మత్తయి సువార్త 20 : 1 (TEV)
ఏలాగనగాపరలోకరాజ్యము ఒక ఇంటి యజ మానుని పోలియున్నది. అతడు తన ద్రాక్షతోటలో పని వారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి
మత్తయి సువార్త 20 : 2 (TEV)
దినమునకు ఒక దేనారము2 చొప ్పున పనివారితో ఒడబడి, తన ద్రాక్షతోటలోనికి వారిని పంపెను.
మత్తయి సువార్త 20 : 3 (TEV)
తరువాత అతడు దాదాపు తొమి్మది గంటలకు వెళ్లి సంత వీధిలో ఊరక నిలిచియున్న మరికొందరిని చూచిఒ మీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడి, యేమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్లిరి.
మత్తయి సువార్త 20 : 4 (TEV)
మీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడి, యేమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్లిరి.
మత్తయి సువార్త 20 : 5 (TEV)
దాదాపు పండ్రెండు గంటలకును, మూడు గంటలకును, అతడు మరల వెళ్లి, ఆలాగే చేసెను.
మత్తయి సువార్త 20 : 6 (TEV)
తిరిగి దాదాపు అయిదు గంట లకు వెళ్లి, మరికొందరు నిలిచియుండగా చూచిఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచియున్నారని వారిని అడుగగా
మత్తయి సువార్త 20 : 7 (TEV)
వారు ఎవడును మమ్మును కూలికి పెట్టుకొన లేదనిరి. అందుకతడుమీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడనెను.
మత్తయి సువార్త 20 : 8 (TEV)
సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్షతోట యజమానుడు తన గృహనిర్వాహకుని చూచిపనివారిని పిలిచి, చివర వచ్చినవారు మొదలుకొని మొదట వచ్చిన వారివరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను.
మత్తయి సువార్త 20 : 9 (TEV)
దాదాపు అయిదు గంటలకు కూలికి కుదిరినవారు వచ్చి ఒక్కొక దేనారముచొప్పున తీసికొనిరి.
మత్తయి సువార్త 20 : 10 (TEV)
మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరకుననుకొనిరి గాని వారికిని ఒక్కొక దేనారముచొప్పుననే దొరకెను.
మత్తయి సువార్త 20 : 11 (TEV)
వారది తీసికొని చివర వచ్చిన వీరు ఒక్కగంట మాత్రమే పనిచేసినను,
మత్తయి సువార్త 20 : 12 (TEV)
పగలంతయు కష్టపడి యెండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ యింటి యజ మానునిమీద సణుగుకొనిరి.
మత్తయి సువార్త 20 : 13 (TEV)
అందుకతడు వారిలో ఒకని చూచిస్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయ లేదే; నీవు నాయొద్ద ఒక దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసికొని పొమ్ము;
మత్తయి సువార్త 20 : 14 (TEV)
నీ కిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకిష్టమైనది;
మత్తయి సువార్త 20 : 15 (TEV)
నాకిష్టమువచ్చి నట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపుమంటగా ఉన్నదా3 అని చెప్పెను.
మత్తయి సువార్త 20 : 16 (TEV)
ఈ ప్రకారమే కడపటివారు మొదటి వారగుదురు, మొదటివారు కడపటివారగుదురు.
మత్తయి సువార్త 20 : 17 (TEV)
యేసు యెరూషలేమునకు వెళ్లనైయున్నప్పుడు ఆయన పండ్రెండుమంది శిష్యులను ఏకాంతముగా తీసికొనిపోయి, మార్గమందు వారితో ఇట్లనెను.
మత్తయి సువార్త 20 : 18 (TEV)
ఇదిగో యెరూష లేమునకు వెళ్లుచున్నాము; అక్కడ మనుష్యకుమారుడు ప్రధానయాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును; వారాయనకు మరణశిక్ష విధించి
మత్తయి సువార్త 20 : 19 (TEV)
ఆయనను అపహసించు టకును కొరడాలతో కొట్టుటకును సిలువవేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు; మూడవ దినమున ఆయన మరల లేచును.
మత్తయి సువార్త 20 : 20 (TEV)
అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయనయొద్దకు వచ్చి నమస్కారముచేసి యొక మనవి చేయబోగా
మత్తయి సువార్త 20 : 21 (TEV)
నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామెనీ రాజ్యమందు ఈ నా యిద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ యెడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను.
మత్తయి సువార్త 20 : 22 (TEV)
అందుకు యేసుమీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు; నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగ గలరా? అని అడుగగా వారుత్రాగగలమనిరి.
మత్తయి సువార్త 20 : 23 (TEV)
ఆయనమీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడి వైపునను నా యెడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశమునలేదు; నా తండ్రిచేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికే అది దొరకునని చెప్పెను.
మత్తయి సువార్త 20 : 24 (TEV)
తక్కిన పదిమంది శిష్యులు ఈ మాట విని ఆ యిద్దరు సహోదరులమీద కోపపడిరి
మత్తయి సువార్త 20 : 25 (TEV)
గనుక యేసు తనయొద్దకు వారిని పిలిచిఅన్య జనులలో అధికారులు వారిమీద ప్రభుత్వము చేయుదు రనియు, వారిలో గొప్పవారు వారిమీద అధికారము చేయుదురనియు మీకు తెలియును.
మత్తయి సువార్త 20 : 26 (TEV)
మీలో ఆలాగుండ కూడదు; మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను;
మత్తయి సువార్త 20 : 27 (TEV)
మీలో ఎవడు ముఖ్యుడై యుండగోరునో వాడు మీ దాసుడై యుండ వలెను.
మత్తయి సువార్త 20 : 28 (TEV)
ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించు కొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకు లకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను.
మత్తయి సువార్త 20 : 29 (TEV)
వారు యెరికోనుండి వెళ్లుచుండగా బహు జనసమూ హము ఆయనవెంట వెళ్లెను.
మత్తయి సువార్త 20 : 30 (TEV)
ఇదిగో త్రోవప్రక్కను కూర్చున్న యిద్దరు గ్రుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్లు చున్నాడని వినిప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని కేకలువేసిరి.
మత్తయి సువార్త 20 : 31 (TEV)
ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారుప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని మరి బిగ్గరగా కేకవేసిరి.
మత్తయి సువార్త 20 : 32 (TEV)
యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా
మత్తయి సువార్త 20 : 33 (TEV)
వారుప్రభువా, మా కన్నులు తెరవవలె ననిరి.
మత్తయి సువార్త 20 : 34 (TEV)
కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను; వెంటనే వారు దృష్టిపొంది ఆయన వెంట వెళ్లిరి.
❮
❯