మత్తయి సువార్త 10 : 1 (TEV)
ఆయన తన పండ్రెండుమంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్లగొట్టుటకును, ప్రతివిధమైన రోగ మును ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుటకును, వారికి అధికార మిచ్చెను.
మత్తయి సువార్త 10 : 2 (TEV)
ఆ పండ్రెండుమంది అపొస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రెయ; జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను;
మత్తయి సువార్త 10 : 3 (TEV)
ఫిలిప్పు, బర్తొలొమయి; తోమా, సుంకరియైన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయియను మారుపేరుగల లెబ్బయి;
మత్తయి సువార్త 10 : 4 (TEV)
కనా నీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా.
మత్తయి సువార్త 10 : 5 (TEV)
యేసు ఆ పండ్రెండుమందిని పంపుచు, వారినిచూచి వారికాజ్ఞాపించినదేమనగామీరు అన్యజనుల దారిలోనికి వెళ్లకుడి, సమరయుల యే పట్టణములోనైనను ప్రవేశింప కుడి గాని
మత్తయి సువార్త 10 : 6 (TEV)
ఇశ్రాయేలు వంశములోని నశించిన గొఱ్ఱల యొద్దకే వెళ్లుడి.
మత్తయి సువార్త 10 : 7 (TEV)
వెళ్లుచుపరలోకరాజ్యము సమీపించి యున్నదని ప్రకటించుడి.
మత్తయి సువార్త 10 : 8 (TEV)
రోగులను స్వస్థపరచుడి, చనిపోయినవారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్లగొట్టుడి. ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి.
మత్తయి సువార్త 10 : 9 (TEV)
మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలెనైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను చేతికఱ్ఱనైనను సిద్ధపరచుకొనకుడి;
మత్తయి సువార్త 10 : 10 (TEV)
పనివాడు తన ఆహార మునకు పాత్రుడు కాడా?
మత్తయి సువార్త 10 : 11 (TEV)
మరియు మీరు ఏపట్ట ణములో నైనను గ్రామములోనైనను ప్రవేశించునప్పుడు, అందులో ఎవడు యోగ్యుడో విచారణచేసి, అక్కడనుండి వెళ్లువరకు అతని యింటనే బసచేయుడి.
మత్తయి సువార్త 10 : 12 (TEV)
ఆ యింటిలో ప్రవేశించుచు, ఇంటివారికి శుభమని చెప్పుడి.
మత్తయి సువార్త 10 : 13 (TEV)
ఆ యిల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దానిమీదికి వచ్చును; అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును.
మత్తయి సువార్త 10 : 14 (TEV)
ఎవడైనను మిమ్మును చేర్చు కొనక మీ మాటలు వినకుండిన యెడల మీరు ఆ యింటినైనను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి.
మత్తయి సువార్త 10 : 15 (TEV)
విమర్శదినమందు ఆ పట్ట ణపు గతికంటె సొదొమ గొమొఱ్ఱా ప్రదేశముల గతి ఓర్వతగినదై యుండునని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను.
మత్తయి సువార్త 10 : 16 (TEV)
ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై యుండుడి.
మత్తయి సువార్త 10 : 17 (TEV)
మనుష్యు లనుగూర్చి జాగ్రత్తపడుడి; వారు మిమ్మును మహాసభలకు అప్పగించి, తమ సమాజమందిరములలో మిమ్మును కొరడా లతో కొట్టింతురు,
మత్తయి సువార్త 10 : 18 (TEV)
వీరికిని అన్యజనులకును సాక్ష్యార్థమై నానిమిత్తము మీరు అధిపతులయొద్దకును రాజులయొద్దకును తేబడుదురు.
మత్తయి సువార్త 10 : 19 (TEV)
వారు మిమ్మును అప్పగించునప్పుడు, ఏలాగు మాటాడుదుము? ఏమి చెప్పుదుము? అని చింతింప కుడి; మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకను గ్రహింపబడును.
మత్తయి సువార్త 10 : 20 (TEV)
మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు.
మత్తయి సువార్త 10 : 21 (TEV)
సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని, మరణమునకు అప్పగించెదరు; పిల్లలు తలిదండ్రులమీద లేచి వారిని చంపించెదరు.
మత్తయి సువార్త 10 : 22 (TEV)
మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు; అంతమువరకును సహించిన వాడు రక్షంపబడును.
మత్తయి సువార్త 10 : 23 (TEV)
వారు ఈ పట్టణములో మిమ్మును హింసించునప్పుడు మరియొక పట్టణమునకు పారిపోవుడి; మనుష్యకుమారుడు వచ్చువరకు మీరు ఇశ్రాయేలు పట్టణ ములలో సంచారము చేసియుండరని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను.
మత్తయి సువార్త 10 : 24 (TEV)
శిష్యుడు బోధకునికంటె అధికుడు కాడు; దాసుడు యజమానునికంటె అధికుడు కాడు.
మత్తయి సువార్త 10 : 25 (TEV)
శిష్యుడు తన బోధకునివలెను దాసుడు తన యజమానునివలెను ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయెల్జెబూలని వారు పేరుపెట్టి యుండినయెడల ఆయన యింటివారికి మరి నిశ్చ యముగా ఆ పేరు పెట్టుదురు గదా.
మత్తయి సువార్త 10 : 26 (TEV)
కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచ బడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు.
మత్తయి సువార్త 10 : 27 (TEV)
చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి; చెవిలో మీకు చెప్పబడినది మేడలమీద ప్రక టించుడి.
మత్తయి సువార్త 10 : 28 (TEV)
మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి.
మత్తయి సువార్త 10 : 29 (TEV)
రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలను పడదు.
మత్తయి సువార్త 10 : 30 (TEV)
మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి
మత్తయి సువార్త 10 : 31 (TEV)
గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు.
మత్తయి సువార్త 10 : 32 (TEV)
మనుష్యులయెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును వానిని ఒప్పుకొందును.
మత్తయి సువార్త 10 : 33 (TEV)
మనుష్యుల యెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోక మందున్న నా తండ్రియెదుట నేనును ఎరుగనందును.
మత్తయి సువార్త 10 : 34 (TEV)
నేను భూమిమీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి; ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు.
మత్తయి సువార్త 10 : 35 (TEV)
ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని.
మత్తయి సువార్త 10 : 36 (TEV)
ఒక మనుష్యుని యింటివారే అతనికి శత్రువులగుదురు.
మత్తయి సువార్త 10 : 37 (TEV)
తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడుకాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కు వగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు;
మత్తయి సువార్త 10 : 38 (TEV)
తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు.
మత్తయి సువార్త 10 : 39 (TEV)
తన ప్రాణము దక్కించుకొనువాడు దాని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును.
మత్తయి సువార్త 10 : 40 (TEV)
మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవాని చేర్చుకొనును.
మత్తయి సువార్త 10 : 41 (TEV)
ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్తఫలము పొందును; నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును.
మత్తయి సువార్త 10 : 42 (TEV)
మరియు శిష్యుడని యెవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టు కొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42

BG:

Opacity:

Color:


Size:


Font: