యిర్మీయా 43 : 1 (TEV)
అతడు ప్రజలకందరికి ప్రకటింపవలెనని దేవుడైన... యెహోవా పంపిన ప్రకారము యిర్మీయా వారి దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాటలన్నిటిని వారికి ప్రకటించి చాలింపగా
యిర్మీయా 43 : 2 (TEV)
హోషేయా కుమారుడైన అజర్యాయును కారేహ కుమారుడైన యోహానానును గర్విష్ఠులందరును యిర్మీయాతో ఇట్లనిరినీవు అబద్ధము పలుకుచున్నావుఐగుప్తులో కాపురముండుటకు మీరు అక్కడికి వెళ్లకూడ దని ప్రకటించుటకై మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు.
యిర్మీయా 43 : 3 (TEV)
మమ్మును చంపుటకును, బబులోనునకు చెర పట్టుకొని పోవుటకును, కల్దీయులచేతికి మమ్మును అప్పగింప వలెనని నేరీయా కుమారుడైన బారూకు మాకు విరోధముగా రేపుచున్నాడు. (అని చెప్పిరి)
యిర్మీయా 43 : 4 (TEV)
కాగా కారేహ కుమారుడైన యోహానానును సేనలయధిపతులందరును ప్రజ లందురును యూదాదేశములో కాపురముండవలెనన్న యెహోవా మాట వినకపోయిరి.
యిర్మీయా 43 : 5 (TEV)
మరియు కారేహ కుమారుడైన యోహానానును సేనల యధిపతులందరును యెహోవా మాట విననివారై, యూదాదేశములో నివ సించుటకు తాము తరిమి వేయబడిన ఆయా ప్రదేశములనుండి తిరిగి వచ్చిన యూదుల శేషమును,
యిర్మీయా 43 : 6 (TEV)
అనగా రాజ దేహసంరక్షకులకధిపతియగు నెబూజరదాను షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాకు అప్ప గించిన పురుషులను స్త్రీలను పిల్లలను రాజకుమార్తెలను ప్రవక్తయగు యిర్మీయాను నేరీయా కుమారుడగు బారూకును తోడుకొనిపోయి
యిర్మీయా 43 : 7 (TEV)
ఐగుప్తుదేశములో ప్రవేశించిరి. వారు తహపనేసుకు రాగా
యిర్మీయా 43 : 8 (TEV)
యెహోవా వాక్కు తహపనేసులో యిర్మీయాకు ప్రత్యక్షమై యిలాగు సెల విచ్చెను
యిర్మీయా 43 : 9 (TEV)
నీవు పెద్ద రాళ్లను చేత పట్టుకొని, యూదా మనుష్యులు చూచుచుండగా తహపనేసులో నున్న ఫరో నగరు ద్వారముననున్న శిలావరణములోని సున్నములో వాటిని పాతిపెట్టి జనులకీమాట ప్రకటింపుము
యిర్మీయా 43 : 10 (TEV)
ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా సెలవిచ్చునదేమనగాఇదిగో నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్రెజరును నేను పిలువనంపించి తీసికొనివచ్చి, నేను పాతిపెట్టిన యీ రాళ్లమీద అతని సింహాసనము ఉంచెదను, అతడు రత్నకంబళిని వాటిమీదనే వేయిం చును.
యిర్మీయా 43 : 11 (TEV)
అతడువచ్చి తెగులునకు నిర్ణయమైన వారిని తెగు లునకును, చెరకు నిర్ణయమైనవారిని చెరకును, ఖడ్గమునకు నిర్ణయమైనవారిని ఖడ్గమునకును అప్పగించుచు ఐగుప్తీ యులను హతముచేయును.
యిర్మీయా 43 : 12 (TEV)
ఐగుప్తు దేవతల గుళ్లలో నేను అగ్ని రాజ బెట్టుచున్నాను, వాటిని నెబుకద్రెజరు కాల్చి వేయును, ఆ దేవతలను చెరగొనిపోవును, గొఱ్ఱలకాపరి తన వస్త్రమును చుట్టుకొనునట్లు అతడు ఐగుప్తుదేశమును తనకు చుట్టుకొని నిరాటంకముగా అక్కడనుండి సాగి పోవును.
యిర్మీయా 43 : 13 (TEV)
అతడు ఐగుప్తులోనున్న సూర్యదేవతాపట్టణము లోని సూర్యప్రతిమలను విరుగగొట్టి ఐగుప్తు దేవతల గుళ్లను అగ్నిచేత కాల్చివేయును.
❮
❯