లేవీయకాండము 7 : 1 (TEV)
అపరాధపరిహారార్థబలి అతిపరిశుద్ధము. దాని గూర్చిన విధి యేదనగా
లేవీయకాండము 7 : 2 (TEV)
దహనబలి పశువులను వధించుచోట అప రాధపరిహారార్థబలిరూపమైన పశువులను వధింపవలెను. బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను.
లేవీయకాండము 7 : 3 (TEV)
దానిలోనుండి దాని క్రొవ్వంతటిని, అనగా దాని క్రొవ్విన తోకను దాని ఆంత్రములలోని క్రొవ్వును
లేవీయకాండము 7 : 4 (TEV)
రెండు మూత్ర గ్రంథులను డొక్కలపైనున్న క్రొవ్వును మూత్ర గ్రంథులమీది క్రొవ్వును కాలేజముమీది వపను తీసి దాని నంతయు అర్పింపవలెను.
లేవీయకాండము 7 : 5 (TEV)
యాజకుడు యెహోవాకు హోమముగా బలిపీఠముమీద వాటిని దహింపవలెను; అది అపరాధపరిహారార్థబలి; యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను;
లేవీయకాండము 7 : 6 (TEV)
అది అతిపరిశుద్ధము, పరిశుద్ధస్థలములో దానిని తినవలెను.
లేవీయకాండము 7 : 7 (TEV)
పాపపరిహారార్థబలిని గూర్చిగాని అపరాధపరిహారార్థబలిని గూర్చిగాని విధి యొక్కటే. ఆ బలిద్రవ్యము దానివలన ప్రాయశ్చిత్తము చేయు యాజకుని దగును.
లేవీయకాండము 7 : 8 (TEV)
ఒకడు తెచ్చిన దహనబలిని ఏ యాజకుడు అర్పించునో ఆ యాజకుడు అర్పించిన దహనబలిపశువు చర్మము అతనిది; అది అతనిదగును.
లేవీయకాండము 7 : 9 (TEV)
పొయ్యిమీద వండిన ప్రతి నైవేద్యమును, కుండలోనేగాని పెనముమీదనేగాని కాల్చినది యావత్తును, దానిని అర్పించిన యాజకునిది, అది అతనిదగును.
లేవీయకాండము 7 : 10 (TEV)
అది నూనె కలిసినదేగాని పొడిదేగాని మీ నైవేద్యములన్నిటిని అహరోను సంతతివారు సమముగా పంచుకొనవలెను.
లేవీయకాండము 7 : 11 (TEV)
ఒకడు యెహోవాకు అర్పింపవలసిన సమాధానబలిని గూర్చిన విధి యేదనగా
లేవీయకాండము 7 : 12 (TEV)
వాడు కృతజ్ఞతార్పణముగా దాని నర్పించునప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలి గాక నూనెతో కలిసినవియు పొంగనివియునైన పిండి వంటలను, నూనె పూసినవియు పొంగనివియునైన పలచని అప్పడములను, నూనె కలిపి కాల్చిన గోధుమపిండి వంట లను అర్పింపవలెను.
లేవీయకాండము 7 : 13 (TEV)
ఆ పిండివంటలేకాక సమాధానబలి రూపమైన కృతజ్ఞతాబలి ద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలెను.
లేవీయకాండము 7 : 14 (TEV)
మరియు ఆ అర్పణములలో ప్రతి దానిలోనుండి ఒకదాని యెహోవాకు ప్రతిష్ఠార్పణ ముగా అర్పింపవలెను. అది సమాధానబలిపశురక్తమును ప్రోక్షించిన యాజకునిది, అది అతనిదగును.
లేవీయకాండము 7 : 15 (TEV)
సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞతాబలి పశువును అర్పించు దినమే దాని మాంసమును తినవలెను; దానిలోనిది ఏదియు మరునాటికి ఉంచుకొనకూడదు.
లేవీయకాండము 7 : 16 (TEV)
అతడు అర్పించుబలి మ్రొక్కుబడియేగాని స్వేచ్ఛార్పణయేగాని అయినయెడల అతడు దాని నర్పించు నాడే తినవలెను.
లేవీయకాండము 7 : 17 (TEV)
మిగిలినది మరు నాడు తినవచ్చును; మూడవనాడు ఆ బలిపశువు మాంస ములో మిగిలినదానిని అగ్నితో కాల్చి వేయవలెను.
లేవీయకాండము 7 : 18 (TEV)
ఒకడు తన సమాధానబలి పశువుమాంసములో కొంచె మైనను మూడవనాడు తినినయెడల అది అంగీకరింపబడదు; అది అర్పించినవానికి సమాధానబలిగా ఎంచబడదు; అది హేయము; దాని తినువాడు తన దోషశిక్షను భరిం చును.
లేవీయకాండము 7 : 19 (TEV)
అపవిత్రమైన దేనికైనను తగిలిన మాంసమును తిన కూడదు; అగ్నితో దానిని కాల్చివేయవలెను; మాంసము విషయమైతే పవిత్రులందరు మాంసమును తినవచ్చును గాని
లేవీయకాండము 7 : 20 (TEV)
ఒకడు తనకు అపవిత్రత కలిగియుండగా యెహో వాకు అర్పించు సమాధానబలి పశువుమాంసములో కొంచె మైనను తినినయెడల వాడు ప్రజలలోనుండి కొట్టివేయ బడును.
లేవీయకాండము 7 : 21 (TEV)
ఎవడు మనుష్యుల అపవిత్రతనేగాని అపవిత్ర మైన జంతువునేగాని యే అపవిత్రమైన వస్తువునేగాని తాకి యెహోవాకు అర్పించు సమాధానబలిపశువు మాంస మును తినునో వాడు ప్రజలలోనుండి కొట్టివేయబడును.
లేవీయకాండము 7 : 22 (TEV)
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను
లేవీయకాండము 7 : 23 (TEV)
నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుముఎద్దుదేగాని గొఱ్ఱదేగాని మేకదేగాని దేని క్రొవ్వును మీరు తిన కూడదు.
లేవీయకాండము 7 : 24 (TEV)
చచ్చినదాని క్రొవ్వును చీల్చిన దాని క్రొవ్వును ఏ పనికైనను వినియోగపరచవచ్చును గాని దాని నేమాత్ర మును తినకూడదు.
లేవీయకాండము 7 : 25 (TEV)
ఏలయనగా మనుష్యులు యెహో వాకు హోమముగా అర్పించు జంతువులలో దేని క్రొవ్వు నైనను తినినవాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును.
లేవీయకాండము 7 : 26 (TEV)
మరియు పక్షిదేగాని జంతువుదేగాని యే రక్తమును మీ నివాసములన్నిటిలో తినకూడదు.
లేవీయకాండము 7 : 27 (TEV)
ఎవడు రక్తము తినునో వాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును.
లేవీయకాండము 7 : 28 (TEV)
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను
లేవీయకాండము 7 : 29 (TEV)
నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుముఎవడు యెహో వాకు సమాధానబలి ద్రవ్యములను తెచ్చునో వాడు ఆ ద్రవ్యములలోనుండి తాను అర్పించునది యెహోవా సన్ని ధికి తేవలెను.
లేవీయకాండము 7 : 30 (TEV)
అతడు తన చేతుల లోనే యెహోవాకు హోమద్రవ్యములను, అనగా బోరమీది క్రొవ్వును తేవలెను. యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా దానిని అల్లాడించుటకు బోరతో దానిని తేవలెను.
లేవీయకాండము 7 : 31 (TEV)
యాజకుడు బలిపీఠముమీద ఆ క్రొవ్వును దహింపవలెను గాని, బోర అహరోనుకును అతని సంతతివారికిని చెందును.
లేవీయకాండము 7 : 32 (TEV)
సమాధానబలిపశువులలోనుండి ప్రతిష్ఠార్పణముగా యాజ కునికి కుడి జబ్బనియ్యవలెను.
లేవీయకాండము 7 : 33 (TEV)
అహరోను సంతతివారిలో ఎవడు సమాధానబలియగు పశువురక్తమును క్రొవ్వును అర్పించునో కుడిజబ్బ వానిదగును.
లేవీయకాండము 7 : 34 (TEV)
ఏలయనగా ఇశ్రా యేలీయుల యొద్దనుండి, అనగా వారి సమాధానబలి ద్రవ్యములలోనుండి అల్లాడించిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను తీసికొని, నిత్యమైన కట్టడచొప్పున యాజకుడైన అహరోనుకును అతని సంతతివారికిని ఇచ్చియున్నాను.
లేవీయకాండము 7 : 35 (TEV)
వారు తనకు యాజకులగునట్లు యెహోవా వారిని చేర దీసిన దినమందు యెహోవాకు అర్పించు హోమద్రవ్య ములలోనుండినది అభిషేక మునుబట్టి అహరోనుకును అభి షేకమునుబట్టియే అతని సంతతివారికిని కలిగెను.
లేవీయకాండము 7 : 36 (TEV)
వీటిని ఇశ్రాయేలీ యులు వారికియ్యవలెనని యెహోవా వారిని అభిషేకించిన దినమున వారి తరతరములకు నిత్యమైన కట్ట డగా నియమించెను.
లేవీయకాండము 7 : 37 (TEV)
ఇది దహనబలిని గూర్చియు అప రాధపరిహారార్థపు నైవేద్యమును గూర్చియు పాపపరిహా రార్థబలినిగూర్చియు అపరాధ పరిహారార్థబలినిగూర్చియు ప్రతిష్ఠితార్పణమును గూర్చియు సమాధానబలినిగూర్చియు చేయబడిన విధి.
లేవీయకాండము 7 : 38 (TEV)
ఇశ్రాయేలీయులు యెహోవాకు అర్పణ ములను తీసికొని రావలెనని సీనాయి అరణ్యములో ఆయన ఆజ్ఞాపించిన దినమున యెహోవా సీనాయి కొండమీద మోషేకు ఆలాగుననే ఆజ్ఞాపించెను.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38

BG:

Opacity:

Color:


Size:


Font: