మత్తయి సువార్త 11 : 1 (TEV)
యేసు తన పండ్రెండుమంది శిష్యులకు ఆజ్ఞాపించుట.... . చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడనుండి వెళ్లిపోయెను.
మత్తయి సువార్త 11 : 2 (TEV)
క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో వినిరాబోవు వాడవు నీవేనా, మేము మరి యొకనికొరకు కనిపెట్టవలెనా?
మత్తయి సువార్త 11 : 3 (TEV)
అని ఆయనను అడుగు టకు తన శిష్యులనంపెను.
మత్తయి సువార్త 11 : 4 (TEV)
యేసు వారిని చూచి మీరు వెళ్లి, విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలు పుడి.
మత్తయి సువార్త 11 : 5 (TEV)
గ్రుడ్డివారు చూపుపొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది.
మత్తయి సువార్త 11 : 6 (TEV)
మరియు నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడని యుత్తర మిచ్చెను.
మత్తయి సువార్త 11 : 7 (TEV)
వారు వెళ్లిపోవుచుండగా యేసు యోహా నునుగూర్చి జనసమూహములతో ఈలాగు చెప్పసాగెను మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్లితిరి? గాలికి కదలు చున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్లితిరి?
మత్తయి సువార్త 11 : 8 (TEV)
సన్నపు బట్టలు ధరించుకొన్న మనుష్యునా? ఇదిగోసన్నపు బట్టలు ధరించుకొనువారు రాజగృహములలో నుందురు గదా.
మత్తయి సువార్త 11 : 9 (TEV)
మరి ఏమి చూడ వెళ్లితిరి? ప్రవక్తనా? అవునుగాని ప్రవక్తకంటె గొప్పవానినని మీతో చెప్పుచున్నాను.
మత్తయి సువార్త 11 : 10 (TEV)
ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధ పరచును.
మత్తయి సువార్త 11 : 11 (TEV)
స్త్రీలు కనినవారిలో బాప్తిస్మమిచ్చు యోహానుకంటె గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను. అయినను పరలోకరాజ్యములో అల్పుడైన వాడు అతనికంటె గొప్పవాడు.
మత్తయి సువార్త 11 : 12 (TEV)
బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని యిప్పటి వరకు పరలోకరాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాని నాక్రమించుకొనుచున్నారు.
మత్తయి సువార్త 11 : 13 (TEV)
యోహాను కాలము వరకు ప్రవక్తలందరును ప్రవచించుచువచ్చిరి; ధర్మశాస్త్రము సహా ప్రవచించుచునుం డెను.
మత్తయి సువార్త 11 : 14 (TEV)
ఈ సంగతి నంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలీయా యితడే.
మత్తయి సువార్త 11 : 15 (TEV)
విను టకు చెవులుగలవాడు వినుగాక.
మత్తయి సువార్త 11 : 16 (TEV)
ఈ తరమువారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చునియుండి
మత్తయి సువార్త 11 : 17 (TEV)
మీకు పిల్లనగ్రోవి ఊదితివిుగాని మీరు నాట్యమాడరైతిరి; ప్రలాపించితివిు గాని మీరు రొమ్ముకొట్టుకొనరైతిరని తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొను పిల్ల కాయలను పోలియున్నారు.
మత్తయి సువార్త 11 : 18 (TEV)
యోహాను తినకయు త్రాగకయువచ్చెను. గనుకవీడు దయ్యముపట్టిన వాడని వారనుచున్నారు.
మత్తయి సువార్త 11 : 19 (TEV)
మనుష్యకుమారుడు తినుచును త్రాగు చును వచ్చెను గనుకఇదిగో వీడు తిండిబోతును మద్య పానియు సుంకరులకును పాపులకును స్నేహితుడునని వారనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలనుబట్టి1 తీర్పుపొందుననెను.
మత్తయి సువార్త 11 : 20 (TEV)
పిమ్మట ఏ యే పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణములవారు మారుమనస్సు పొందకపోవుటవలన ఆయన వారి నిట్లు గద్దింపసాగెను.
మత్తయి సువార్త 11 : 21 (TEV)
అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోనుపట్టణములలో చేయబడిన యెడల ఆ పట్టణములవారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిదె వేసికొని మారు
మత్తయి సువార్త 11 : 22 (TEV)
విమర్శదినమందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను.
మత్తయి సువార్త 11 : 23 (TEV)
కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళమువరకు దిగి పోయెదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొ మలో చేయబడిన యెడల అది నేటివరకు నిలిచియుండును.
మత్తయి సువార్త 11 : 24 (TEV)
విమర్శదినమందు నీ గతికంటె సొదొమ దేశపువారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాననెను.
మత్తయి సువార్త 11 : 25 (TEV)
ఆ సమయమున యేసు చెప్పినదేమనగాతండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను.
మత్తయి సువార్త 11 : 26 (TEV)
అవును తండ్రీ, ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను.
మత్తయి సువార్త 11 : 27 (TEV)
సమస్తమును నా తండ్రిచేత నా కప్పగింపబడి యున్నది. తండ్రిగాక యెవడును కుమారుని ఎరుగడు; కుమారుడు గాకను, కుమారు డెవనికి ఆయనను బయలుపరచ నుద్దేశిం చునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు.
మత్తయి సువార్త 11 : 28 (TEV)
ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జను లారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును.
మత్తయి సువార్త 11 : 29 (TEV)
నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.
మత్తయి సువార్త 11 : 30 (TEV)
ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30

BG:

Opacity:

Color:


Size:


Font: