దానియేలు 7 : 1 (TEV)
బబులోను రాజగు బెల్షస్సరుయొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనములు కలిగెను; అతడు తన పడకమీద పరుండి యొక కలకని ఆ కల సంగతిని సంక్షేపముగా వివరించి వ్రాసెను.
దానియేలు 7 : 2 (TEV)
దానియేలు వివరించి చెప్పినదేమనగారాత్రియందు దర్శనములు కలిగి నప్పుడు నేను తేరిచూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రముమీద గాలి విసరుట నాకు కనబడెను.
దానియేలు 7 : 3 (TEV)
అప్పుడు నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు మహా సముద్రములోనుండి పై కెక్కెను. ఆ జంతువులు ఒక దానికొకటి భిన్నములై యుండెను.
దానియేలు 7 : 4 (TEV)
మొదటిది సింహ మును పోలినది గాని దానికి పక్షిరాజు రెక్కలవంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుష్యునివలె అది పాదములు పెట్టు కొని నేలపైన నిలువబడెను. మరియు మానవమనస్సు వంటి మనస్సు దానికియ్యబడెను.
దానియేలు 7 : 5 (TEV)
రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది, అది యొక పార్శ్వముమీద పండుకొని తన నోట పండ్లమధ్య మూడు ప్రక్కటెము కలను పట్టుకొనినది. కొందరులెమ్ము, విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి.
దానియేలు 7 : 6 (TEV)
అటు పిమ్మట చిరుతపులినిపోలిన మరియొక జంతువును చూచితిని. దాని వీపున పక్షిరెక్కలవంటి నాలుగు రెక్కలుండెను; దానికి నాలుగు తలలుండెను; దానికి ఆధిపత్య మియ్య బడెను.
దానియేలు 7 : 7 (TEV)
పిమ్మట రాత్రియందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా, ఘోరమును భయం కరమునగు నాలుగవ జంతువొకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన యితర జంతువులకు భిన్నమైనది; అది మహాబల మహాత్త్యములు గలది; దానికి పెద్ద ఇనుప దంతములును పది కొమ్ములు నుండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునియలుగా చేయుచు మిగిలినదానిని కాళ్లక్రింద అణగద్రొక్కుచుండెను.
దానియేలు 7 : 8 (TEV)
నేను ఈ కొమ్ము లను కనిపెట్టగా ఒక చిన్న కొమ్మువాటిమధ్యను లేచెను; దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో మూడు పెరికి వేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నులవంటి కన్నులును గర్వముగా మాటలాడు నోరును ఉండెను.
దానియేలు 7 : 9 (TEV)
ఇంక సింహాసనములను వేయుట చూచితిని; మహా వృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తలవెండ్రుకలు శుద్ధమైన గొఱ్ఱబొచ్చువలె తెల్లగాను ఉండెను. ఆయన సింహా సనము అగ్నిజ్వాలలవలె మండుచుండెను; దాని చక్ర ములు అగ్నివలె ఉండెను.
దానియేలు 7 : 10 (TEV)
అగ్నివంటి ప్రవాహము ఆయనయొద్దనుండి ప్రవహించుచుండెను. వేవేలకొలది ఆయనకు పరిచారకులుండిరి; కోట్లకొలది మనుష్యులు ఆయనయెదుట నిలిచిరి, తీర్పుతీర్చుటకై గ్రంథములు తెరువబడెను.
దానియేలు 7 : 11 (TEV)
అప్పుడు నేను చూచుచుండగా, ఆ కొమ్ము పలుకుచున్న మహా గర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనబడెను; తరువాత దాని కళేబరము మండుచున్న అగ్నిలో వేయబడెను.
దానియేలు 7 : 12 (TEV)
మిగిలిన ఆ జంతు వుల ప్రభుత్వము తొలగిపోయెను; సమయము వచ్చువరకు అవి సజీవులమధ్యను ఉండవలెనని యొక సమయము ఒక కాలము వాటికి ఏర్పాటాయెను.
దానియేలు 7 : 13 (TEV)
రాత్రి కలిగిన దర్శన ములను నేనింక చూచుచుండగా, ఆకాశమేఘారూఢుడై మనుష్యకుమారునిపోలిన యొకడు వచ్చి, ఆ మహావృద్ధు డగువాని సన్నిధిని ప్రవేశించి, ఆయన సముఖమునకు తేబడెను.
దానియేలు 7 : 14 (TEV)
సకల జనులును రాష్ట్రములును ఆ యా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయ బడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికిని తొలగిపోదు; ఆయన రాజ్యము ఎప్పుడును లయముకాదు.
దానియేలు 7 : 15 (TEV)
నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరచుచున్నం దున దానియేలను నేను నా దేహములో మనోదుఃఖము గలవాడనైతిని.
దానియేలు 7 : 16 (TEV)
నేను దగ్గర నిలిచియున్న వారిలో ఒకని యొద్దకుపోయిఇందునుగూర్చిన నిజమంతయు నాకు చెప్పుమని అడుగగా, అతడు నాతో మాటలాడి ఆ సంగతుల భావమును నాకు తెలియజేసెను.
దానియేలు 7 : 17 (TEV)
ఎట్లనగా ఈ మహా జంతువులు నాలుగైయుండి లోకమందు ప్రభుత్వము చేయబోవు నలుగురు రాజులను సూచించుచున్నవి.
దానియేలు 7 : 18 (TEV)
అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు; వారు యుగయుగములు యుగయుగాంత ములవరకు రాజ్యమేలుదురు.
దానియేలు 7 : 19 (TEV)
ఇనుపదంతములును ఇత్తిడి గోళ్లును గల ఆ నాలుగవ జంతువు సంగతి ఏమైనదని నేను తెలిసికొనగోరితిని; అది యెన్నటికి భిన్నమును మిగుల భయంకరమునై, సమస్తమును పగులగొట్టుచు మింగుచు మిగిలిన దానిని కాళ్లక్రింద అణగద్రొక్కుచుండెను.
దానియేలు 7 : 20 (TEV)
మరియు దాని తలపైనున్న పది కొమ్ముల సంగతియు,వాటి మధ్యనుండి పెరిగి మూడు కొమ్ములను కొట్టివేసి, కన్ను లును గర్వముగా మాటలాడు నోరునుగల ఆ వేరగు కొమ్ము సంగతియు, అనగా దాని కడమ కొమ్ములకంటె బలము కలిగిన ఆ కొమ్ము సంగతియు విచారించితిని.
దానియేలు 7 : 21 (TEV)
ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలుచున దాయెను.
దానియేలు 7 : 22 (TEV)
ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరి శుద్ధుల విషయములో తీర్పు తీర్చువరకు ఆలాగు జరుగును గాని సమయము వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము నేలుదురను సంగతి నేను గ్రహించితిని.
దానియేలు 7 : 23 (TEV)
నేనడగిన దానికి ఆ పరిచారకుడు ఈలాగున చెప్పెనుఆ నాలుగవ జంతువు లోకములో తక్కిన ఆ మూడు రాజ్యములకు భిన్నమగు నాలుగవ రాజ్యమును సూచించుచున్నది. అది సమస్తమును అణగద్రొక్కుచు పగులగొట్టుచు లోక మంతయు భక్షించును.
దానియేలు 7 : 24 (TEV)
ఆ పది కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు పదిమంది రాజులను సూచించుచున్నవి; కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరియొక రాజుపుట్టి ఆ ముగ్గురు రాజులను పడద్రోయును.
దానియేలు 7 : 25 (TEV)
ఆ రాజుమహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహో న్నతుని భక్తులను నలుగగొట్టును; అతడు పండుగ కాల ములను న్యాయ పద్ధతులను నివారణచేయ బూనుకొనును; వారు ఒక కాలము కాలములు అర్థకాలము అతని వశమున నుంచబడుదురు.
దానియేలు 7 : 26 (TEV)
అతని యధికారము నశింపజేయుటకును నిర్మూలముచేయుటకునుతీర్పు విధింపబడెను గనుక అది కొట్టి వేయబడును.
దానియేలు 7 : 27 (TEV)
ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్మ్యమును మహోన్నతుని పరి శుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును, అధికారులందరును దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయెను అని చెప్పెను.
దానియేలు 7 : 28 (TEV)
దాని యేలను నేను విని మనస్సునందు అధికమైన కలతగలవాడ నైతిని; అందుచేత నా ముఖము వికారమాయెను; అయితే ఆ సంగతి నా మనస్సులో నుంచుకొంటిని.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28

BG:

Opacity:

Color:


Size:


Font: