సంఖ్యాకాండము 12 : 1 (TEV)
మోషే కూషుదేశపు స్త్రీని పెండ్లి చేసికొని యుండెను గనుక అతడు పెండ్లిచేసికొనిన ఆ స్త్రీ నిబట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి.
సంఖ్యాకాండము 12 : 2 (TEV)
వారుమోషేచేత మాత్రమే యెహోవా పలి కించెనా? ఆయన మా చేతను పలికింపలేదా? అని చెప్పు కొనగా
సంఖ్యాకాండము 12 : 3 (TEV)
యెహోవా ఆ మాటవినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు.
సంఖ్యాకాండము 12 : 4 (TEV)
యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞనిచ్చెను. ఆ ముగ్గురు రాగా
సంఖ్యాకాండము 12 : 5 (TEV)
యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచెను.
సంఖ్యాకాండము 12 : 6 (TEV)
వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి; మీలో ప్రవక్త యుండినయెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసి కొనునట్లు కలలో అతనితో మాటలాడుదును. నా సేవకు డైన మోషే అట్టివాడుకాడు.
సంఖ్యాకాండము 12 : 7 (TEV)
అతడు నా యిల్లంతటిలో నమ్మకమైనవాడు.
సంఖ్యాకాండము 12 : 8 (TEV)
నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుదును; అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధ ముగా మాటలాడుటకు మీరేల భయపడలేదనెను.
సంఖ్యాకాండము 12 : 9 (TEV)
యెహోవా కోపము వారిమీద రగులుకొనగా ఆయన వెళ్లిపోయెను.
సంఖ్యాకాండము 12 : 10 (TEV)
మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీదనుండి ఎత్త బడెను; అప్పుడు మిర్యాము హిమమువంటి తెల్లని కుష్ఠు గలదాయెను; అహరోను మిర్యామువైపు చూచినప్పుడు ఆమె కుష్ఠుగలదిగా కనబడెను.
సంఖ్యాకాండము 12 : 11 (TEV)
అహరోను అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము; పాపులమైన మేము చేసిన యీ పాప మును మామీద మోపవద్దు.
సంఖ్యాకాండము 12 : 12 (TEV)
తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగముమాంసము క్షీణించిన శిశు శవమువలె ఆమెను ఉండనియ్యకుమని మోషేతో చెప్పగా
సంఖ్యాకాండము 12 : 13 (TEV)
మోషే యెలుగెత్తిదేవా, దయచేసి యీమెను బాగుచేయుమని యెహోవాకు మొఱ పెట్టెను.
సంఖ్యాకాండము 12 : 14 (TEV)
అప్పుడు యెహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమి్మవేసినయెడల ఆమె యేడు దినములు సిగ్గు పడునుగదా; ఆమె పాళెము వెలుపల ఏడు దినములు ప్రత్యేకముగా ఉండవలెను. తరువాత ఆమెను చేర్చు కొనవలెను.
సంఖ్యాకాండము 12 : 15 (TEV)
కాబట్టి మిర్యాము ఏడు దినములు పాళెము వెలుపలనే గడిపెను. మిర్యాము మరల చేర్చబడువరకు జనులు ముందుకు సాగరైరి.
సంఖ్యాకాండము 12 : 16 (TEV)
తరువాత జనులు హజేరోతు నుండి సాగి పారాను అరణ్యములో దిగిరి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

BG:

Opacity:

Color:


Size:


Font: