లూకా సువార్త 14 : 1 (TEV)
విశ్రాంతిదినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని యింటిలోనికి వెళ్లినప్పుడు, ఆయన ఏమి చేయునో అని వారాయనను కనిపెట్టు చుండిరి.
లూకా సువార్త 14 : 2 (TEV)
అప్పుడు జలోదర రోగముగల యొకడు ఆయన యెదుట ఉండెను.
లూకా సువార్త 14 : 3 (TEV)
యేసు విశ్రాంతిదినమున స్వస్థపరచుట న్యాయమా కాదా?
లూకా సువార్త 14 : 4 (TEV)
అని ధర్మశాస్త్రోపదేశ కులను పరిసయ్యులను అడుగగా వారూరకుండిరి. అప్పు డాయన వానిని చేరదీసి స్వస్థపరచి పంపివేసి
లూకా సువార్త 14 : 5 (TEV)
మీలో ఎవని గాడిదయైనను ఎద్దయినను గుంటలో పడినయెడల విశ్రాంతిదినమున దానిని పైకి తీయడా? అని వారి నడి గెను.
లూకా సువార్త 14 : 6 (TEV)
ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయిరి.
లూకా సువార్త 14 : 7 (TEV)
పిలువబడినవారు భోజనపంక్తిని అగ్రపీఠములు ఏర్పరచు కొనుట చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను.
లూకా సువార్త 14 : 8 (TEV)
నిన్నెవరైనను పెండ్లివిందుకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు; ఒకవేళ నీకంటె ఘనుడు అతని చేత పిలువబడగా
లూకా సువార్త 14 : 9 (TEV)
నిన్నును అతనిని పిలిచినవాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును, అప్పుడు నీవు సిగ్గు పడి కడపటి చోటున కూర్చుండసాగుదువు.
లూకా సువార్త 14 : 10 (TEV)
అయితే నీవు పిలువబడి నప్పుడు, నిన్ను పిలిచినవాడు వచ్చిస్నేహి తుడా, పైచోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము; అప్పుడు నీతోకూడ కూర్చుండు
లూకా సువార్త 14 : 11 (TEV)
తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పెను.
లూకా సువార్త 14 : 12 (TEV)
మరియు ఆయన తన్ను పిలిచినవానితో ఇట్లనెనునీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు, నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువుల నైనను ధనవంతులగు నీ పొరుగువారినైనను పిలువవద్దు; వారు ఒకవేళ నిన్ను మరల పిలుతురు గనుక నీకు ప్రత్యుప కారము కలుగును.
లూకా సువార్త 14 : 13 (TEV)
అయితే నీవు విందు చేయునప్పుడు బీదలను అంగహీనులను కుంటివాండ్రను గ్రుడ్డివాండ్రను పిలువుము.
లూకా సువార్త 14 : 14 (TEV)
నీకు ప్రత్యుపకారము చేయుటకు వారి కేమియు లేదు గనుక నీవు ధన్యుడవగుదువు; నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను.
లూకా సువార్త 14 : 15 (TEV)
ఆయనతో కూడ భోజనపంక్తిని కూర్చుండినవారిలో ఒకడు ఈ మాటలు వినిదేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా
లూకా సువార్త 14 : 16 (TEV)
ఆయన అతనితో నిట్లనెనుఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను.
లూకా సువార్త 14 : 17 (TEV)
విందుకాలమందు అతడు ఇప్పుడు సిద్ధమైయున్నది, రండని పిలువబడినవారితో చెప్పుటకు తన దాసుని పంపెను.
లూకా సువార్త 14 : 18 (TEV)
అయితే వారందరు ఏకమనస్సుతో నెపములు చెప్ప సాగిరి. మొదటివాడునేనొక పొలము కొనియున్నాను, అవశ్యముగా వెళ్లి దాని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడు కొనుచున్నాన
లూకా సువార్త 14 : 19 (TEV)
మరియెకడునేను అయిదు జతల యెడ్లను కొనియున్నాను, వాటిని పరీక్షింప వెళ్లుచున్నాను, నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నాననెను.
లూకా సువార్త 14 : 20 (TEV)
మరి యొకడునేనొక స్త్రీని వివాహము చేసికొన్నాను; అందుచేత నేను రాలేననెను.
లూకా సువార్త 14 : 21 (TEV)
అప్పుడా దాసుడు తిరిగి వచ్చి యీ మాటలు తన యజమానునికి తెలియజేయగా, ఆ యింటి యజ మానుడు కోపపడినీవు త్వరగాపట్టణపు వీధులలోనికిని సందులలోనికిని వెళ్లి, బీదలను అంగహీను ల
లూకా సువార్త 14 : 22 (TEV)
అంతట దాసుడు ప్రభువా,నీ వాజ్ఞాపించినట్టు చేసితినిగాని యింకను చోటున్నదని చెప్పెను.
లూకా సువార్త 14 : 23 (TEV)
అందుకు యజమానుడు--నా యిల్లు నిండు నట్లు నీవు రాజమార్గములలోనికిని కంచెలలోనికిని వెళ్లి లోపలికి వచ్చుటకు అక్కడివారిని బలవంతము చేయుము;
లూకా సువార్త 14 : 24 (TEV)
ఏలయనగా పిలువబడిన ఆ మనుష్యులలో ఒకడును నా విందు రుచిచూడడని మీతో చెప్పుచున్నాననెను.
లూకా సువార్త 14 : 25 (TEV)
బహు జనసమూహములు ఆయనతోకూడ వెళ్లు చున్నప్పుడు ఆయన వారితట్టు తిరిగి
లూకా సువార్త 14 : 26 (TEV)
ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్న దమ్ములను అక్కచెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు.
లూకా సువార్త 14 : 27 (TEV)
మరియు ఎవడైనను తన సిలువను మోసికొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు.
లూకా సువార్త 14 : 28 (TEV)
మీలో ఎవ డైనను ఒక గోపురము కట్టింప గోరిన యెడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్కచూచుకొనడా?
లూకా సువార్త 14 : 29 (TEV)
చూచుకొననియెడల అతడు దాని పునాదివేసి, ఒకవేళ దానిని కొనసాగింప లేక పోయినందున
లూకా సువార్త 14 : 30 (TEV)
చూచువారం దరుఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టెను గాని కొన సాగింపలేక పోయెనని అతని చూచి యెగతాళి చేయ సాగుదురు.
లూకా సువార్త 14 : 31 (TEV)
మరియు ఏ రాజైనను మరియొక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తనమీదికి ఇరువదివేల మందితో వచ్చువానిని పదివేలమందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలో చింపడా?
లూకా సువార్త 14 : 32 (TEV)
శక్తి లేనియెడల అతడింకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసికొన చూచును గదా.
లూకా సువార్త 14 : 33 (TEV)
ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచి పెట్టనివాడు నా శిష్యుడు కానేరడు.
లూకా సువార్త 14 : 34 (TEV)
ఉప్పు మంచిదేగాని ఉప్పు నిస్సారమైతే దేనివలన దానికి సారము కలుగును?
లూకా సువార్త 14 : 35 (TEV)
అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనుక దానిని బయట పారవేయుదురు. విను టకు చెవులుగలవాడు వినునుగాక అని వారితో చెప్పెను.
❮
❯