మత్తయి సువార్త 5 : 1 (TEV)
ఆయన ఆ జనసమూహములను చూచి కొండయెక్కి కూర్చుండగా ఆయన శిష్యు లాయనయొద్దకు వచ్చిరి.
మత్తయి సువార్త 5 : 2 (TEV)
అప్పుడాయన నోరు తెరచి యీలాగు బోధింపసాగెను
మత్తయి సువార్త 5 : 3 (TEV)
ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది.
మత్తయి సువార్త 5 : 4 (TEV)
దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు.
మత్తయి సువార్త 5 : 5 (TEV)
సాత్వికులు ధన్యులు ; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.
మత్తయి సువార్త 5 : 6 (TEV)
నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారుతృప్తిపరచబడుదురు.
మత్తయి సువార్త 5 : 7 (TEV)
కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు.
మత్తయి సువార్త 5 : 8 (TEV)
హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు.
మత్తయి సువార్త 5 : 9 (TEV)
సమాధానపరచువారు ధన్యులు ; వారు దేవుని కుమారులనబడుదురు.
మత్తయి సువార్త 5 : 10 (TEV)
నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.
మత్తయి సువార్త 5 : 11 (TEV)
నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.
మత్తయి సువార్త 5 : 12 (TEV)
సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.
మత్తయి సువార్త 5 : 13 (TEV)
మీరు లోకమునకు ఉప్పయి యున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యులచేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు.
మత్తయి సువార్త 5 : 14 (TEV)
మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము మరుగైయుండనేరదు.
మత్తయి సువార్త 5 : 15 (TEV)
మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది యింటనుండువారికందరికి వెలు గిచ్చుటకై దీపస్తంభముమీదనే పెట్టుదురు.
మత్తయి సువార్త 5 : 16 (TEV)
మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి.
మత్తయి సువార్త 5 : 17 (TEV)
ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టి వేయుటకు నేను రాలేదు.
మత్తయి సువార్త 5 : 18 (TEV)
ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పి పోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
మత్తయి సువార్త 5 : 19 (TEV)
కాబట్టి యీ యాజ్ఞలలో మిగుల అల్పమైన యొకదానినైనను మీరి, మనుష్యులకు ఆలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో మిగుల అల్పుడనబడును; అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును.
మత్తయి సువార్త 5 : 20 (TEV)
శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతికంటెను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోకరాజ్యములో ప్రవేశింపనేరరని మీతో చెప్పుచున్నాను.
మత్తయి సువార్త 5 : 21 (TEV)
నరహత్య చేయవద్దు; నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వికులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా.
మత్తయి సువార్త 5 : 22 (TEV)
నేను మీతో చెప్పునదేమనగాతన సహో దరునిమీద1 కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పు వాడు మహా సభకు లోనగును; ద్రోహీ అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును.
మత్తయి సువార్త 5 : 23 (TEV)
కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధ మేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల
మత్తయి సువార్త 5 : 24 (TEV)
అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము.
మత్తయి సువార్త 5 : 25 (TEV)
నీ ప్రతి వాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము; లేనియెడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతట నీవు చెరసాలలో వేయబడుదువు.
మత్తయి సువార్త 5 : 26 (TEV)
కడపటి కాసు చెల్లించువరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
మత్తయి సువార్త 5 : 27 (TEV)
వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారుగదా;
మత్తయి సువార్త 5 : 28 (TEV)
నేను మీతో చెప్పునదేమనగాఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.
మత్తయి సువార్త 5 : 29 (TEV)
నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహ మంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవము లలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరముగదా.
మత్తయి సువార్త 5 : 30 (TEV)
నీ కుడిచెయ్యి నిన్నభ్యంతర పరచినయెడల దాని నరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరక ములో పడకుండ నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా.
మత్తయి సువార్త 5 : 31 (TEV)
తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక యియ్యవలెనని చెప్ప బడియున్నది గదా;
మత్తయి సువార్త 5 : 32 (TEV)
నేను మీతో చెప్పునదేమనగావ్యభిచారకారణమునుబట్టి గాక, తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు; విడనాడబడినదానిని పెండ్లాడువాడు వ్యభిచరించు చున్నాడు.
మత్తయి సువార్త 5 : 33 (TEV)
మరియునీవు అప్రమాణము చేయక నీ ప్రమాణము లను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వికులతో చెప్ప బడిన మాట మీరు విన్నారు గదా,
మత్తయి సువార్త 5 : 34 (TEV)
నేను మీతో చెప్పునదేమనగాఎంతమాత్రము ఒట్టుపెట్టుకొనవద్దు; ఆకాశము తోడన వద్దు; అది దేవుని సింహాసనము,ఒ భూమి తోడన వద్దు,
మత్తయి సువార్త 5 : 35 (TEV)
అది ఆయన పాదపీఠము, యెరూష లేముతోడన వద్దు; అది మహారాజు పట్టణము
మత్తయి సువార్త 5 : 36 (TEV)
నీ తల తోడని ఒట్టుపెట్టుకొనవద్దు, నీవు ఒక వెండ్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు.
మత్తయి సువార్త 5 : 37 (TEV)
మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను; వీటికి మించునది దుష్టునినుండి2 పుట్టునది.
మత్తయి సువార్త 5 : 38 (TEV)
కంటికి కన్ను, పంటికి పల్లు అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా.
మత్తయి సువార్త 5 : 39 (TEV)
నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంపకూడ త్రిప్పుము.
మత్తయి సువార్త 5 : 40 (TEV)
ఎవడైన నీమీద వ్యాజ్యెము వేసి నీ అంగీ తీసికొనగోరిన యెడల వానికి నీ పైవస్త్రముకూడ ఇచ్చివేయుము.
మత్తయి సువార్త 5 : 41 (TEV)
ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసినయెడల, వానితో కూడ రెండు మైళ్లు వెళ్లుము.
మత్తయి సువార్త 5 : 42 (TEV)
నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగ గోరువానినుండి నీ ముఖము త్రిప్పు కొనవద్దు.
మత్తయి సువార్త 5 : 43 (TEV)
నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించు మని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా;
మత్తయి సువార్త 5 : 44 (TEV)
నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.
మత్తయి సువార్త 5 : 45 (TEV)
ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతి మంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.
మత్తయి సువార్త 5 : 46 (TEV)
మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించినయెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులును ఆలాగు చేయుచున్నారు గదా.
మత్తయి సువార్త 5 : 47 (TEV)
మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారు గదా.
మత్తయి సువార్త 5 : 48 (TEV)
మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48

BG:

Opacity:

Color:


Size:


Font: