యెహెజ్కేలు 41 : 1 (TEV)
తరువాత అతడు నన్ను ఆలయమునకు తోడుకొని వచ్చి దాని స్తంభములను కొలిచెను. ఇరుప్రక్కల అవి ఆరు మూరలాయెను, ఇది గుడారపు వెడల్పు.
యెహెజ్కేలు 41 : 2 (TEV)
వాకిలి వెడల్పు పది మూరలు, తలుపు ఇరుప్రక్కల అయిదేసి మూరలు, దాని నిడివిని కొలువగా నలుబది మూరలు, దాని వెడల్పు ఇరువది మూరలు.
యెహెజ్కేలు 41 : 3 (TEV)
అతడు లోపలికి పోయి వాకిలి స్తంభమును కొలువగా రెండు మూరలాయెను, వాకిలి ఆరుమూరలు;వెడల్పు ఏడు మూరలు.
యెహెజ్కేలు 41 : 4 (TEV)
ఇది అతి పరిశుద్ధస్థలమని చెప్పి దాని నిడివిని కొలువగా ఇరువది మూరలును ఆలయమునకును దానికిని మధ్య వెడల్పు ఇరువది మూరలు నాయెను.
యెహెజ్కేలు 41 : 5 (TEV)
తరువాత అతడు మందిరపు గోడను కొలువగా ఆరు మూరలాయెను, మందిరపు ప్రక్కలనున్న మేడ గదులను కొలువగా నాలుగేసి మూరలాయెను.
యెహెజ్కేలు 41 : 6 (TEV)
ఈ మేడగదులు మూడేసి అంతస్థులు గలవి. ఈలాగున ముప్పది గదులుండెను, ఇవి మేడ గదులచోటున మందిరమునకు చుట్టు కట్టబడిన గోడతో కలిసియుండెను; ఇవి మందిరపుగోడను ఆనుకొనియున్న ట్టుండి ఆనుకొనక యుండెను.
యెహెజ్కేలు 41 : 7 (TEV)
ఆ గోడ మేడగదులకు ఎక్కిన కొలది అవి మరి వెడల్పుగా పెరిగెను, పైకెక్కిన కొలది మందిరముచుట్టునున్న యీ మేడగదుల అంతస్థులు మరి వెడల్పగుచుండెను గనుక మందిరపు పైభాగము మరి వెడల్పుగా ఉండెను; పైకెక్కిన కొలది అంతస్థులు మరి వెడల్పుగా ఉండెను.
యెహెజ్కేలు 41 : 8 (TEV)
మరియు నేను చూడగా మంది రము చుట్టునున్న నేలకట్టు ఎత్తుగా కనబడెను, ఏల యనగా ఆ మేడగదులకు ఆరు పెద్దమూరలుగల పునాది యుండెను.
యెహెజ్కేలు 41 : 9 (TEV)
మేడగదులకు బయటనున్న గోడ అయిదు మూరల వెడల్పు; మరియు మందిరపు మేడగదుల ప్రక్కల నున్న స్థలము ఖాలీగా విడువబడి యుండెను
యెహెజ్కేలు 41 : 10 (TEV)
గదులమధ్య మందరిముచుట్టు నలుదిశల ఇరువది మూరల వెడల్పున చోటు విడువబడి యుండెను
యెహెజ్కేలు 41 : 11 (TEV)
మేడగదుల వాకిండ్లు ఖాలీగానున్న స్థలముతట్టు ఉండెను; ఒక వాకిలి ఉత్తరపు తట్టునను ఇంకొక వాకిలి దక్షిణపుతట్టునను ఉండెను. ఖాలీగా నున్న స్థలముచుట్టు అయిదు మూరల వెడల్పుం డెను.
యెహెజ్కేలు 41 : 12 (TEV)
ప్రత్యేకింపబడిన చోటుకెదురుగానున్న కట్ట డము పడమటితట్టు డెబ్బది మూరల వెడల్పు, దాని గోడ అయిదు మూరల వెడల్పు; గోడ నిడివి తొంబది మూరలు.
యెహెజ్కేలు 41 : 13 (TEV)
మందిరముయొక్క నిడివిని అతడు కొలు వగా నూరు మూరలాయెను, ప్రత్యేకింపబడిన స్థల మును దాని కెదురుగానున్న కట్టడమును దానిగోడ లను కొలువగా నూరు మూరలాయెను.
యెహెజ్కేలు 41 : 14 (TEV)
మరియు తూర్పుతట్టు మందిరపు నిడివిని ప్రత్యేకింపబడిన స్థలమును కొలువగా నూరు మూరలాయెను.
యెహెజ్కేలు 41 : 15 (TEV)
ఈలాగున మందిరపు వెనుకటి భాగమున ప్రత్యేకింపబడిన స్థలమున కెదురుగా నున్న కట్టడమును దాని ఇరుప్రక్కలనున్న వసారాలను కొలువగా నూరు మూరలాయెను.
యెహెజ్కేలు 41 : 16 (TEV)
మరియు గర్భాలయ మును ఆవరణపు మంటపములను గడపలను కమ్ములుగల కిటికీలను ఎదుటి మూడు అంతస్థుల చుట్టునున్న వసారాలను ఆయన కొలిచెను. కిటికీలు మరుగుచేయబడెను, గడపలకెదురుగా నేలనుండి కిటికీలవరకు బల్ల కూర్పుండెను
యెహెజ్కేలు 41 : 17 (TEV)
వాకిండ్లకు పైగా మందిరమునకు బయటను లోప లను ఉన్న గోడ అంతయు లోగోడయు వెలిగోడయు చుట్టుగోడయు కొలతప్రకారము కట్టబడియుండెను.
యెహెజ్కేలు 41 : 18 (TEV)
కెరూబులును ఖర్జూరపు చెట్లును ఉండెను; దానికి రెండేసి కెరూబుల సందున ఖర్జూరపుచెట్టు ఒకటియుండెను; ఒక్కొక్క కెరూబునకు రెండేసి ముఖము లుండెను.
యెహెజ్కేలు 41 : 19 (TEV)
ఎట్లనగా ఈ తట్టు ఖర్జూరపు చెట్టువైపున మనుష్యముఖ మును ఆ తట్టు ఖర్జూరపుచెట్టువైపున సింహముఖమును కనబడెను; ఈ ప్రకారము మందిరమంతటిచుట్టు నుండెను.
యెహెజ్కేలు 41 : 20 (TEV)
నేల మొదలుకొని వాకిలిపైవరకు మందిరపు గోడకు కెరూబులును ఖర్జూరపు చెట్లును ఉండెను.
యెహెజ్కేలు 41 : 21 (TEV)
మందిరపు ద్వార బంధములు చచ్చౌకములు, పరిశుద్ధస్థలపు ద్వారబంధ ములును అట్టివే.
యెహెజ్కేలు 41 : 22 (TEV)
బలిపీఠము కఱ్ఱతో చేయబడెను, దాని యెత్తు మూడు మూరలు, నిడివి రెండు మూరలు, దాని పీఠమును మూలలును ప్రక్కలును మ్రానితో చేయబడి నవి; ఇది యెహోవా సముఖమందుండు బల్ల అని అతడు నాతో చెప్పెను.
యెహెజ్కేలు 41 : 23 (TEV)
మందిరమునకును పరిశుద్ధ స్థలమునకును రెండు వాకిండ్లుండెను.
యెహెజ్కేలు 41 : 24 (TEV)
ఒక్కొక వాకిలి రెండేసి మడత రెక్కలు గలది.
యెహెజ్కేలు 41 : 25 (TEV)
మరియు గోడలమీద ఉన్నట్లుగా మందిరపు వాకిండ్లమీదను కెరూబులును ఖర్జూరపుచెట్లును చెక్కబడి యుండెను, బయటి మంటపమునకు విచిత్రముగా చేసిన ఉబుకువాటుపని కనబడెను.
యెహెజ్కేలు 41 : 26 (TEV)
మరియు మంటపమునకును ఇరుప్రక్కల గోడలకును మందిరపు మేడగదులకును ఒరపాకులకును ఇరుప్రక్కల కమ్ములు వేసిన కిటికీలును ఖర్జూరపు చెట్లనుపోలిన అలంకారమును ఉండెను.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26