మత్తయి సువార్త 16 : 1 (TEV)
అప్పుడు పరిసయ్యులును సద్దూకయ్యులును వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశమునుండి యొక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా ఆయన ఇట్లనెను
మత్తయి సువార్త 16 : 2 (TEV)
సాయంకాలమున మీరుఆకాశము ఎఱ్ఱగా ఉన్నది గనుక వర్షము కురియదనియు,
మత్తయి సువార్త 16 : 3 (TEV)
ఉదయమునఆకాశము ఎఱ్ఱగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు గదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు గాని యీ కాలముల సూచనలను వివేచింపలేరు.
మత్తయి సువార్త 16 : 4 (TEV)
వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియ నడుగుచున్నారు, అయితే యోనాను గూర్చిన సూచకక్రియయేగాని మరి ఏ సూచక క్రియయైన వారి కనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్లిపోయెను.
మత్తయి సువార్త 16 : 5 (TEV)
ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి.
మత్తయి సువార్త 16 : 6 (TEV)
అప్పుడు యేసుచూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండినిగూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను.
మత్తయి సువార్త 16 : 7 (TEV)
కాగా వారుమనము రొట్టెలు తేనందున గదా (యీ మాట చెప్పెనని) తమలో తాము ఆలోచించుకొనుచుండిరి.
మత్తయి సువార్త 16 : 8 (TEV)
యేసు అది యెరిగి అల్పవిశ్వాసులారామనయొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు?
మత్తయి సువార్త 16 : 9 (TEV)
మీరింకను గ్రహింపలేదా? అయిదు రొట్టెలు అయిదువేలమందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్లు ఎత్తితిరో అదియైనను
మత్తయి సువార్త 16 : 10 (TEV)
ఏడు రొట్టెలు నాలుగు వేలమందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్లు ఎత్తితిరో అదియైనను మీకు జ్ఞాపకము లేదా?
మత్తయి సువార్త 16 : 11 (TEV)
నేను రొట్టెలనుగూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండినిగూర్చియే జాగ్రత్తపడుడని చెప్పెను.
మత్తయి సువార్త 16 : 12 (TEV)
అప్పుడు రొట్టెల పులిసిన పిండినిగూర్చి కాదుగాని పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి బోధను గూర్చియే జాగ్రత్తపడవలెనని ఆయన తమతో చెప్పెనని వారు గ్రహించిరి.
మత్తయి సువార్త 16 : 13 (TEV)
యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చిమనుష్యకుమారుడెవడని జనులు చెప్పకొనుచున్నారని తన శిష్యులను అడుగగా
మత్తయి సువార్త 16 : 14 (TEV)
వారుకొందరు బాప్తిస్మ మిచ్చు యోహాననియు, కొందరు ఏలీయా అనియు, కొందరు యిర్మీయా అనియు లేక ప్రవక్త లలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి.
మత్తయి సువార్త 16 : 15 (TEV)
అందుకాయనమీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నా రని వారి నడిగెను.
మత్తయి సువార్త 16 : 16 (TEV)
అందుకు సీమోను పేతురునీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను.
మత్తయి సువార్త 16 : 17 (TEV)
అందుకు యేసుసీమోను బర్ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనేకాని నరులు2 నీకు బయలు పరచలేదు.
మత్తయి సువార్త 16 : 18 (TEV)
మరియు నీవు పేతురువు3; ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను.
మత్తయి సువార్త 16 : 19 (TEV)
పరలోకరాజ్యముయొక్క తాళపుచెవులు నీ కిచ్చెదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోక మందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను.
మత్తయి సువార్త 16 : 20 (TEV)
అటుపిమ్మట తాను క్రీస్తు అని యెవనితోను చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను.
మత్తయి సువార్త 16 : 21 (TEV)
అప్పటినుండి తాను యెరూషలేమునకు వెళ్లిపెద్దలచేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను అనేక హింసలు పొంది, చంపబడి, మూడవదినమున లేచుట అగత్యమని యేసు తన
మత్తయి సువార్త 16 : 22 (TEV)
పేతురు ఆయన చేయి పట్టుకొనిప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీ కెన్నడును కలుగదని ఆయనను గద్దింపసాగెను.
మత్తయి సువార్త 16 : 23 (TEV)
అయితే ఆయన పేతురు వైపు తిరిగిసాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు నాకు అభ్యంతర కారణమైయున్నావు; నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంప
మత్తయి సువార్త 16 : 24 (TEV)
అప్పుడు యేసు తన శిష్యులను చూచిఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తి కొని నన్ను వెంబడింపవలెను.
మత్తయి సువార్త 16 : 25 (TEV)
తన ప్రాణమును రక్షించు కొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించు కొనును.
మత్తయి సువార్త 16 : 26 (TEV)
ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించు కొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయో జనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి యియ్యగలడు?
మత్తయి సువార్త 16 : 27 (TEV)
మనుష్యకుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడ రాబోవుచున్నాడు. అప్పు డాయన ఎవని క్రియలచొప్పున వానికి ఫలమిచ్చును.
మత్తయి సువార్త 16 : 28 (TEV)
ఇక్కడ నిలిచియున్న వారిలోకొందరు, మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచువరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను.
❮
❯