మార్కు సువార్త 15 : 1 (TEV)
ఉదయము కాగానే ప్రధానయాజకులును పెద్ద లును శాస్త్రులును మహాసభవారందరును కలిసి ఆలోచన చేసి, యేసును బంధించి తీసికొనిపోయి పిలాతునకు అప్ప గించిరి.
మార్కు సువార్త 15 : 2 (TEV)
పిలాతుయూదులరాజవు నీవేనా? అని ఆయన నడుగగా ఆయననీవన్నట్టే అని అతనితో చెప్పెను.
మార్కు సువార్త 15 : 3 (TEV)
ప్రధానయాజకులు ఆయనమీద అనేకమైన నేరములు మోపగా
మార్కు సువార్త 15 : 4 (TEV)
పిలాతు ఆయనను చూచి మరలనీవు ఉత్తర మేమియు చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనెను.
మార్కు సువార్త 15 : 5 (TEV)
అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్య పడెను.
మార్కు సువార్త 15 : 6 (TEV)
ఆ పండుగలో వారు కోరుకొనిన యొక ఖయిదీని పిలాతు విడిపించువాడు.
మార్కు సువార్త 15 : 7 (TEV)
అధికారుల నెదిరించి, కలహ ములో నరహత్య చేసినవారితో కూడ బంధించబడియుండిన బరబ్బ అను ఒకడుండెను.
మార్కు సువార్త 15 : 8 (TEV)
జనులు గుంపుగా కూడివచ్చి, అతడు అదివరకు తమకు చేయుచువచ్చిన ప్రకారము చేయవలెనని అడుగగా
మార్కు సువార్త 15 : 9 (TEV)
ప్రధానయాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని
మార్కు సువార్త 15 : 10 (TEV)
పిలాతు తెలిసికొనినేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా? అని అడిగెను.
మార్కు సువార్త 15 : 11 (TEV)
అతడు బరబ్బను తమకు విడుదల చేయ వలెనని జనులు అడుగుకొనునట్లు ప్రధానయాజకులు వారిని ప్రేరేపించిరి.
మార్కు సువార్త 15 : 12 (TEV)
అందుకు పిలాతు అలాగైతే యూదుల రాజని మీరు చెప్పువాని నేనేమి చేయుదునని మరల వారి నడిగెను.
మార్కు సువార్త 15 : 13 (TEV)
వారువానిని సిలువవేయుమని మరల కేకలువేసిరి.
మార్కు సువార్త 15 : 14 (TEV)
అందుకు పిలాతుఎందుకు? అతడే చెడుకార్యము చేసె నని వారి నడుగగా వారువానిని సిలువవేయుమని మరి ఎక్కువగా కేకలువేసిరి.
మార్కు సువార్త 15 : 15 (TEV)
పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సుగలవాడై వారికి బరబ్బను విడుదలచేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయ నప్పగించెను.
మార్కు సువార్త 15 : 16 (TEV)
అంతట సైనికులు ఆయనను ప్రేతోర్యమను అధికార మందిరములోపలికి తీసికొనిపోయి, సైనికులనందరిని సమ కూర్చుకొనినతరువాత
మార్కు సువార్త 15 : 17 (TEV)
ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి, ముండ్ల కిరీటమును ఆయన తల మీదపెట్టి,
మార్కు సువార్త 15 : 18 (TEV)
యూదులరాజా, నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి.
మార్కు సువార్త 15 : 19 (TEV)
మరియు రెల్లుతో ఆయన తలమీదకొట్టి, ఆయనమీద ఉమి్మవేసి, మోకాళ్లూని ఆయనకు నమ స్కారముచేసిరి.
మార్కు సువార్త 15 : 20 (TEV)
వారు ఆయనను అపహసించిన తరు వాత ఆయనమీద నున్న ఊదారంగు వస్త్రము తీసివేసి, ఆయన బట్టలాయనకు తొడిగించి, ఆయనను సిలువవేయు టకు తీసికొనిపోయిరి.
మార్కు సువార్త 15 : 21 (TEV)
కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరినుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా, ఆయన సిలువను మోయు టకు అతనిని బలవంతముచేసిరి.
మార్కు సువార్త 15 : 22 (TEV)
అతడు అలెక్సంద్రు నకును రూఫునకును తండ్రి. వారు గొల్గొతా అనబడిన చోటునకు ఆయనను తీసికొని వచ్చిరి. గొల్గొతా అనగా కపాల స్థలమని అర్థము.
మార్కు సువార్త 15 : 23 (TEV)
అంతట బోళము కలిపిన ద్రాక్షారసము ఆయనకిచ్చిరి గాని ఆయన దాని పుచ్చు కొనలేదు.
మార్కు సువార్త 15 : 24 (TEV)
వారాయనను సిలువవేసి, ఆయన వస్త్రముల భాగము ఎవనికి రావలెనో చీట్లువేసి, వాటిని పంచు కొనిరి.
మార్కు సువార్త 15 : 25 (TEV)
ఆయనను సిలువవేసినప్పుడు పగలు తొమి్మది గంటలాయెను.
మార్కు సువార్త 15 : 26 (TEV)
మరియుయూదులరాజైన యేసు అని ఆయనమీద మోపబడిన నేరమును వ్రాసి పైగానుంచిరి.
మార్కు సువార్త 15 : 27 (TEV)
మరియు కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని
మార్కు సువార్త 15 : 28 (TEV)
ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతొకూడ సిలువవేసిరి.
మార్కు సువార్త 15 : 29 (TEV)
అప్పుడు ఆ మార్గమున వెళ్లుచున్నవారు తమ తలలూచుచు ఆహా దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా,
మార్కు సువార్త 15 : 30 (TEV)
సిలువమీదనుండి దిగి, నిన్ను నీవే రక్షించు కొనుమని చెప్పి ఆయనను దూషించిరి.
మార్కు సువార్త 15 : 31 (TEV)
అట్లు శాస్త్రు లును ప్రధానయాజకులును అపహాస్యము చేయుచువీడితరులను రక్షించెను, తన్ను తాను రక్షించుకొనలేడు.
మార్కు సువార్త 15 : 32 (TEV)
ఇశ్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు సిలువమీదనుండి దిగి రావచ్చును. అప్పుడు మనము చూచి నమ్ముదమని యొకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతోకూడ సిలువ వేయబడినవారును ఆయనను నిందించిరి.
మార్కు సువార్త 15 : 33 (TEV)
మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను.
మార్కు సువార్త 15 : 34 (TEV)
మూడు గంటలకు యేసు ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను; అ మాటలకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యివిడిచితివని అర్థము.
మార్కు సువార్త 15 : 35 (TEV)
దగ్గర నిలిచినవారిలో కొందరు ఆ మాటలు విని అదిగో ఏలీయాను పిలుచు చున్నాడనిరి.
మార్కు సువార్త 15 : 36 (TEV)
ఒకడు పరుగెత్తిపోయి యొక స్పంజీ చిరకాలోముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాళుడి; ఏలీయా వీని దింపవచ్చు నేమో చూతమనెను.
మార్కు సువార్త 15 : 37 (TEV)
అంతట యేసు గొప్ప కేకవేసి ప్రాణము విడిచెను.
మార్కు సువార్త 15 : 38 (TEV)
అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందివరకు రెండుగా చినిగెను.
మార్కు సువార్త 15 : 39 (TEV)
ఆయన కెదురుగా నిలిచియున్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణము విడుచుట చూచి--నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. కొందరు స్త్రీలు దూరమునుండి చూచుచుండిరి.
మార్కు సువార్త 15 : 40 (TEV)
వారిలో మగ్దలేనే మరియయు, చిన్నయాకోబు యోసే అనువారి తల్లియైన మరియయు, సలోమేయు ఉండిరి.
మార్కు సువార్త 15 : 41 (TEV)
ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరాయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసినవారు. వీరు కాక ఆయనతో యెరూష లేమునకు వచ్చిన ఇతర స్త్రీల నేకులును వారిలో ఉండిరి.
మార్కు సువార్త 15 : 42 (TEV)
ఆ దినము సిద్ధపరచు దినము, అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము
మార్కు సువార్త 15 : 43 (TEV)
గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయియ యోసేపు తెగించి, పిలాతునొద్దకు వెళ్లి యేసు దేహము (తనకిమ్మని) యడిగెను. అతడు ఘనత వహించిన యొక సభ్యుడై, దేవుని రాజ్యముకొరకు ఎదురు చూచువాడు.
మార్కు సువార్త 15 : 44 (TEV)
పిలాతుఆయన ఇంతలోనే చని పోయెనా అని ఆశ్చర్యపడి యొక శతాధిపతినితన యొద్దకు పిలిపించిఆయన ఇంతలోనే చనిపోయెనా అని అతని నడిగెను.
మార్కు సువార్త 15 : 45 (TEV)
శతాధిపతివలన సంగతి తెలిసికొని, యోసేపునకు ఆ శవము నప్పగించెను.
మార్కు సువార్త 15 : 46 (TEV)
అతడు నారబట్ట కొని, ఆయనను దింపి, ఆ బట్టతో చుట్టి, బండలో తొలిపించిన సమాధియందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను.
మార్కు సువార్త 15 : 47 (TEV)
మగ్దలేనే మరియయు యోసే తల్లియైన మరియయు ఆయన యుంచబడిన చోటు చూచిరి.
❮
❯