము చేయుచున్నాను.
యిర్మీయా 27 : 7 (TEV)
అతని స్వదేశమునకు కాలము వచ్చువరకు సమస్తజనులు అతనికిని అతని కుమారునికిని అతని కుమారుని కుమారునికిని దాసులైయుందురు, ఆ కాలము రాగా బహుజనముల మహారాజులు అతనిచేత దాస్యము చేయించుకొందురు.
యిర్మీయా 27 : 8 (TEV)
ఏ జనము ఏ రాజ్యము బబులోనురాజైన నెబుకద్రెజరు నకు దాస్యము చేయనొల్లక బబులోనురాజుయొక్క కాడిని తన మెడమీద పెట్టుకొనదో దానిని నేను అతని చేత బొత్తిగా నాశనముచేయించు వరకు ఆ జనమును ఖడ్గముచేతను క్షామము చేతను తెగులుచేతను శిక్షించెదను; ఇదే యెహోవా వాక్కు.
యిర్మీయా 27 : 9 (TEV)
కాబట్టి మీ ప్రవక్తలేమి సోదెగాండ్రేమి కలలు కనువారేమి కాలజ్ఞానులేమి మంత్రజ్ఞులేమి మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో పలుకునపుడు మీరు వారిని లక్ష్య పెట్టకుడి.
యిర్మీయా 27 : 10 (TEV)
మీరు మీ భూమిని అనుభవింపకుండ మిమ్మును దూరముగా తోలివేయునట్లును, మిమ్మును నేను వెళ్లగొట్టునట్లును, మీరు నశించునట్లును వారు అబద్ధ ప్రవచనములు మీకు ప్రకటింతురు.
యిర్మీయా 27 : 11 (TEV)
అయితే ఏ జనులు బబులోనురాజు కాడి క్రిందికి తమ మెడను వంచి అతనికి దాస్యము చేయుదురో ఆ జనులను తమ దేశములో కాపురముండ నిచ్చెదను. వారు తమ భూమిని సేద్య పరచుకొందురు, నేను వారికి నెమ్మది కలుగజేతును; ఇదే యెహోవా వాక్కు.
యిర్మీయా 27 : 12 (TEV)
నేను ఆ మాటలనుబట్టి యూదారాజైన సిద్కియాతో ఇట్లంటినిబబులోనురాజుయొక్క కాడిని మీ మెడ మీద పెట్టుకొని, అతనికిని అతని జనులకును దాసులైన యెడల మీరు బ్రదుకుదురు
యిర్మీయా 27 : 13 (TEV)
బబులోనురాజునకు దాసులుకానొల్లని జనులవిషయమై యెహోవా ఆజ్ఞ ఇచ్చినట్లు ఖడ్గముచేతనైనను క్షామముచేతనైనను తెగులు చేతనైనను నీవును నీ ప్రజలును చావనేల?
యిర్మీయా 27 : 14 (TEV)
కావునమీరు బబులోనురాజునకు దాసులుకాకుందురని మీతో చెప్పు ప్రవక్తలు అబద్దమే ప్రకటించుచున్నారు, నేను వారిని పంపలేదు, వారి మాటల నంగీకరింపవద్దు, ఇదే యెహోవా వాక్కు.
యిర్మీయా 27 : 15 (TEV)
నేను మిమ్మును తోలివేయునట్లును, మీరును మీతో ప్రవచించు మీ ప్రవక్తలును నశించు నట్లును, వారు నా నామమునుబట్టి అబద్ధముగా ప్రవ చించుచున్నారు. మరియు యాజకులతోను ఈ ప్రజ లందరితోను నేను ఈ మాటలు చెప్పితిని
యిర్మీయా 27 : 16 (TEV)
యెహోవా సెలవిచ్చునదేమనగాయెహోవా మందిరపు ఉపకరణ ములు ఇప్పుడే శీఘ్రముగా బబులోనునుండి మరల తేబడునని ప్రవచింపు మీ ప్రవక్తలు మీతో అబద్ధములు చెప్పుచున్నారు, వారి మాటలకు చెవియొగ్గకుడి.
యిర్మీయా 27 : 17 (TEV)
వారి మాట వినకుడి; బబులోను రాజునకు దాసులైనయెడల మీరు బ్రదుకుదురు; ఈ పట్టణము పాడైపోనేల?
యిర్మీయా 27 : 18 (TEV)
వారు ప్రవక్తలైనయెడల, యెహోవా వాక్కు వారికి తోడైయుండినయెడల, యెహోవా మందిరములోను యూదారాజు మందిరములోను యెరూషలేములోను శేషించియుండు ఉపకరణములు బబులోనునకు కొనిపో బడకుండునట్లు వారు సైన్యములకధిపతియగు యెహోవాను బతిమాలుకొనుట మేలు.
యిర్మీయా 27 : 19 (TEV)
బబులోను రాజైన నెబుకద్రె జరు యెరూషలేములోనుండి యెహోయాకీము కుమారు డైన యెకోన్యాను యూదా యెరూషలేముల ప్రధానుల నందరిని బబులోనునకు చెరగా తీసికొనిపోయినప్పుడు
యిర్మీయా 27 : 20 (TEV)
అతడు విడిచిపెట్టిన స్తంభములనుగూర్చియు సముద్రమును గూర్చియు గడమంచెలనుగూర్చియు ఈ పట్టణములో మిగిలిన ఉపకరణములనుగూర్చియు సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.
యిర్మీయా 27 : 21 (TEV)
యెహోవా మందిరములోను యూదారాజు నగరులోను యెరూష లేములోను శేషించిన ఉపకరణములనుగూర్చి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునైన యెహోవా ఈలాగు ననే సెలవిచ్చుచున్నాడు
యిర్మీయా 27 : 22 (TEV)
అవి బబులోనునకు తేబడును, నేను ఆ ఉపకరణములను దర్శించి తెప్పించి యీ స్థలములో వాటిని మరల నుంచు కాలము వరకు అవి అక్కడ నుండవలెను; ఇదే యెహోవా వాక్కు.
❮
❯