మార్కు సువార్త 1 : 1 (TEV)
దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారం భము.
మార్కు సువార్త 1 : 2 (TEV)
ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను; అతడు నీ మార్గము సిద్ధపరచును.
మార్కు సువార్త 1 : 3 (TEV)
ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయుచున్న ఒకనిశబ్దము అని ప్రవక్తయైన యెషయాచేత వ్రాయబడినట్టు
మార్కు సువార్త 1 : 4 (TEV)
బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణనిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తి స్మము ప్రకటించుచు వచ్చెను.
మార్కు సువార్త 1 : 5 (TEV)
అంతట యూదయ దేశస్థు లందరును, యెరూషలేమువారందరును, బయలుదేరి అతని యొద్దకు వచ్చి, తమ పాపములను ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండి
మార్కు సువార్త 1 : 6 (TEV)
యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొలచుట్టు తోలుదట్టియు ధరించు కొనువాడు, అడవి తేనెను మిడుతలను తినువాడు.
మార్కు సువార్త 1 : 7 (TEV)
మరియు అతడునాకంటె శక్తిమంతుడొకడు నావెనుక వచ్చుచున్నాడు; నేను వంగి ఆయన చెప్పులవారును విప్పుటకు పాత్రుడనుకాను;
మార్కు సువార్త 1 : 8 (TEV)
నేను నీళ్లలో2 మీకు బాప్తిస్మమిచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో3 మీకు బాప్తిస్మమిచ్చునని చెప్పి ప్రకటించుచుండెను.
మార్కు సువార్త 1 : 9 (TEV)
ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతునుండి వచ్చి యొర్దానులో యోహానుచేత బాప్తిస్మము పొందెను.
మార్కు సువార్త 1 : 10 (TEV)
వెంటనే ఆయన నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు, పరిశుద్ధాత్మ పావురమువలె తనమీదికి దిగివచ్చుటయు చూచెను.
మార్కు సువార్త 1 : 11 (TEV)
మరియునీవు నా ప్రియకుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.
మార్కు సువార్త 1 : 12 (TEV)
వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసికొనిపోయెను.
మార్కు సువార్త 1 : 13 (TEV)
ఆయన సాతానుచేత శోధింప బడుచు అరణ్యములో నలువదిదినములు అడవిమృగము లతోకూడ నుండెను; మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి.
మార్కు సువార్త 1 : 14 (TEV)
యోహాను చెరపట్టబడిన తరువాత యేసు
మార్కు సువార్త 1 : 15 (TEV)
కాలము సంపూర్ణమైయున్నది, దేవునిరాజ్యము సమీపించి యున్నది ; మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు, గలిలయకు వచ్చెను.
మార్కు సువార్త 1 : 16 (TEV)
ఆయన గలిలయ సముద్రతీరమున వెళ్లుచుండగా సీమోనును సీమోను సహోదరుడగు అంద్రెయయు, సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు.
మార్కు సువార్త 1 : 17 (TEV)
యేసునా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేసెదనని వారితో చెప్పెను.
మార్కు సువార్త 1 : 18 (TEV)
వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి.
మార్కు సువార్త 1 : 19 (TEV)
ఆయన ఇంక కొంతదూరము వెళ్లి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను; వారు దోనెలో ఉండి తమ వలలు బాగుచేసికొనుచుండిరి.
మార్కు సువార్త 1 : 20 (TEV)
వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రియైన జెబెదయిని దోనెలో జీతగాండ్రయొద్ద విడిచిపెట్టి ఆయ నను వెంబడించిరి.
మార్కు సువార్త 1 : 21 (TEV)
అంతట వారు కపెర్నహూములోనికి వెళ్లిరి. వెంటనే ఆయన విశ్రాంతిదినమున సమాజమందిరములోనికి పోయి బోధించెను.
మార్కు సువార్త 1 : 22 (TEV)
ఆయన శాస్త్రులవలె గాక అధికారము గలవానివలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి.
మార్కు సువార్త 1 : 23 (TEV)
ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మపట్టిన మనుష్యుడొకడుండెను.
మార్కు సువార్త 1 : 24 (TEV)
వాడునజరేయుడవగు యేసూ, మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియును; నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను.
మార్కు సువార్త 1 : 25 (TEV)
అందుకు యేసుఊరకుండుము వానిని విడిచిపొమ్మని దానిని గద్దింపగా
మార్కు సువార్త 1 : 26 (TEV)
ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేకవేసి వాని విడిచిపోయెను.
మార్కు సువార్త 1 : 27 (TEV)
అందరును విస్మయమొంది ఇదేమిటో? యిది క్రొత్త బోధగా ఉన్నదే; ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని యొకనితో ఒకడు చెప్పు కొనిరి.
మార్కు సువార్త 1 : 28 (TEV)
వెంటనే ఆయననుగూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములందంతట వ్యాపించెను.
మార్కు సువార్త 1 : 29 (TEV)
వెంటనే వారు సమాజమందిరములోనుండి వెళ్లి, యాకోబుతోను యోహానుతోను సీమోను అంద్రెయ అనువారియింట ప్రవేశించిరి.
మార్కు సువార్త 1 : 30 (TEV)
సీమోను అత్త జ్వరముతో పడియుండగా, వెంటనే వారామెనుగూర్చి ఆయనతో చెప్పిరి.
మార్కు సువార్త 1 : 31 (TEV)
ఆయన ఆమెదగ్గరకు వచ్చి, చెయ్యిపట్టి ఆమెను లేవనెత్తెను; అంతట జ్వరము ఆమెను వదలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను.
మార్కు సువార్త 1 : 32 (TEV)
సాయంకాలము ప్రొద్దు గ్రుంకినప్పుడు, జనులు సకల రోగులను దయ్యములు పట్టినవారిని ఆయనయొద్దకు తీసి కొని వచ్చిరి;
మార్కు సువార్త 1 : 33 (TEV)
పట్టణమంతయు ఆ యింటివాకిట కూడి యుండెను.
మార్కు సువార్త 1 : 34 (TEV)
ఆయన నానావిధ రోగములచేత పీడింప బడిన అనేకులను స్వస్థపరచి, అనేకమైన దయ్యములను వెళ్లగొట్టెను. అవి తన్ను ఎరిగియుండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనియ్యలేదు.
మార్కు సువార్త 1 : 35 (TEV)
ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను.
మార్కు సువార్త 1 : 36 (TEV)
సీమోనును అతనితో కూడ నున్నవారును ఆయనను వెదకుచు వెళ్లి
మార్కు సువార్త 1 : 37 (TEV)
ఆయనను కనుగొని,అందరు నిన్ను వెదకుచున్నారని ఆయనతో చెప్పగా
మార్కు సువార్త 1 : 38 (TEV)
ఆయనఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించునట్లు వెళ్లుదము రండి; యిందునిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పెను.
మార్కు సువార్త 1 : 39 (TEV)
ఆయన గలిలయయందంతట వారి సమాజమందిరములలో ప్రక టించుచు, దయ్యములను వెళ్లగొట్టుచు నుండెను.
మార్కు సువార్త 1 : 40 (TEV)
ఒక కుష్ఠరోగి ఆయనయొద్దకు వచ్చి ఆయనయెదుట మోకాళ్లూనినీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి, ఆయనను వేడుకొనగా
మార్కు సువార్త 1 : 41 (TEV)
ఆయన కనికర పడి, చెయ్యిచాపి వానిని ముట్టినాకిష్టమే; నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను.
మార్కు సువార్త 1 : 42 (TEV)
వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను.
మార్కు సువార్త 1 : 43 (TEV)
అప్పుడాయనఎవనితోను ఏమియు చెప్పకు సుమీ;
మార్కు సువార్త 1 : 44 (TEV)
కాని నీవు వెళ్లి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచు కొని, నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుక లను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేసెను.
మార్కు సువార్త 1 : 45 (TEV)
అయితే వాడు వెళ్లి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును, ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక, వెలు

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45

BG:

Opacity:

Color:


Size:


Font: