యోనా 4 : 1 (TEV)
యోనా దీనిచూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని
యోనా 4 : 2 (TEV)
యెహోవా, నేను నా దేశమం దుండగా ఇట్లు జరుగునని నేననుకొంటిని గదా? అందు వలననే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయుగల దేవుడవై యుండి, పశ్చాత్తాపపడి కీడుచేయక మానుదువని నేను తెలిసికొని దానికి ముందు గానే తర్షీషునకు పారిపోతిని.
యోనా 4 : 3 (TEV)
నేనిక బ్రదుకుటకంటె చచ్చుట మేలు; యెహోవా, నన్నిక బ్రదుకనియ్యక చంపుమని యెహోవాకు మనవి చేసెను.
యోనా 4 : 4 (TEV)
అందుకు యెహోవానీవు కోపించుట న్యాయమా? అని యడిగెను.
యోనా 4 : 5 (TEV)
అప్పుడు యోనా ఆ పట్టణములోనుండి పోయి దాని తూర్పుతట్టున బసచేసి అచ్చట పందిలి యొకటి వేసికొని పట్టణమునకు ఏమి సంభవించునో చూచెదనని ఆ నీడను కూర్చుని యుండగా
యోనా 4 : 6 (TEV)
దేవుడైన యెహోవా సొరచెట్టొకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకుపైగా నీడ యిచ్చునట్లు చేసెను; ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను.
యోనా 4 : 7 (TEV)
మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను.
యోనా 4 : 8 (TEV)
మరియు ఎండ కాయగా దేవుడు వేడిమిగల తూర్పుగాలిని రప్పిం చెను. యోనాతలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మ సిల్లిబ్రదుకుటకంటె చచ్చుట నాకు మేలనుకొనెను.
యోనా 4 : 9 (TEV)
అప్పుడు దేవుడుఈ సొరచెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా? అని యోనాను అడుగగా యోనాప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనెను.
యోనా 4 : 10 (TEV)
అందుకు యెహోవానీవు కష్టపడకుండను పెంచకుండను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలో గానే వాడి పోయిన యీ సొరచెట్టు విషయములో నీవు విచారపడు చున్నావే;
యోనా 4 : 11 (TEV)
అయితే నూట ఇరువదివేలకంటె ఎక్కువై, కుడియెడమలు ఎరుగని జనమును బహు పశువులును గల నీనెవె మహాపురము విషయములో నేను విచారపడవద్దా? అని యోనాతో సెలవిచ్చెను.
❮
❯