లూకా సువార్త 1 : 1 (TEV)
ఘనతవహించిన థెయొఫిలా,
లూకా సువార్త 1 : 2 (TEV)
ఆరంభమునుండి కన్ను లార చూచి వాక్యసేవకులైనవారు మనకు అప్పగించిన ప్రకారము మనమధ్యను నెరవేరిన కార్యములనుగూర్చి వివరముగ వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు
లూకా సువార్త 1 : 3 (TEV)
గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలిసికొనుటకు వాటి నన్నిటిని మొదటనుండి తరచి పరిష్కారముగా తెలిసికొనియున్న నేనును నీ పేరట
లూకా సువార్త 1 : 4 (TEV)
వాటినిగూర్చి వరుసగా రచించుట యుక్తమని యెంచితిని.
లూకా సువార్త 1 : 5 (TEV)
యూదయదేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జెకర్యా అను ఒక యాజకు డుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతె; ఆమె పేరు ఎలీసబెతు.
లూకా సువార్త 1 : 6 (TEV)
వీరిద్దరు ప్రభువుయొక్క సకల మైన ఆజ్ఞలచొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరప రాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై యుండిరి.
లూకా సువార్త 1 : 7 (TEV)
ఎలీసబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి; మరియు వారిద్దరు బహు కాలము గడచిన (వృద్ధులైరి.)
లూకా సువార్త 1 : 8 (TEV)
జెకర్యా తన తరగతి క్రమముచొప్పున దేవునియెదుట యాజక ధర్మము జరిగించుచుండగా
లూకా సువార్త 1 : 9 (TEV)
యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్లి ధూపమువేయు టకు అతనికి వంతు వచ్చెను.
లూకా సువార్త 1 : 10 (TEV)
ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా
లూకా సువార్త 1 : 11 (TEV)
ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కన బడగా
లూకా సువార్త 1 : 12 (TEV)
జెకర్యా అతని చూచి, తొందరపడి భయపడిన వాడాయెను.
లూకా సువార్త 1 : 13 (TEV)
అప్పుడా దూత అతనితోజెకర్యా భయ పడకుము; నీ ప్రార్థన వినబడినది, నీ భార్యయైన ఎలీస బెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు.
లూకా సువార్త 1 : 14 (TEV)
అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై, ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక,
లూకా సువార్త 1 : 15 (TEV)
తన తల్లిగర్భ మున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై,
లూకా సువార్త 1 : 16 (TEV)
ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును.
లూకా సువార్త 1 : 17 (TEV)
మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతి మంతుల జ్ఞానము ననుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధ పరచుటకై ఏలీయాయొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్లును గనుక నీకు సంతోషమును మహా ఆనంద మును కలుగును; అతడు పుట్టినందున అనేకులు సంతో షింతురనెను.
లూకా సువార్త 1 : 18 (TEV)
జెకర్యాయిది నాకేలాగు తెలియును? నేను ముసలివాడను, నాభార్యయు బహుకాలము గడ చినదని ఆ దూతతో చెప్పగా
లూకా సువార్త 1 : 19 (TEV)
దూతనేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును; నీతో మాటలాడుట కును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని.
లూకా సువార్త 1 : 20 (TEV)
మరియు నా మాటలు వాటికాలమందు నెరవేరును; నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై యుందువని అతనితో చెప్పెను.
లూకా సువార్త 1 : 21 (TEV)
ప్రజలు జెకర్యాకొరకు కనిపెట్టుచుండి, ఆల యమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి.
లూకా సువార్త 1 : 22 (TEV)
అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాటలాడలేక పోయినందున, ఆలయము నందు అతనికి దర్శనము కలిగిన దని వారు గ్రహించిరి; అప్పుడతడు వారికి సంజ్ఞలు చేయుచు, మూగవాడై ¸
లూకా సువార్త 1 : 23 (TEV)
అతడు సేవచేయు దినములు సంపూర్ణ మైనప్పుడు తన యింటికి వెళ్లెను.
లూకా సువార్త 1 : 24 (TEV)
ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలీసబెతు గర్భ వతియైమనుష్యులలో నాకుండిన అవమానమును తీసి వేయుటకు
లూకా సువార్త 1 : 25 (TEV)
నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఈలాగున చేసెననుకొని, అయిదు నెలలు ఇతరుల కంట బడకుండెను.
లూకా సువార్త 1 : 26 (TEV)
ఆరవ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో
లూకా సువార్త 1 : 27 (TEV)
దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యకయొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ.
లూకా సువార్త 1 : 28 (TEV)
ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచిదయాప్రాప్తురాలా నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను.
లూకా సువార్త 1 : 29 (TEV)
ఆమె ఆ మాటకు బహుగా తొందరపడిఈ శుభవచన మేమిటో అని ఆలోచించు కొనుచుండగా
లూకా సువార్త 1 : 30 (TEV)
దూత మరియా,భయపడకుము; దేవునివలన నీవు కృపపొందితివి.
లూకా సువార్త 1 : 31 (TEV)
ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు;
లూకా సువార్త 1 : 32 (TEV)
ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమా రుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును.
లూకా సువార్త 1 : 33 (TEV)
ఆయన యాకోబు వంశస్థులను యుగయుగ ములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను.
లూకా సువార్త 1 : 34 (TEV)
అందుకు మరియనేను పురుషుని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగా
లూకా సువార్త 1 : 35 (TEV)
దూతపరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.
లూకా సువార్త 1 : 36 (TEV)
మరియు నీ బంధువురాలు ఎలీసబెతుకూడ తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి యున్నది; గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవమాసము;
లూకా సువార్త 1 : 37 (TEV)
దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్థ కము కానేరదని ఆమెతో చెప్పెను.
లూకా సువార్త 1 : 38 (TEV)
అందుకు మరియఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమెయొద్ద నుండి వెళ్లెను.
లూకా సువార్త 1 : 39 (TEV)
ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశ ము లోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి
లూకా సువార్త 1 : 40 (TEV)
జెకర్యా యింటిలో ప్రవేశించి, ఎలీసబెతుకు వందనము చేసెను.
లూకా సువార్త 1 : 41 (TEV)
ఎలీసబెతు మరియయొక్క వందనవచనము విన గానే, ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతట ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను
లూకా సువార్త 1 : 42 (TEV)
స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును
లూకా సువార్త 1 : 43 (TEV)
నా ప్రభువు తల్లి నాయొద్దకు వచ్చుట నా కేలాగు ప్రాప్తించెను?
లూకా సువార్త 1 : 44 (TEV)
ఇదిగో నీ శుభవచనము నా చెవినిపడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను.
లూకా సువార్త 1 : 45 (TEV)
ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమి్మన ఆమె ధన్యురాలనెను.
లూకా సువార్త 1 : 46 (TEV)
అప్పుడు మరియ యిట్లనెను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది.
లూకా సువార్త 1 : 47 (TEV)
ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను
లూకా సువార్త 1 : 48 (TEV)
నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు ఆనందించెను.
లూకా సువార్త 1 : 49 (TEV)
సర్వశక్తిమంతుడు నాకు గొప్పకార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్నితరములవారును నన్ను ధన్యురాలని యందురు. ఆయన నామము పరిశుద్ధము.
లూకా సువార్త 1 : 50 (TEV)
ఆయనకు భయపడువారిమీద ఆయన కనికరము తర తరములకుండును.
లూకా సువార్త 1 : 51 (TEV)
ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను.
లూకా సువార్త 1 : 52 (TEV)
సింహాసనములనుండి బలవంతులను పడద్రోసి దీనుల నెక్కించెను
లూకా సువార్త 1 : 53 (TEV)
ఆకలిగొనినవారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టిచేతులతో పంపివేసెను.
లూకా సువార్త 1 : 54 (TEV)
అబ్రాహామునకును అతని సంతానమునకును యుగాం తమువరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసికొందునని మనపితరులతో సెలవిచ్చినట్టు
లూకా సువార్త 1 : 55 (TEV)
ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను.
లూకా సువార్త 1 : 56 (TEV)
అంతట మరియ, యించుమించు మూడు నెలలు ఆమెతోకూడ ఉండి, పిమ్మట తన యింటికి తిరిగి వెళ్లెను.
లూకా సువార్త 1 : 57 (TEV)
ప్రసవకాలము వచ్చినప్పుడు ఎలీసబెతు కుమారుని కనెను.
లూకా సువార్త 1 : 58 (TEV)
అప్పుడు ప్రభువు ఆమెమీద మహాకనికరముంచె నని ఆమె పొరుగువారును బంధువులును విని ఆమెతో కూడ సంతోషించిరి.
లూకా సువార్త 1 : 59 (TEV)
ఎనిమిదవ దినమున వారు ఆ శిశు వుకు సున్నతి చేయవచ్చి, తండ్రి పేరునుబట్టి జెకర్యా అను పేరు వానికి పెట్టబోవుచుండగా
లూకా సువార్త 1 : 60 (TEV)
తల్లి ఆలాగు వద్దు; వానికి యోహానను పేరు పెట్టవలెనని చెప్పెను.
లూకా సువార్త 1 : 61 (TEV)
అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడును లేడే అని ఆమెతో చెప్పి
లూకా సువార్త 1 : 62 (TEV)
వానికి ఏ పేరు పెట్టగోరు చున్నావని వాని తండ్రికి సంజ్ఞలుచేసి అడిగిరి.
లూకా సువార్త 1 : 63 (TEV)
అతడు వ్రాతపలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను; అందుకు వారందరు ఆశ్చర్యపడిరి.
లూకా సువార్త 1 : 64 (TEV)
వెంటనే అతని నోరు తెరవబడి, నాలుక సడలి, అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగెను.
లూకా సువార్త 1 : 65 (TEV)
అందునుబట్టి వారి చుట్టుపట్ల కాపుర మున్న వారికందరికిని భయము కలిగెను. ఆ సంగతు లన్నియు యూదయ కొండసీమలయందంతట ప్రచుర మాయెను.
లూకా సువార్త 1 : 66 (TEV)
ప్రభువు హస్తము అతనికి తోడైయుండెను గనుక ఆ సంగతులను గూర్చి వినినవారందరును ఈ బిడ్డ యేలాటివాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకొనిరి.
లూకా సువార్త 1 : 67 (TEV)
మరియు అతని తండ్రి జెకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై యిట్లు ప్రవచించెను
లూకా సువార్త 1 : 68 (TEV)
ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక
లూకా సువార్త 1 : 69 (TEV)
ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, వారికి విమోచన కలుగజేసెను
లూకా సువార్త 1 : 70 (TEV)
తన సేవకుడైన దావీదు వంశమునందు మనకొరకు రక్షణశృంగమును, అనగా
లూకా సువార్త 1 : 71 (TEV)
మన శత్రువులనుండియు మనలను ద్వేషించు వారందరి చేతినుండియు తప్పించి రక్షణ కలుగజేసెను.
లూకా సువార్త 1 : 72 (TEV)
దీనినిగూర్చి ఆయన ఆదినుండి తన పరిశుద్ధప్రవక్తల నోట పలికించెను.
లూకా సువార్త 1 : 73 (TEV)
ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రియైన
లూకా సువార్త 1 : 74 (TEV)
అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసికొనుటకును
లూకా సువార్త 1 : 75 (TEV)
మనము శత్రువుల చేతినుండి విడిపింపబడి, మన జీవిత కాలమంతయు నిర్భయులమై, ఆయన సన్నిధిని
లూకా సువార్త 1 : 76 (TEV)
పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను.
లూకా సువార్త 1 : 77 (TEV)
మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవన బడుదువు మన దేవుని మహా వాత్సల్యమునుబట్టి వారి పాపము లను క్షమించుటవలన
లూకా సువార్త 1 : 78 (TEV)
తన ప్రజలకు రక్షణజ్ఞానము ఆయన అనుగ్రహించు నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు.
లూకా సువార్త 1 : 79 (TEV)
మన పాదములను సమాధాన మార్గములోనికి నడి పించునట్లు చీకటిలోను మరణచ్ఛాయలోను కూర్చుండువారికి వెలుగిచ్చుటకై ఆ మహా వాత్సల్య మునుబట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శన మనుగ్రహించెను.
లూకా సువార్త 1 : 80 (TEV)
శిశువు ఎదిగి, ఆత్మయందు బలము పొంది, ఇశ్రాయేలు నకు ప్రత్యక్షమగు దినమువరకు అరణ్య ములో నుండెను.
❮
❯