మత్తయి సువార్త 22 : 1 (TEV)
యేసు వారికుత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను.
మత్తయి సువార్త 22 : 2 (TEV)
పరలోకరాజ్యము, తన కుమారునికి పెండ్లి విందుచేసిన యొక రాజును పోలియున్నది.
మత్తయి సువార్త 22 : 3 (TEV)
ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తనదాసు లను పంపినప్పుడు వారు రానొల్లక పోయిరి.
మత్తయి సువార్త 22 : 4 (TEV)
కాగా అతడుఇదిగో నా విందు సిద్ధపరచియున్నాను; ఎద్దు లును క్రొవ్విన పశువులును వధింపబడినవి; అంతయు సిద్ధ ముగా ఉన్నది; పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని
మత్తయి సువార్త 22 : 5 (TEV)
వారు లక్ష్యము చేయక, ఒకడు తన పొలమునకును మరియొకడు తన వర్తకమునకును వెళ్లిరి.
మత్తయి సువార్త 22 : 6 (TEV)
తక్కినవారు అతని దాసులను పట్టుకొని అవమానపరచి చంపిరి.
మత్తయి సువార్త 22 : 7 (TEV)
కాబట్టి రాజు కోప పడి తన దండ్లను పంపి, ఆ నరహంతకులను సంహరించి, వారి పట్టణము తగలబెట్టించెను.
మత్తయి సువార్త 22 : 8 (TEV)
అప్పుడతడుపెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడినవారు పాత్రులు కారు.
మత్తయి సువార్త 22 : 9 (TEV)
గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరిని పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను.
మత్తయి సువార్త 22 : 10 (TEV)
ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డ వారినేమి మంచివారినేమి తమకు కనబడినవారి నందరిని పోగుచేసిరి గనుక విందుకు వచ్చినవారితో ఆ పెండ్లి శాల నిండెను.
మత్తయి సువార్త 22 : 11 (TEV)
రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి, అక్కడ పెండ్లివస్త్రము ధరించుకొనని యొకని చూచి
మత్తయి సువార్త 22 : 12 (TEV)
స్నేహితుడా, పెండ్లి వస్త్రములేక ఇక్కడి కేలాగు వచ్చితి వని అడుగగా వాడు మౌనియై యుండెను.
మత్తయి సువార్త 22 : 13 (TEV)
అంతట రాజువీని కాళ్లు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను.
మత్తయి సువార్త 22 : 14 (TEV)
కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరే అని చెప్పెను.
మత్తయి సువార్త 22 : 15 (TEV)
అప్పుడు పరిసయ్యులు వెళ్లి, మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని ఆలోచనచేయుచు
మత్తయి సువార్త 22 : 16 (TEV)
బోధకుడా, నీవు సత్యవంతుడవై యుండి, దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవనిని లక్ష్యపెట్టవనియు, మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము.
మత్తయి సువార్త 22 : 17 (TEV)
నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా? కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడ తమ శిష్యులను ఆయనయొద్దకు పంపిరి.
మత్తయి సువార్త 22 : 18 (TEV)
యేసు వారి చెడుతన మెరిగివేషధారులారా, నన్నెందుకు శోధించు చున్నారు?
మత్తయి సువార్త 22 : 19 (TEV)
పన్నురూక యొకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారాయనయొద్దకు ఒక దేనారము1 తెచ్చిరి.
మత్తయి సువార్త 22 : 20 (TEV)
అప్పుడాయనఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారినడుగగా వారుకైసరువనిరి.
మత్తయి సువార్త 22 : 21 (TEV)
అందుకాయనఆలా గైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించు డని వారితో చెప్పెను.
మత్తయి సువార్త 22 : 22 (TEV)
వారీమాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్లి పోయిరి.
మత్తయి సువార్త 22 : 23 (TEV)
పునరుత్థానములేదని చెప్పెడి సద్దూకయ్యులు ఆ దిన మున ఆయనయొద్దకు వచ్చి
మత్తయి సువార్త 22 : 24 (TEV)
బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయినయెడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతానము కలుగజేయ వలెనని మోషే చెప్పెను;
మత్తయి సువార్త 22 : 25 (TEV)
మాలో ఏడుగురు సహోదరు లుండిరి; మొదటివాడు పెండ్లిచేసికొని చనిపోయెను; అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసికొనెను.
మత్తయి సువార్త 22 : 26 (TEV)
రెండవ వాడును మూడవ వాడును ఏడవ వానివరకు అందరును ఆలాగే జరిగించి చనిపోయిరి.
మత్తయి సువార్త 22 : 27 (TEV)
అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను.
మత్తయి సువార్త 22 : 28 (TEV)
పునరుత్థాన మందు ఈ యేడుగురిలో ఆమె ఎవనికి భార్యగా ఉండును? ఆమె వీరందరికిని భార్యగా ఉండెను గదా అని ఆయనను అడిగిరి.
మత్తయి సువార్త 22 : 29 (TEV)
అందుకు యేసులేఖనములనుగాని దేవుని శక్తినిగాని ఎరుగక మీరు పొరబడుచున్నారు.
మత్తయి సువార్త 22 : 30 (TEV)
పునరుత్థానమందు ఎవరును పెండ్లిచేసికొనరు, పెండ్లి కియ్య బడరు; వారు పరలోకమందున్న దూతలవలె2 ఉందురు.
మత్తయి సువార్త 22 : 31 (TEV)
మృతుల పునరుత్థానమునుగూర్చినేను అబ్రాహాము దేవు డను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై యున్నా నని దేవుడు మీతో చెప్పినమాట మీరు చదువలేదా?
మత్తయి సువార్త 22 : 32 (TEV)
ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను.
మత్తయి సువార్త 22 : 33 (TEV)
జనులది విని ఆయన బోధ కాశ్చర్యపడిరి.
మత్తయి సువార్త 22 : 34 (TEV)
ఆయన సద్దూకయ్యుల నోరు మూయించెనని పరి సయ్యులు విని కూడివచ్చిరి.
మత్తయి సువార్త 22 : 35 (TEV)
వారిలో ఒక ధర్మశాస్త్రో పదేశకుడు ఆయనను శోధించుచు
మత్తయి సువార్త 22 : 36 (TEV)
బోధకుడా, ధర్మ శాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను.
మత్తయి సువార్త 22 : 37 (TEV)
అందు కాయననీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింప వలెననునదియే.
మత్తయి సువార్త 22 : 38 (TEV)
ఇది ముఖ్య మైనదియు మొదటిదియునైన ఆజ్ఞ.
మత్తయి సువార్త 22 : 39 (TEV)
నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే.
మత్తయి సువార్త 22 : 40 (TEV)
ఈ రెండు ఆజ్ఞలు ధర్మ శాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై యున్నవని అత నితో చెప్పెను.
మత్తయి సువార్త 22 : 41 (TEV)
ఒకప్పుడు పరిసయ్యులు కూడియుండగా యేసు వారిని చూచి
మత్తయి సువార్త 22 : 42 (TEV)
క్రీస్తునుగూర్చి మీకేమి తోచు చున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగెను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి.
మత్తయి సువార్త 22 : 43 (TEV)
అందుకాయనఆలా గైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచువరకు
మత్తయి సువార్త 22 : 44 (TEV)
నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువునా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మవలన ఏల చెప్పు చున్నాడు?
మత్తయి సువార్త 22 : 45 (TEV)
దావీదు ఆయనను ప్రభువని చెప్పినయెడల, ఆయన ఏలాగు అతనికి కుమారుడగునని వారినడుగగా
మత్తయి సువార్త 22 : 46 (TEV)
ఎవడును మారుమాట చెప్పలేకపోయెను. మరియు ఆ దినమునుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడుగ తెగింపలేదు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46

BG:

Opacity:

Color:


Size:


Font: