మత్తయి సువార్త 1 : 1 (TEV)
అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి.
మత్తయి సువార్త 1 : 2 (TEV)
అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను;
మత్తయి సువార్త 1 : 3 (TEV)
యూదా తామారునందు పెరెసును, జెరహును కనెను;
మత్తయి సువార్త 1 : 4 (TEV)
పెరెసు ఎస్రోమును కనెను,ఒ ఎస్రోము అరా మును కనెను, అరాము అమీ్మన ాదాబును కనెను, అమీ్మ నాదాబు నయస్సోనును కనెను;
మత్తయి సువార్త 1 : 5 (TEV)
నయస్సోను శల్మానును కనెను, శల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను;
మత్తయి సువార్త 1 : 6 (TEV)
యెష్షయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగానుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను.
మత్తయి సువార్త 1 : 7 (TEV)
సొలొమోను రెహబామును కనెను; రెహబాము అబీయాను కనెను, అబీయా ఆసాను కనెను;
మత్తయి సువార్త 1 : 8 (TEV)
ఆసా యెహోషాపాతును కనెను, యెహోషా పాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను;
మత్తయి సువార్త 1 : 9 (TEV)
ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను;
మత్తయి సువార్త 1 : 10 (TEV)
హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను యోషీయాను కనెను;
మత్తయి సువార్త 1 : 11 (TEV)
యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషీయా యెకొన్యాను అతని సహోదరులను కనెను.
మత్తయి సువార్త 1 : 12 (TEV)
బబులోనుకు కొనిపోబడిన తరువాత యెకొన్యా షయల్తీ యేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను;
మత్తయి సువార్త 1 : 13 (TEV)
జెరుబ్బాబెలు అబీహూదును కనెను, అబీహూదు ఎల్యా కీమును కనెను, ఎల్యాకీము అజోరును కనెను;
మత్తయి సువార్త 1 : 14 (TEV)
అజోరు సాదోకును కనెను, సాదోకు ఆకీమును కనెను, ఆకీము ఎలీహూదును కనెను;
మత్తయి సువార్త 1 : 15 (TEV)
ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకో బును కనెను;
మత్తయి సువార్త 1 : 16 (TEV)
యాకోబు మరియ భర్తయైన యోసేపును కనెను, ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను.
మత్తయి సువార్త 1 : 17 (TEV)
ఇట్లు అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు తరము లన్నియు పదునాలుగు తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలమువరకు పదు నాలుగు తరములు; బబులోనుకు కొనిపోబడినది మొదలు కొని క్రీస్తు వరకు పదునాలుగు తరములు.
మత్తయి సువార్త 1 : 18 (TEV)
యేసు క్రీస్తు జననవిధ మెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను.
మత్తయి సువార్త 1 : 19 (TEV)
ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను.
మత్తయి సువార్త 1 : 20 (TEV)
అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చు కొనుటక
మత్తయి సువార్త 1 : 21 (TEV)
తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు2 అను పేరు పెట్టుదువనెను.
మత్తయి సువార్త 1 : 22 (TEV)
ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు
మత్తయి సువార్త 1 : 23 (TEV)
అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరు నట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము.
మత్తయి సువార్త 1 : 24 (TEV)
యాసేపు నిద్రమేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారముచేసి, తన భార్యను చేర్చుకొని
మత్తయి సువార్త 1 : 25 (TEV)
ఆమె కుమా రుని కను వరకు ఆమెను ఎరుగకుండెను; అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25

BG:

Opacity:

Color:


Size:


Font: