మార్కు సువార్త 12 : 1 (TEV)
ఆయన ఉపమానరీతిగా వారికి బోధింపనారం భించెను; ఎట్లనగాఒక మనుష్యుడు ద్రాక్షతోట నాటించి, దానిచుట్టు కంచె వేయించి, ద్రాక్షలతొట్టి తొలిపించి గోపురము కట్టించి, కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరముపోయెను.
మార్కు సువార్త 12 : 2 (TEV)
పంటకాలమందు ఆ కాపుల నుండి ద్రాక్షతోట పండ్లలో తన భాగము తీసికొని వచ్చుటకు, కాపులయొద్దకు అతడు ఒక దాసునిపంపగా
మార్కు సువార్త 12 : 3 (TEV)
వారు వాని పట్టుకొని కొట్టి, వట్టిచేతులతో పంపివేసిరి.
మార్కు సువార్త 12 : 4 (TEV)
మరల అతడు మరియొక దాసుని వారియొద్దకు పంపగా, వారు వాని తల గాయముచేసి అవమానపరచిరి.
మార్కు సువార్త 12 : 5 (TEV)
అతడు మరియొకని పంపగా వానిని చంపిరి. అతడింక అనేకులను పంపగా, వారు కొందరిని కొట్టిరి, కొందరిని చంపిరి.
మార్కు సువార్త 12 : 6 (TEV)
ఇంకను అతనికి ప్రియ కుమారుడు ఒకడుండెను గనుకవారు తన కుమారుని సన్మానించెదరనుకొని తుదకు వారి యొద్దకు అతనిని పంపెను.
మార్కు సువార్త 12 : 7 (TEV)
అయితే ఆ కాపులుఇతడు వారసుడు; ఇతని చంపుదము రండి, అప్పుడు స్వాస్థ్యము మనదగునని తమలోతాము చెప్పుకొని
మార్కు సువార్త 12 : 8 (TEV)
అతనిని పట్టుకొని చంపి, ద్రాక్షతోట వెలుపల పారవేసిరి.
మార్కు సువార్త 12 : 9 (TEV)
కావున ఆ ద్రాక్షతోట యజమానుడేమి చేయును? అతడు వచ్చి, ఆ కాపులను సంహరించి, యితరులకు ఆ ద్రాక్షతోట ఇచ్చును గదా. మరియు
మార్కు సువార్త 12 : 10 (TEV)
ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయెను
మార్కు సువార్త 12 : 11 (TEV)
ఇది ప్రభువువలననే కలిగెను ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను లేఖనము మీరు చదువలేదా? అని అడుగగా
మార్కు సువార్త 12 : 12 (TEV)
తమ్మును గూర్చి ఆ ఉపమానము చెప్పెనని వారు గ్రహించి ఆయ నను పట్టుకొనుటకు సమయము చూచుచుండిరి గాని జన సమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయిరి.
మార్కు సువార్త 12 : 13 (TEV)
వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని, పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి.
మార్కు సువార్త 12 : 14 (TEV)
వారు వచ్చిబోధకుడా, నీవు సత్యవంతుడవు; నీవు ఎవనిని లక్ష్యపెట్టనివాడవని మే మెరుగుదుము; నీవు మోమోటములేనివాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. కైసరుకు పన్ని చ్చుట న్యాయమా కాదా?
మార్కు సువార్త 12 : 15 (TEV)
ఇచ్చెదమా ఇయ్యకుందుమా? అని ఆయన నడిగిరి. ఆయన వారి వేషధారణను ఎరిగిమీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దేనారము1 నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పెను.
మార్కు సువార్త 12 : 16 (TEV)
వారు తెచ్చిరి, ఆయనఈ రూపమును, పై వ్రాతయు, ఎవరివని వారి నడుగగా వారుకైసరువి అనిరి.
మార్కు సువార్త 12 : 17 (TEV)
అందుకు యేసుకైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా వారాయననుగూర్చి బహుగా ఆశ్చర్యపడిరి.
మార్కు సువార్త 12 : 18 (TEV)
పునరుత్థానము లేదని చెప్పెడి సద్దూకయ్యులు ఆయన యొద్దకువచ్చి
మార్కు సువార్త 12 : 19 (TEV)
బోధకుడా, తనభార్య బ్రదికియుండగా ఒకడు పిల్లలు లేక చనిపోయినయెడల వాని సహోదరుడు వాని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతా నము కలుగజేయవలెనని మోషే మాకు వ్రాసియిచ్చెను.
మార్కు సువార్త 12 : 20 (TEV)
ఏడుగురు సహోదరులుండిరి. మొదటివాడు ఒక స్త్రీని పెండ్లిచేసికొని సంతానములేక చనిపోయెను
మార్కు సువార్త 12 : 21 (TEV)
గనుక రెండవవాడు ఆమెను పెండ్లి చేసికొనెను, వాడును సంతా నము లేక చనిపోయెను; అటువలెనే మూడవవాడును చనిపోయెను.
మార్కు సువార్త 12 : 22 (TEV)
ఇట్లు ఏడుగురును సంతానములేకయే చని పోయిరి. అందరివెనుక ఆ స్త్రీయు చనిపోయెను.
మార్కు సువార్త 12 : 23 (TEV)
పునరుత్థానమందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును? ఆమె ఆ యేడుగురికిని భార్య ఆయెను గదా అని అడిగిరి.
మార్కు సువార్త 12 : 24 (TEV)
అందుకు యేసుమీరు లేఖనములనుగాని దేవుని శక్తినిగాని యెరుగక పోవుటవలననే పొరబడు చున్నారు.
మార్కు సువార్త 12 : 25 (TEV)
వారు మృతులలోనుండి లేచునప్పుడు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్యబడరు గాని పరలోక మందున్న దూతలవలె నుందురు.
మార్కు సువార్త 12 : 26 (TEV)
వారు లేచెదరని మృతులనుగూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదువలేదా? ఆ భాగములో దేవుడునేను అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనని అతనితో చెప్పెను.
మార్కు సువార్త 12 : 27 (TEV)
ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు. కావున మీరు బహుగా పొరబడు చున్నారని వారితో చెప్పెను.
మార్కు సువార్త 12 : 28 (TEV)
శాస్త్రులలో ఒకడు వచ్చి, వారు తర్కించుట విని, ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చెనని గ్రహించిఆజ్ఞ లన్నిటిలో ప్రధానమైనదేదని ఆయన నడిగెను.
మార్కు సువార్త 12 : 29 (TEV)
అందుకు యేసుప్రధానమైనది ఏదనగాఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు.
మార్కు సువార్త 12 : 30 (TEV)
నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె ననునది ప్రధానమైన ఆజ్ఞ.
మార్కు సువార్త 12 : 31 (TEV)
రెండవది, నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలె ననునది రెండవ ఆజ్ఞ; వీటికంటె ముఖ్యమైన ఆజ్ఞ మరే దియు లేదని అతనితో చెప్పెను
మార్కు సువార్త 12 : 32 (TEV)
ఆ శాస్త్రిబోధకుడా, బాగుగా చెప్పితివి; ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే.
మార్కు సువార్త 12 : 33 (TEV)
పూర్ణ హృదయముతోను, పూర్ణవివేకముతోను, పూర్ణ బలముతోను, ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్ను వలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటెను బలులకంటెను అధికమని ఆయ నతో చెప్పెను.
మార్కు సువార్త 12 : 34 (TEV)
అతడు వివేకముగా నుత్తరమిచ్చెనని యేసు గ్రహించినీవు దేవుని రాజ్యమునకు దూరముగ లేవని అతనితో చెప్పెను. ఆ తరువాత ఎవడును ఆయ నను ఏ ప్రశ్నయు అడుగ తెగింపలేదు.
మార్కు సువార్త 12 : 35 (TEV)
ఒకప్పుడు యేసు దేవాలయములో బోధించుచుండగా క్రీస్తు, దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నా రేమి?
మార్కు సువార్త 12 : 36 (TEV)
నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదే పరిశుద్ధాత్మవలన చెప్పెను.
మార్కు సువార్త 12 : 37 (TEV)
దావీదు ఆయ నను ప్రభువని చెప్పుచున్నాడే, ఆయన ఏలాగు అతని కుమారుడగునని అడిగెను. సామాన్యజనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి.
మార్కు సువార్త 12 : 38 (TEV)
మరియు ఆయన వారికి బోధించుచు నిట్లనెను శాస్త్రులనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు నిలువు టంగీలు ధరించుకొని తిరుగుటను, సంతవీధులలో వందనములను
మార్కు సువార్త 12 : 39 (TEV)
సమాజమందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్ర స్థానములను కోరుచు
మార్కు సువార్త 12 : 40 (TEV)
విధవరాండ్ర యిండ్లు దిగమిం గుచు, మాయవేషముగా దీర్ఘప్రార్థనలు చేయుదురు. వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురనెను.
మార్కు సువార్త 12 : 41 (TEV)
ఆయన కానుకపెట్టె యెదుట కూర్చుండి, జనసమూ హము ఆ కానుకపెట్టెలో డబ్బులు వేయుట చూచు చుండెను. ధనవంతులైనవారనేకులు అందులో విశేష ముగా సొమ్ము వేయుచుండిరి.
మార్కు సువార్త 12 : 42 (TEV)
ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా
మార్కు సువార్త 12 : 43 (TEV)
ఆయన తన శిష్యులను పిలిచికానుకపెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటె ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెనని మీతో నిశ్చయ ముగా చెప్పుచున్నాను.
మార్కు సువార్త 12 : 44 (TEV)
వారందరు తమకు కలిగిన సమృద్ధిలోనుండి వేసిరి గాని, యీమె తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవనమంతయు వేసెనని చెప్పెను.
❮
❯