యెహెజ్కేలు 18 : 1 (TEV)
మరల యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
యెహెజ్కేలు 18 : 2 (TEV)
తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్లు పులిసెనని మీరు చెప్పుచు వచ్చెదరే; ఇశ్రాయేలీయుల దేశమునుగూర్చి ఈ సామెత మీ రెందుకు పలికెదరు?
యెహెజ్కేలు 18 : 3 (TEV)
నా జీవముతోడు ఈ సామెత ఇశ్రాయేలీయులలో మీరిక పలుకరు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
యెహెజ్కేలు 18 : 4 (TEV)
మనుష్యులందరు నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరును నా వశ ములో ఉన్నారు; పాపముచేయువాడెవడో వాడే మరణము నొందును.
యెహెజ్కేలు 18 : 5 (TEV)
ఒకడు నీతిపరుడై నీతిన్యాయములను అనుసరించువాడైయుండి
యెహెజ్కేలు 18 : 6 (TEV)
పర్వతములమీద భోజనము చేయకయు, ఇశ్రాయేలీయులు పెట్టుకొనిన విగ్రహముల తట్టు చూడకయు, తన పొరుగువాని భార్యను చెరపకయు, బహిష్టయైనదానిని కూడకయు,
యెహెజ్కేలు 18 : 7 (TEV)
ఎవనినైనను భాదపెట్ట కయు, ఋణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలా త్కారముచేత ఎవనికైనను నష్టము కలుగజేయకయునుండు వాడై, ఆకలిగల వానికి ఆహారమిచ్చి దిగంబరికి బట్టయిచ్చి
యెహెజ్కేలు 18 : 8 (TEV)
వడ్డికి అప్పియ్యకయు, లాభము చేపట్టకయు, అన్యాయము చేయకయు, నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి
యెహెజ్కేలు 18 : 9 (TEV)
యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధుల నను సరించుచుండినయెడల వాడే నిర్దోషియగును, నిజ ముగా వాడు బ్రదుకును; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
యెహెజ్కేలు 18 : 10 (TEV)
అయితే ఆ నీతిపరునికి కుమారుడు పుట్టగా వాడు బలాత్కారము చేయువాడై ప్రాణహానికరుడై, చేయరాని క్రియలలో దేనినైనను చేసి
యెహెజ్కేలు 18 : 11 (TEV)
చేయవలసిన మంచి క్రియలలో దేనినైనను చేయకయుండినయెడల, అనగా పర్వతములమీద భోజనము చేయుటయు, తన పొరుగువాని భార్యను చెరుపుటయు,
యెహెజ్కేలు 18 : 12 (TEV)
దీనులను దరిద్రు లను భాదపెట్టి బలాత్కారముచేత నష్టము కలుగ జేయు టయు, తాకట్టు చెల్లింపకపోవుటయు, విగ్రహముల తట్టు చూచి హేయకృత్యములు జరిగించుటయు,
యెహెజ్కేలు 18 : 13 (TEV)
అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణ మునకు తానే ఉత్తరవాది యగును.
యెహెజ్కేలు 18 : 14 (TEV)
అయితే అతనికి కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రిచేసిన పాపములన్నిటిని చూచి, ఆలోచించుకొని అట్టి క్రియలు చేయకయుండినయెడల, అనగా
యెహెజ్కేలు 18 : 15 (TEV)
పర్వతములమీద భోజ నము చేయకయు, ఇశ్రాయేలీయులు పెట్టుకొనిన విగ్రహ ములతట్టు చూడకయు, తన పొరుగువాని భార్యను చెరప కయు,
యెహెజ్కేలు 18 : 16 (TEV)
ఎవనినైనను బాధపెట్టకయు, తాకట్టు ఉంచు కొనకయు, బలాత్కారముచేత నష్టపరచకయు, ఆకలి గలవానికి ఆహారమిచ్చి దిగంబరికి బట్టయిచ్చి
యెహెజ్కేలు 18 : 17 (TEV)
బీదవాని మీద అన్యాయముగా చెయ్యి వేయక లాభముకొరకు అప్పియ్యకయు, వడ్డి పుచ్చుకొనకయు నుండినవాడై, నా విధుల నాచరించుచు నా కట్టడల ననుసరించుచు నుండిన యెడల అతడు తన తండ్రిచేసిన దోషమునుబట్టి చావడు, అతడు అవశ్యముగా బ్రదుకును.
యెహెజ్కేలు 18 : 18 (TEV)
అతని తండ్రి క్రూరుడై పరులను బాధపెట్టి బలాత్కారముచేత తన సహోదరులను నష్టపరచి తన జనులలో తగని క్రియలు చేసెను గనుక అతడే తన దోషమునుబట్టి మరణము నొందును.
యెహెజ్కేలు 18 : 19 (TEV)
అయితే మీరుకుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఏల మోయుటలేదని చెప్పుకొను చున్నారు. కుమారుడు నీతిన్యాయముల ననుసరించి నా కట్టడలన్నిటిని అనుసరించి గైకొనెను గనుక అతడు అవ శ్యముగా బ్రదుకును.
యెహెజ్కేలు 18 : 20 (TEV)
పాపము చేయువాడే మరణము నొందును; తండ్రియొక్క దోష శిక్షను కుమారుడు మోయుటలేదని కుమారుని దోష శిక్షను తండ్రిమోయడు, నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును.
యెహెజ్కేలు 18 : 21 (TEV)
అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి, నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించినయెడల అతడు మర ణము నొందడు, అవశ్యముగా అతడు బ్రదుకును.
యెహెజ్కేలు 18 : 22 (TEV)
అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకములోనికి రాదు, అతని నీతినిబట్టి అతడు బ్రదుకును.
యెహెజ్కేలు 18 : 23 (TEV)
దుష్టులు మరణము నొందుటచేత నా కేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రదుకుటయే నాకు సంతోషము; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
యెహెజ్కేలు 18 : 24 (TEV)
అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి, దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరి గించినయెడల అతడు బ్రదుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకములోనికి రావు, అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమునుబట్టి మరణము నొందును.
యెహెజ్కేలు 18 : 25 (TEV)
అయితేయెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మాట ఆలకించుడి, నా మార్గము న్యాయమే మీ మార్గమే గదా అన్యాయమైనది?
యెహెజ్కేలు 18 : 26 (TEV)
నీతి పరుడు తన నీతిని విడిచి పాపము చేసినయెడల అతడు దానినిబట్టి మరణము నొందును; తాను పాపము చేయుటనుబట్టియేగదా అతడు మరణమునొందును?
యెహెజ్కేలు 18 : 27 (TEV)
మరియు దుష్టుడు తాను చేయుచు వచ్చిన దుష్టత్వమునుండి మరలి నీతి న్యాయములను జరి గించిన యెడల తన ప్రాణము రక్షించుకొనును.
యెహెజ్కేలు 18 : 28 (TEV)
అతడు ఆలోచించుకొని తాను చేయుచువచ్చిన అతిక్రమక్రియ లన్నిటిని చేయక మానెను గనుక అతడు మరణమునొందక అవశ్యముగా బ్రదుకును.
యెహెజ్కేలు 18 : 29 (TEV)
అయితే ఇశ్రాయేలీయులుయెహోవా మార్గము న్యాయముకాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మార్గము న్యాయమేగాని మీ మార్గము న్యాయము కాదు.
యెహెజ్కేలు 18 : 30 (TEV)
కాబట్టి ఇశ్రాయేలీయు లారా, యెవని ప్రవర్తననుబట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షాకారణ ములు కాకుండునట్లు వాటినన్నిటిని విడిచిపెట్టుడి.
యెహెజ్కేలు 18 : 31 (TEV)
మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్దియు తెచ్చుకొనుడి. ఇశ్రా యేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
యెహెజ్కేలు 18 : 32 (TEV)
మరణమునొందువాడు మరణము నొందుటనుబట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సుత్రిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రదుకుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32

BG:

Opacity:

Color:


Size:


Font: